Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137065 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!శ్రీ గురుగీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥


               శ్రీ హాజరత ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ ) 

61. నీ దర్బారొక యింద్రభోగముగ రాణించెన్ గదా ! ఖవ్వలీ
      నాద శ్రీ వెలుగొంద నాట్యసుషమానందంబు పెంపొంద స
      మ్మోదమ్మే వెలుగొంద భక్తజన సంపూజ్యుడవై నిల్చు ని
      న్నాదర్శంబుగ కొల్పుకొంద్రు దివిజుల్ హర్షింప ;ఖాదర్వలీ !

62. పారావారగభీరమై విశదమై బ్రహ్మాండ భాండంబులన్
      బారంజూడగ జాలిభక్త తతులంబాలింపగానెంచు -నీ
      వే రాజీవదళాక్షు డందురనురక్తిన్ శంఖచక్రాది కై
      వారంబుల్ పదపద్మముల్ గొలుచుటన్ భవ్యాత్మ ! ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   
« Last Edit: June 18, 2018, 06:07:42 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

63. అవతారములు దాల్చినట్టి హరి మున్నారాక్షసానీకము
      న్నవనింగూల్చె సుయుద్ధరంగమున భక్త శ్రేణులంగావ -క
     ల్యావతారంబున రక్తపాతమిసుమంతై నంగనన్రాని స
     ద్వ్యవసాయమును గూర్చినావు -నిలువన్ ధర్మంబు ,ఖాదర్వలీ !

64. కాదర్ వాక్యము దబ్బరై చనదు  లోకంబంధు దుఃకార్తులన్
      సాదామార్గమునందు జేర్చు కలిమిన్ సాధించు -సచ్చీలస
     మ్మోదాబబ్ధిన్ గడు జేర్చునన్న పలుకుల్ మున్విన్నవారెన్ని పు
    ణ్యాదుల్  చేసిరొ నీసమక్షమున వాదాతీత ! ఖాదర్వలీ !


 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:08:28 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥   

                   
శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

65. కులముల్ లేవు మతాలులేవు కనగా గోత్రాలు కన్రావు క
      క్షలు కార్పణ్యములుండ బోవు -సిరులంజర్చింపగా బోవు -దు
     ర్భల శక్తిందరి జేరనీవు భవదీయా స్థానమందెప్దు  -ని
     శ్చల సాక్షాద్గురుభక్తిపూర్ణ విలసత్ స్థానంబు ఖాదర్వలీ !

66. తాతల్ తండ్రులు నాలుబిడ్డలును పుత్రవ్రాతముల్లూడి -వి
      ఖ్యాతింగాంచె కుటుంబమంచు మునులోకంబందు -నీనాడు లే
      దా ,తోషంబు ,నశించే ,నిర్వరికివారల్ ,పెద్దలై ,కూడి ,ని
     ర్భీతిన్ వేర్పడిపోయె ,నాగరికతావేషాన ;ఖాదర్వలీ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:09:10 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

       శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

67. జనకున్నిత్యము కష్టపెట్టుచు ,భవిష్యత్కార్యమూహింప ,నే
     రని పుత్రుండు ,సుపుత్రుడా ! తనదు తర్తవ్యంబుపోనాడి ,-దు
     ర్జన సావాసమునన్ ,గులంబుజెరువన్ ,పాల్పడ్డవానిన్ ,వేసిన్
     పనిబూనావల త్రోయ నేరమగునా ! భావింప ;ఖాదర్వలీ !

68. నా యిల్లాలిది ,నా సుపుత్రుడతడే ,నా యల్లుడీతండె ,నా
     బాయీ యీతడటంచు ,చెప్పుకొనగా వాత్సల్య భావంబులన్
    శ్రేయస్కామనలున్ ,వెలుంగవలె ,- దారింబోవు దానయ్యలే
    శ్రీయాసింతగ ,- వారి నమ్మదగునా ,చింతింప ;ఖాదర్వలీ ! అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

« Last Edit: June 18, 2018, 06:09:52 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

  హజరత్ ఖాదర్ వలీ శతకము (షేక్ అలీ )

69. తన స్వార్థంబున ,కెట్టి దౌష్ట్యమునకైనం బాలుబడ్డట్టె ,వా
      నిని ,నమ్మంగ ఘట్టిల్లు ముప్పు ,- మదిలో నీచత్వముంబూని ,చె
     ప్పిన తీరుంవిడి ,కార్యసాధనకు ఖూనీజేసి ధత్మంబు,-నె
      గ్గిన ,వాడేల్లవుదర్హుడౌన ,జన సంఘంబందు ,ఖాదర్వలీ !

