Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 132916 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

   
 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము (షేక్ అలీ )

బాబాజీ బీదలపాలిట 'వేల్పు చెట్టు ! రోగులకు ధన్వంతరి !' భక్తులకు సాక్షాత్ భగవంతుడే ! విశేష మేమిటంటే ,బాబాగారిని ముస్లిం లు 'వలీ అల్లా ' గా ప్రార్థిస్తున్నారు ,క్రైస్తవులు 'దేవదూతగా ' భావిస్తారు . హిందువులు 'శ్రీ మహావిష్ణువు' గా పూజిస్తారు . అన్ని మతాలూ బాబా మతాలే !

1. శ్రీలం గూరిచి ,శక్తి గూరిచి ,ధరిత్రిన్ సర్వ ధర్మాలలో ,
మేలుం గూరిచి ,మానవాళికి కళామేయ స్థితిం గూర్చి ,య
డ్వేలానంద పథమ్ము గూర్చునతడే ,విశ్వాత్ముడంచన్న ,స
చ్చీలున్ నిన్ను దలంతు ,సత్వగుణరాశీ ! వాసి ! ఖాదర్వలీ !

2. ధర ,నధ్యాత్మిక పూర్ణతత్త్వమును ,సంధానింపగాజేసి ,కొం
     చ ,రయన్ ఖాదరుబాబ రూపమున ,సాక్షాత్కారము జెందె -నీ
నరరూపంబున ,శంఖ చక్రయుగ చిహ్నా దీనపాదంబులన్ ,
స్థిరభావంబున ,విష్ణుడంచు నిను ,సంసేవింత్రు ఖాదర్వలీ !

( హిందువులు బాబాను 'విష్ణు ' సదృశునిగా పూజిస్తారన్న నగ్న సత్యం తేటతెల్లమవుతుంది . )

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

               శ్రీ హజరత్ ఖాదర్  వలీ శతకము (షేక్ అలీ )

3. జననం బందినదాది ,నైహికపుకాంక్షల్ ఎడి ,కైవల్య మా
    ర్గ నిరూథిన్ ,దపమాచరించి ,బుధవర్గం బెల్ల నగ్గింప ,సా
    ధన గావించిన ,నీయచంచల ,ప్రయత్నస్ఫూర్తి ,భూలోకమం
   దున ,వేవేల్గులు నింపజాలినది ,విద్యుశ్చక్తి ,ఖాదర్వలీ !

4. చదువుల్ నేర్చి ,ప్రభుత్వ గౌరవములన్ సాధించి ,సం
    పదనార్జించిన ,ఛత్రభామరయశ : ప్రాగల్భ్యముల్ పొందినన్ ,
    మురికిన్ తోషములేదు -శాశ్వత సుఖమ్మా రాదు ,- సర్వేశ్వరా
    భ్యుదయ శ్రీదరి సించకున్నాయనిన్ ,పూజించు ; ఖాదర్వలీ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

5. ఈ విశ్వంభర ,యేయచంచలకళా విన్పూర్తి వెల్గొందుచున్ ,
     జీవ వ్రాతము సాకుచున్నయది యేచిచ్ఛక్తి యోగీంద్ర స
     ద్భావ ప్రేరణకాదియైనయది సర్వానంద ,సంధానమై -
     ఆ విశ్వ ప్రభుశక్తి గొల్తునను నిన్ ,న్నర్పింతు ఖాదర్వలీ !

6. నినువెన్నాడు పిశాచి సంఘములన్నింటిన్ వేసన్ గూల్చి ,దు
     ర్జన సాంగత్యము పారద్రోలి హితనిష్ఠన్ ,స్వీయమార్గంబు -నం
     దున సిద్ధిం సమకూర్చుకొన్న వరత త్వోల్వాను సర్వేశు -న
     మ్మిన నీ మార్గము సన్నుతింతు జగమేధ్యంచు ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ ఆలీ )

7. కనులన్ నిల్చున్ నీదు రూప మెదలో ,కన్గొన్న మాత్రాన ,-నీ
   కనుదుత్పల్ల సరోజనేత్రములలో ,కారుణ్యమేపారు -శాం
  తి నివాసమ్ముగ నీయేడంద ,సుఖసంతృప్తుల్ మదిన్ గూర్చు -ని
  న్ననిశంబున్ భజియించు వారలకు ,చింతల్లేవు ;ఖాదర్వలీ !

