Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 126385 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1440 on: February 07, 2018, 07:21:15 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

బుర్రకథ :

తాతగారితో సన్నిహిత సంబంధ బాంధవ్యములు కలిగిన వారందరూ తాతగారి సమాధి వార్తను జీర్ణించుకోలేక పోయారు . తాతగారి శక్తి కలకాలమూ నిలిచి ఉంటుందని తెలిసినప్పటికీతాత  దివ్యమంగళ రూపము ,ప్రశాంతమైన వారి చిరునవ్వు ,ఆప్యాయత నిండిన గొంతుతో కూడిన తాత పలకరింపులకు నోచుకొనని తమ దురదృష్టమును తలచుకొని దుఃఖించుచుండిరి . కాలము ఎంతటి గాయమునైనా మాన్పుతుందని అందరి అభిప్రాయము . కానీ తాతగారి రూపము కనుమరుగవుటతో రోజులు గడుస్తున్నకొద్దీ ఆ బాధ ,దుఃఖములే కాక అభద్రతా భావము పెరిగిపోసాగినది . దీనినుండి బయట పడాలంటే తాతగారి లీలలను నిత్యమూ మననము చేయుటయే ఈ గాయమునకు సరియైన మందు అని భావించిన శైలజ తాతగారి లీలలను కొన్నింటిని సులభమైన పద్ధతిలో బుర్రకథగా తయారుచేసి పిల్లలవి  నిష్కల్మష హృదయములు  కాబట్టి వారిచేత తాతగారి లీలలను గానము చేయుటకు నిశ్చయించి 12 సం . ల బిందును కథకురాలిగా ,7 సం . ల యామిని ,మధులను పక్కనుండు వాళ్ళుగా శిక్షణ నివ్వగా అంత చిన్న పిల్లలు కూడా అతి తక్కువ సమయములో ఎటువంటి తొట్రుపాటు లేకుండా అనర్గళముగా గంటన్నరపాటు సాగే ఈ కార్యక్రమమును చెప్పగలిగినట్లు సాధన చేసిరి . ఈ బుర్ర కథ మొత్తమునకు మల్లేష్ గారి అమ్మాయి ప్రభ వ్యాఖ్యాతగా చక్కగా రాణించింది . ఈ విధముగా అభ్యాసము చేసిన పిల్లలందరూ మొదటి కార్యక్రమమును దత్తజయంతినాడు తాతగారి సమక్షములో ( సమాధి వద్ద ) ప్రదర్శించినపుడు కల్లూరు గ్రామము మొత్తమూ కన్నీటి మయమైంది .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1441 on: February 08, 2018, 08:43:22 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అంతకుముందు సంవత్సర ము దత్తజయంతినాడే నూతన గృహమున ప్రవేశించిన తాత రూపము కనులముందు కదులుతుండగా లవకుశల రామాయణమును గానము చేసినంత మధురముగా ఇంత చిన్న పిల్లలు తాతగారి లీలలను అలవోకగా చెప్పడము అందరినీ ఆశ్చర్యానందములలో ముంచివేసినది . ఎటువంటి హంగులూ లేకుండా కేవలము తాతపై భక్తిప్రేమలతో వారు చేయు గానము విని మైమరచిన కల్లూరు ప్రజలు మరొక్కసారి తాత లీలలను చెవులారా విని మనసారా ఆస్వాదించుటకు ఇదే కార్యక్రమమును జయప్రదముగా ముగించిన స్పూర్తితో మరొక్కసారి గురుస్థానము వద్ద నిర్వహించుటయే కాక తాతగారితో అనుబంధమున్న అనేక గ్రామములలో ,మందిరములలో ఈ బుర్రకథను అత్యంత సమర్ధవంతముగా పోషించి ఆనాటి లవకుశలను కళ్ళకు కట్టినట్లు చూపించిరి . వీరి గానం విన్న ప్రతి ఒక్కరూ తాతను తలచుకుని ఏడ్చినవారే తప్ప ఏడ్వనివారు లేరంటే అతిశయోక్తి కాదు . ఈ విధముగా మొట్టమొదటిసారిగా తాతగారి మహిమను తమ గానముతో ప్రచారము చేసిన కీర్తిని తాతగారి దయతో వీరు దక్కించుకొనిరి . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1442 on: February 09, 2018, 07:12:00 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

పాదయాత్ర :