70. నాలో దోషములేదు ,నేనొరుల నన్యాయంబుగాదూర ,నా
      కేలా లోకుల గోలయంచు ,కడుభక్తి నిన్ను నర్చించు ,వా
      డోలిన్ శాంతి విహీనుడయ్యేగద! దుష్టుల్ పన్ను పన్నాగముల్
      దూలింపంగ ,సమర్ధు డేవ్వడిల సాధూ ! మౌల్వీ !ఖాదర్వలీ !


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:10:41 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )

71.   నీరుంబోసి నతమ్ము పెంచు నపుడే ,నిక్కంబుగా ,భూరుహం
        బారుంగాలములందు పంటనిడు ,చేవముజూపు ,-కాకున్నచో                     
        సారంబున్ వడిగోలుపోవు ,-నటులేసర్వేశు ,నిత్యంబు ,లో
        నారాధించెడి ,వానికే ,సిలుగు ,లెల్లందీరు ;ఖాదర్వలీ !

72.  కాలాహిందరి జేర్చుకొంచు ,మదిలో కారుణ్యమేపార ,దా ,
       బాలుంజక్కెరబోసి ,పెంచిన స్వభావంబేల పోనాడు ,- దు
        శ్మీలుండట్టులె ,కీడుచేయు తనకున్ శ్రేయంబు చేకూర్చు ,స
       చ్చీలుంజేరి ,యఘంబటంచనడుగా -చిత్తాన ;ఖాదర్వలీ !అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:11:48 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   


శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

73.ఆలోచించు ,కూరుచున్న యెడలన్ ,ఆత్మవ్యధా హేతువై
     కూలంద్రోయును ,మాననీయు ,నతడుక్కుంబిందమై లేచినన్ ,
     కాలుండైనను ,నాపలేడు ,జన తాకళ్యాణముంగోరు ,స
     చ్చీలుడౌటనతండు ,-దైవబలమున్ సిద్ధించు ,ఖాదర్వలీ !

74. తలితండ్రాదుల కష్టపెట్టు నిజపుత్రాకార శత్రుండు ,భ
      ర్తల వేధించెడి భార్య ,వితంతులకు బాధల్ గూర్చు దుర్జాతి భ
      ర్తలు ,కన్పింతురుగాని ,-సద్గురుని జేరన్ వచ్చి కీడెంచు ,శి
      ష్యులు కన్పింతురే ? నేడు చూడగలరీ చోద్యంబు ;ఖాదర్వలీ !
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


« Last Edit: June 18, 2018, 06:12:37 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

75. గురుశుశ్రూష యొనర్చి జేర్చినది సంకోచంబు లేకుండ ,దే
     వ రహస్యంబుగ బోధ చేసితిని ,-శిష్యా నీకా ముంజేర్చుకొం
    చు ,రసోద్దీప కవిత్వముల్ బలికితిన్ ,శోభిల్లగా నల్బదేం
     డ్లరయంగా ,నికమేమి కావలయు దేవా ! మౌల్వీ !ఖాదర్వలీ !

76. బాబాలెల్లరు ,సర్వధర్మముల సంభావించున్ ,సత్కృపన్
      డాబుల్ చూపక ,సాకగావలయు ,తోడై భక్తులన్ ,కాని యే
     సాబో కొందరి మంచిచెడ్డలను చర్చల్ చేయుచున్ ,తీర్చినన్
    బాబాలెందుకు ,ద్వేషభావములతో ,బాధింప ;ఖాదర్వలీ !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
« Last Edit: June 18, 2018, 06:13:18 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

77.  నిన్నుంబోలినవారు లేరనుటయే నిక్కంబు ,కానీ ,దయో
       త్పన్న స్వాంతులు ,కొందరాపరము సేవాతత్పరుల్ ,భక్తులన్
       కన్నాకుంబలే నాకుచుండ్రు నిజమే ,-కర్మానుకూలార్ధ మె
       ట్లున్నన్ ,దైవము తోడుపాటువలయున్నాప్పార ! ఖాదర్వలీ !

78. పరభాగ్యంబును గోరువారు ,పరులన్ బాధించు వారెప్పుడున్ ,
      నరహత్యల్ జరిపించేవారు ,వరుసన్ నారీజనంబున్ ,నిరా
     దర చిత్తంబున గాంచువారు ,శిశుహత్యల్ చేయువారున్ ,సదా
     పరమాసక్తి భజింత్రు దైవమును బాబా ! వింత ! ఖాదర్వలీ !
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 
« Last Edit: June 18, 2018, 06:13:57 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

79.   చదువున్ నేర్పుటో ,సర్వధర్మముల విశ్వాసంబు కల్గించుటో ,
       సదసద్యోచన చేయుటో ,పరమునిన్ సద్భక్తి పూజించుటో ,
       మృదువాక్యంబుల శార్తులందనువుటో ,మేలెంచి దీవించుటో ,
        కద ! బాబాల విశిష్ట ధర్మంమటుకాకం జేటు ;ఖాదర్వలీ !