8. సురలోక ప్రతిభా గురూత్తముడు ,తాజుద్దీన్ బాబా ,భవత్
  పరమోదార ,చరిత్ర కున్నలరి  సంభావించి ,శిష్యోత్తమ
  స్థిర రూపంబున ,స్వీకరించెనట ,పృథ్విన్ ధర్మసంస్థాపనా
  దరభావంబున ,నిర్వహించితివి ,- కర్తవ్యంబు ; ఖాదర్వలీ !

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ ఆలీ )
   
9. వనసత్త్వంబులు నిన్ను చేరి సరవిన్ వాత్సల్య సంపూర్ణ భ్రా
    వాననేవించినవన్న మానవుల భక్త్వారాధనల్ చెప్పనే
   లను ; వర్ణాంతర భేదభావములనెల్లంద్రోచి ,భక్తాళిసా
   కిన ,నీ మార్గము సన్నుతింతు ననురక్తిన్ శక్తి ;ఖాదర్వలీ !

10. సందేహాస్పదులైన మానవుల విశ్వాసంబు నార్జించి ,లో
     హిందూ ముస్లిములన్న ,భేదములనూహింపంగ వర్ణించి -సా
     నందానూన కృపావిశేషమున ,భక్త శ్రేణి పోషించి -మా
     డెందంబుల్ పులకింపజేయు ,శుభదృష్టింగొల్తు ;ఖాదర్వలీ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
              తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥   

                   
శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

11. అజీంఖాను ,ఫరీదు బాబ , అతవుల్ వల్యాదులున్ ,నీ మహా
     తేజంబున్ బ్రసరింపజేయుటకు నల్దిక్కుల్ విశాలాంధ్ర ,-నీ
     యోజన్ నిల్చిరి ,మోతిబాబ భవదీయోత్సాహ భక్తుండు ,-నీ
     రాజన్మాంతము,నిన్ను గొల్చిరటగాదా ! మున్ను ,ఖాదర్వలీ!

12.  గుబురుంగడ్డము ,కాంచనమ్మునకు నిగ్గుల్ దీర్చు నెమ్మేను -బల్
       సొబగుల్ ,జిమ్ముకృపారసంబొలుకు చక్షుందోయి ,విస్పష్టమౌ
      చిబుకంబున్ -నిడు పైన ఫాలమును వాసింగాచునాస్యమ్ము ,-నీ
     విభవంబున్ బ్రకటించు ,నిత్యమును బాబా ! మౌల్వీ ;ఖాదర్వలీ  !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

13.  బాబాలెల్లరు మోసగాండ్రు కడుడంబాల్ దొట్టుచున్ -నిత్యమున్
      రాబట్టుంగాదలంత్రు సంపదను ,నేరంబంచు నూహింప ,కీ
      సాబున్ నమ్మగరాదటంచు నినునశ్రాంతమ్ము దూషింకు వా
      రే ,బింకంబును వీడి ,కొల్చిరట కాదే ! పూన్క ;ఖాదర్వలీ !

14.  పోవే ! దయ్యమ!! పోకయున్న యెడ ,నీ పోకంబు కూల్తురు ,నా
       తో వైరంబును ,బూనబోవకుము ,కూలుతుంనిన్నటంచెంతయో ,
       భావావేశముతోడ పల్కు కొడుకున్ బాలున్ నినున్ గాంచి యెం
      తో  ,విభ్రాంతిని గొన్న మాతృ హృదయంబూహింతు ;ఖాదర్వలీ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

  హజరత్ ఖాదర్ వలీ శతకము (షేక్ అలీ )
 
15. కరుణింపగు  మమ్ము మా బ్రతుకులం ,గష్టాలు ,నష్టాలు ,దు
      ర్భర మయ్యెన్ భరియింపలేము నరవిన్ రక్షింపు మంచార్తి -నీ
      దరిజేరంగను , సాకినాడవట ,భక్త వ్రాతమున్ నీవెటుల్
      నరమాత్రుండవు ,దైవసన్నిభుడవే ! తర్కింప ! ఖాదర్వలీ !