1992 సం . దత్తజయంతికి తాత నూతన గృహప్రవేశ వేడుకలు అత్యంత వైభవముగా జరిగాయి . ఆనాటి ఆ మహోత్సవములో పాల్గొన్న మల్లేష్ ఆ శుభ సందర్భంలో ఒకానొక సత్ సంకల్పం మనస్సునందు కలుగుగా పాదాలు  హైదరాబాదు  కల్లూరుకు పాదయాత్ర చేస్తాము అనుమతినిమ్మని వేడుకున్నాడు . అప్పుడు తాత " మీరు రండి వాడు చూసుకుంటాడు " అని అనిమతినిచ్చారు . ఇది జరిగిన సుమారు నెలరోజులకే తాత సమాధి కావడం ఆ దుఃఖంలో అందరూ మునగడంతో ఏ పాదయాత్ర చేసి తాత వద్దకు వెళ్లాలనుకున్నారో ఆ తాతే లేదను భావం అందరినీ కృంగదీసింది . అయితే కాలం గడిచిన కొద్దీ తాత ఆరాధనమహోత్సవం దగ్గర పడింది . అప్పుడు అనుకోకుండా పాదయాత్ర ఆలోచన తిరిగి ప్రారంభమైంది . అయితే కేవలం పదిమంది లోపు మగవాళ్ళు మాత్రమే ఈ పాదయాత్రలో వెళ్లాలనీ ,దారిలో ఏది దొరికితే అది తిని ఎక్కడో అక్కడ తలదాచుకొని తిరిగి ప్రయాణమవ్వాలని నిర్ణయించడమైంది . ఆడవాళ్లు కూడా కలిస్తే వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు ప్రత్యేకంగా చూడవలసి వస్తుందనీ ,కేవలం మగవారైతే ఎలాగైనా ప్రయాణించగలరనీ అనుకున్నారు . ఈ పాదయాత్రను తాత  విగ్రహ ప్రతిష్ఠ చేసిన కబూతర్ ఖానా మందిరం నుండి ప్రారంభించాలనుకున్నారు . ఆఫీసులకు ప్రయాణమైనారు , తమవారు వెళ్తుంటే పంపడానికి వచ్చినవారూ ,ఇతర సభ్యులూ అందరూ కబూతర్  ఖానా గుడిలో సమావేశమైనారు . అయితే అందరికీ తాతంటే ప్రాణమే . ఎటువంటి ఏర్పాట్లు లేవని తెలిసి కూడా ఆఫీసులకు బయలుదేరినవారు కూడా విరమించుకొని ఆడవారు సుమారు 7,8 మంది శైలజతో సహా తామూ వస్తామంటూ బయలుదేరుటకు సిద్ధపడినారు . కనీసం కట్టుకోవడానికి దుప్పట్లు కానీ ,ఇంట్లో వారికి చెప్పను కూడా చెప్పకుండా తలవని తలంపుగా తాత మీద ప్రేమతో బయలుదేరారు .

 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1443 on: February 10, 2018, 04:11:50 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

అప్పటికప్పుడు తాతకోసం రథం సిద్ధం చేసి  అందులో తాత పటము నుంచి హారతి నిచ్చి  బయలుదేరారు . ఇందులో విశేషమేమంటే బయలుదేరిన ఆడవారిలో భాను అనే అమ్మాయి ఉంది . ఆమెకు 3 సం . చిన్నబాబు . తల్లిని వదిలి ఉండలేడు కాబట్టి  ఆ 3 సం . బాలుడు కూడా పాదయాత్రలో భాగం పంచుకున్నాడు . 7 రోజులు నడిచి 14 తేదీన కల్లూరు చేరిన ఈ యాత్రలో ఆ బాబు ఏ మాత్రం విసిగించడం కానీ ,ఏడవడం కానీ చేయక అందరినీ ఆశ్చర్యపరచినాడు . ఆ రకంగా ప్రారంభమైన పాదయాత్ర ముందుకు సాగింది . ఆ రోజు రాత్రికి తిమ్మాపూరు అనే గ్రామం చేరేసరికి చీకటి పడింది . అక్కడ ఉన్నవన్నీ పూరిళ్లే . అయినా వారిని అడిగి ఆడవారికి ఇంటిలోపల ,మగవారికి బయట పడకలేర్పాట్లు చేసుకుని మర్నాడు కాలకృత్యాలు తీర్చుకుని తెల్లవారేసరికి బయలుదేరారు . రెండోరోజు కూడా భోజనాలు హైదరాబాదువారే తీసుకువచ్చిరి . రెండోరాజు రాత్రికి పాదయాత్ర షాద్ నగర్ చేరింది . ఈ షాద్ నగర్ సాయిబాబా మందిరానికి తాత శ్రీ రామనవమి నాడు శంఖుస్థాపన చేసారు . ఆ ఆలయ నిర్వాహకులైన డాక్టరు విజయ కుమార్ ,డాక్టరు శారద తాత ప్రియభక్తులు . తాత కోసం వెళ్లే ఈ పాదయాత్ర బృందానికి వారు గుడిలోనే వసతి భోజన ఏర్పాట్లు చేసారు . మరునాడు వీరి భోజనాలు ఎలాగని అడుగగా ఏ ఏర్పాట్లు లేవని తెలుసుకున్న శారదగారు ఎంత తీరికలేని డాక్టరైనప్పటికీ తాతపై గల ప్రేమతో వారికి భోజన ఏర్పాట్లు తాము చూస్తామని చెప్పారు . ఆ రకంగా రెండు మూడు రోజులు గడిచాయి . పాదయాత్ర ముందుకు సాగిపోతోంది . షాద్ నగర్ తో దూరం పెరిగిపోతోంది . ఈ భోజన సదుపాయాలూ సమకూర్చడంలో డాక్టరు శారదా తీరిక చేసుకొని వంటను తానె స్వయంగా వండితే బుచ్చయ్య అనే అతను ఆ భోజనాలను తలపైపెట్టుకొని ఎదో ఒక లారీ పట్టుకొని పాదయాత్ర బృందం ఎక్కడ కనబడితే అక్కడ లారీ దిగి వారి భోజనం పూర్తయిన తరువాత పాత్రలన్నీ తీసుకుని వెళ్లి మళ్ళీ ఆ రాత్రి భోజనాలు తీసుకువచ్చేవాడు . దూరం పెరిగిన కొద్దీ భారం పెరిగిపోయింది . అతనికి షాద్ నగర్ వెళ్లి తిరిగి రాత్రి భోజనానికి అందించడం మళ్ళీ షాద్ నగర్ వెళ్లడం పొద్దున్నే లేచి మళ్ళీ భోజనం తీసుకురావడంతో తీవ్ర శ్రమకు గురైనప్పటికీ ఎంతో ఓర్పుతో ఈ సేవ నందించాడు . ......