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:15:41 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

80. ప్రతి గ్రామమును ,నుద్ధరించునొక బాబా ,సద్గురూత్తం సమై
       వేతలంబాపుదునంచువచ్చు ,ప్రజకావేషంబు గ్రాహ్యంబు కా
      కతి భక్తీంభజియింత్రు వాని ,తుదకాకష్టుండు ,కాంతా జవో
      చిత మానంబును దోచు ,నేచు ,నిదిబల్ చిత్రంబు ;ఖాదర్వలీ !

81. ఒకడే దేవుడన్నమాట నిజమే ,యుర్విన్ ప్రజాకోటి ,దొ
       క్కొక మార్గమ్ముగదా ! యెవండెవని మ్రొక్కుల్ దీర్చునన్ ,మున్గిపో
       దకలం కంబగు దైవభావము ,-స్వకీయంబైన ధర్మంబు -వే
       రొక సిందూరినయడ్డె,కయ్యములు రేగున్ ధాత్రి ! ఖాదర్వలీ !

 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:16:54 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )


82. సాయీబాబును గాంచినాడ ,కనుమూర్ సంస్థానమందా ,వలీ
      స్థాయిన్ గాంచి తరించినాడ ,సహమద్భాద్వాసినాయబ్ రసూల్
      ధ్యేయంగాంచినవాడ, గర్తపురిమూర్తిల్ కాలేమస్తాన్ వలీ                             
     శ్రీయుంగాంచినవాడ, కాని కరువయ్యెన్ శాంతి ;ఖాదర్వలీ !

83. వీరెల్లన్ సమతానురాగ ప్రతిభా విర్భూత మార్గాన -వే
      ర్వేరంజీవులనుద్ధరించు జనులే -విశ్వేశునభ్యర్చనా
       ధార ప్రజ్ఞ వెలుంగునట్టి మునులే ,- ధర్మైక మార్గంబునన్
      సారాసారము లుగ్గడించు ఋషులే ,-సత్యంబు ;ఖాదర్వలీ !


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

« Last Edit: June 18, 2018, 06:17:42 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

84. అరయన్ ఉత్తభారతంబిల ప్రశంసార్హంబు ,- సూఫీమత
     స్థిర సౌభాగ్యమునందు ,నజ్మీరుపురశ్రీ " కాజామోహ్దీన్ ను " దయయా
     భరితం బైవెలుగొందె ,-నాగపురి బాబా తాజుద్దీన్ వాసమై
     కరమాహ్లాదము గూర్చె ,నీ గురుడు విఖ్యాతుఁడు ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:28:54 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః


 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

85. "మేరే ,దిల్క ,దరద్ ,దవావనుచు ", నిన్ మేలైన "ఖవ్వా " లిలన్
       సారోదాత్త గళంబులన్ ,సతము ప్రస్తావింపగావించు -భా
      క్తారాధ్యుండవుగా ;హసన్ముఖుడవై ,కన్పట్టు నీ సుందరా
     కారంబున్ ,దరిసించి పొంగిరి జనుల్ -కాంక్షించి ;ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:33:02 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

86. " ఇకబాల్ "సత్కవియన్న మాటలివి ,ధాత్రిన్ మానవుందేవ్డు,దై
          వ కటాక్షంబును కోరి మ్రొక్కులిడినన్ ,భక్తిన్ యముందేని యె
          న్నిక ప్రాణంబులుదీయలే ,డిదియే శక్తింగూర్ప ,నా రాజపు
          త్రకు కాపాడితి ,పాముగండ మెలమిన్ దప్పించి ;ఖాదర్వలీ !

87.   ఊరున్ చేరున్ లేని బ్రాహ్మణ జటాయోగిన్ ,సుదూరంబుగా
       చారం ద్రోవితి ,శాస్త్ర చర్చలకు నాహ్వానింప దుష్టాత్ములన్
       చోరం గెల్చితి ,-వన్నదాన సమయంబున్ వర్షహీనంబుగా
       తేరం దీర్చితి ,-నీ మహాత్మ్యముల కంతేలేదు ;ఖాదర్వలీ !


 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!