16 . కులతత్వంబులు ,కుచ్చితంబులను  ,వాకోరాని దుర్మార్గముల్
       నిలువెల్లం ,దహియింప ,మానవులు నార్తింగూలు కాలాన ,-నీ
      విలనద్భోధలు ,శాంతిసంపదల నావిష్కారముంజేసె ,ని
      స్తులభావంబుల ప్రోదిజేసి : పరతత్వోద్దీప్తి ; ఖాదర్వలీ !


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )


శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )

17. ధనధాన్యంబులు వస్తువాహనములున్ దారాసుతుల్ ,బంధువుల్
       తనవెంటబడిరారు ,పోవు నెడలన్ తథ్యంబు ,జీవించియుం
       డినవేళం -బొనరించు కర్మఫలముల్ లీడిన్ సమూహంబులై
      యనయంబున్ ఫలితంబులిచ్చుగద ! దేవా ! మౌల్వి ! ఖాదర్వలీ !

18. పతికార్యంబులయందు పూన్ కగొని ,సంభావించునేకాంత యీ
      క్షితి నిల్లాలలన జెల్లుగాని ,వెతలంగల్గించుచున్నట్టి దు
      ర్మతి ఇల్లాలన జెల్లునే పతికి దౌర్భాగ్యంబునం దిట్టెదు 
      ర్గతి ,సంప్రాప్తము కౌచునుండు గద ! లోకంబందు ;ఖాదర్వలీ !

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   


శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

19. తతసంసారపయోధిలోనబడి ,ఈదన్లేక ,యేతీరమున్
      మతి నూహింపగలేక ,చేరక ,సదా మార్గంబు యోచించు ,నా
     గతి ,యీరీతిగ ,రెంటెకిజెడిననదై ,కన్పట్టె నీనామ ,సం
     స్తుతి జేయంగలివాడ ,నమ్మి తరియింతున్ ;మౌల్వీ ;ఖాదర్వలీ !

20. సిరికిం గౌరవమున్నదన్ననుడి ,నేచేతంబునందెంచ ,-ట
      క్కరిదీసంపద ,- మంచిచెడ్డలను లెక్కంబెట్ట ,దాపైన సో
      దరులన్ సైతము ,పారద్రోలు కడుస్వార్ధంబెంచి -యేపాటి దు
      ర్భర కార్యంబునకైన పాలుపడు గర్వస్ఫూర్తి ;ఖాదర్వలీ !

   
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

21. నీ దర్బారు ప్రశస్తి గాంచినది ;వర్ణింపగలేనట్టి ,దై
      వా ధీనంబయి -సర్వమానవుల ,కాయావేళలం ,స్వాంతన
      శ్రీ ,విశ్వోన్నత బోథలంగురపి ,రాశీభూత చైతన్య ,స
     మ్మోదాబ్దిన్ విలసిల్ల జేసినది ,సమ్మోహాన ;ఖాదర్వలీ !

22. దేవుండెవ్వడు ? వాని ముక్కు మొగమేదీ ? సృష్టి కాద్యుండు ,గా
      భావింపబడుటేమి ? సాజముగ సంప్రాప్తించు,సర్వంబు ,మి
      ధ్యా వాక్యంబుల ,బల్కుచుందురని ,వ్యాఖ్యానించు నీ నాస్తికుల్ ,
      నీవిస్పష్ట మహాత్త్వమెంచి ,యెదలో ఏమంద్రు! ఖాదర్వలీ !


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

23. సత్యంబొక్కటే ,సర్వవిశ్వమునకున్  ,శక్తింబ్రసాదించు ,నా
      సత్యంబొక్కటే ,మానవాళికెదలో ,సర్వేశ్వరుం జూపు ,నా
      సత్యంబొక్కటే ,సూర్యచంద్రులకు ,శశ్వత్ గమ్యముంజూపు ,నౌ
       ద్ధత్యాసక్తుడు ,సత్యమెంచదుగదా ! దర్పించి ;ఖాదర్వలీ !

24. ఎదో శక్తి ,భవత్పాదాబ్జాముల సంసేబింతూనే గాని ,యా
      మోదంబించుకలేదు ,జీవితము సంపూర్ణంబుగా ,సంసృతీ
      పాదోధింబడి ,మ్రగ్గుచున్నయది ,లోపించే దొకన్రాదు ,నా
      యీ దౌర్భాగ్యము తీరురోజు గలదా ! తర్కింప ;ఖాదర్వలీ !     
                           

 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

25. కనకంబిమ్మని కోరలేదు ,పదవుల్ కాంక్షింపగాలేదు ,కో
       రిన ,కాంతాజన సౌఖ్యసంపదలకై రెట్టింపగాలేదు ,నా
      మనమందెప్పుడు ,విశ్వశాంతికిరవౌ ,మార్గంబు జూపింపు ,మం
     చును ,ప్రార్ధించెద ,ధర్మసమ్మత వదమ్ముంగోరి ,ఖాదర్వలీ !

26. కాయంబెప్పుడు కూలిపోవునో .యథాకాలార్హ సంఘటన్ ,
       ప్రాయంబాదరిజేరె ,నారుపదులన్ ,భావించి నేనెప్పుచున్ ,
      చేయంజాలక ,పోయితిన్ వరులకున్ ,చేజేతులన్ ,మేలు ,నీ
      సాయంజెప్డు లభించు ,నిట్టిపనికిన్ సంధింప ;ఖాదర్వలీ
 
 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ  శతకము ( షేక్ అలీ )

27. మతమున్ మార్చుకొనంగనేల ,నరుడా మర్యాదకా లౌకిక
      స్థితి వెల్గొందునటన్న కోరికయ ,వాసింగూర్చు నుద్యోగ సం
      గతికా వేరుపయోగముండినద ,లోకారాధ్యుడొక్కండే ,కా
     మత ధర్మంబుల నిండియుండునది ;సన్మానింప ;ఖాదర్వలీ !

28. మతమైదేనైనను మానవత్వమొకటే మర్యాదయున్నొకటే
      హితమార్గంబొకటే ప్రశస్తగుణసాహిత్యంబును న్నొక్కటే
      గతులే వేరనినంత మాత్రమున లోకంబందు ,నీ దుష్ట క
     స్టతతిం గూర్పగనేల ? మానవుల ఈర్ష్యాదృష్టి ;ఖాదర్వలీ !

 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:50:00 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )
29. రామా ! యన్న ,రహీమటన్న ,మదిలో క్రైస్తన్న ,నీ ముగ్గురున్
      ప్రేమాధారులు విశ్వవంద్యులు కదా ! వేయేల వాదాలు ,ఏ
      దోమార్గంబుని వారిగొల్పి నిజధర్మోద్దీప్తి వెల్గింపగా
      లేమా ! వాదములేల ? స్వార్ధరహితమ్మే ముక్తి ;ఖాదర్వలీ !

30. కులమర్యాద నతిక్రమింప నతడే ,క్షోణీతలింబుత్రు -డ
       త్యలఘ ప్రేమ ,పతింభజించునదియే ,తథ్యంబుగాదార ,న
      త్యల స్దరీతి,వచించు నాతడెగురుండీ ,మువ్వురున్ ,జీవికిన్
      తొలిజన్మ వ్రధలభ్యమౌదురు గదా ! తోడ్తోన ఖాదర్వలీ ! అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

« Last Edit: June 18, 2018, 05:51:24 PM by Gurupriya »