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1444 on: February 11, 2018, 04:44:48 PM »

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఎప్పటికప్పుడు మానేయాలనుకోవడం అయ్యో మేము లేకపోతే వీళ్ళు ఏ ఇబ్బందులు పడతారోనని తీసుకురావడం ఈ రకంగా సాగింది . కానీ రోజు రోజుకూ దూరం పెరిగిపోవడంతో సమయం సరిపోయే స్థితి దాటిపోగా ఇక మొహమాటపడితే కష్టమని ఆ  రోజు డాక్టరు విజయకుమార్ పుట్టినరోజనీ ,ఇక ఆ పూట తరువాత భోజనం తీసుకురావడం అసాధ్యమనీ వారు ఏ ఏర్పాట్లు చేసుకుంటారో తెలియదనీ బుచ్చయ్య చెప్పి భోజనంలోకి స్వీటు కూడా తీసుకువచ్చాడు . అతను అక్కడే ఉండి  అందరికీ భోజన ఏర్పాట్లు చేస్తుండగానే కల్లూరు సంస్థాన్ నుంచి మద్దిలేటి వచ్చి ఇప్పటివరకు మీరు ఏ ఏర్పాట్లు చేసుకున్నారో మాకు తెలియదు కానీ ఈ రోజు రాత్రి నుంచి మీరు భోజనానికి ఏ ఏర్పాట్లు చేసుకోవద్దనీ కల్లూరు తాత సంస్థాన్ నుండి మీకు ప్రసాదం వస్తుందని చంద్రారెడ్డి కబురుచేసాడని చెప్పాడు . ఇదంతా వింటున్న బుచ్చయ్య తాత ఈ లీలకు ఆశ్చర్యపోయాడు . .....


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1445 on: February 12, 2018, 07:45:15 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

పాదయాత్ర విషయంగా తాత ఒక్కమాటతో తన అనుమతిని తానూ శరీరంతో ఉండగా ఇచ్చారు . అది " మీరు రండి వాడు చూసుకుంటాడు " అని . ఈ భోజన ఏర్పాట్లు ఈ రకంగా జరగకపోయినట్లైతే దారిలో వారికి తినడానికి ఏమీ దొరికేది కాదు . తనకోసం వచ్చే తన భక్తులను కాపాడడమే కాక , వారి కనీస అవసరాలను కూడా తాత తీర్చారు . ఈ సంఘటనవల్ల తెలిసిందేమిటంటే అవధూతలకు శరీరంతో పనిలేదు ,వారు తాము పూర్తిచేయదలచుకున్న పనులను శరీరమున్నప్పుడు చేసినట్లే చేయగలరు . వారు జీవన్ముక్తులు అని తేటతెల్లముగా చెప్పినట్లైంది . ఒకవైపు తాత చూపించే కరుణతో ఉక్కిరి బిక్కిరైనపాదయాత్ర భక్తులకు దారిలో తాత ఎన్నో మధురానుభూతులను అందించారు . వెళ్లిన వాళ్ళందరూ ఒకరికొకరు  తోడునీడలా నిలిచి కలిసి నడిచి ఒకరు నడవలేక వెనుకబడితే వేరొకరు చేయూతను ,మానసిక ధైర్యాన్నిచ్చి  ఈ విధంగా చేదోడు వాదోడు గా ఆ యాత్ర సాగింది . ......

 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                       శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తనకోసం వచ్చే తనవారికి తాత ఫోటో రూపంలో దర్శనమివ్వడం ఆశ్చర్యకరం . ఆ బృందంలో రవి అనే 15 సం . అబ్బాయికి కాళ్ళు పగిలిపోయి నడవలేని స్థితిలో బాధపడుతుంటే తోటివారు ధైర్యాన్నిచ్చి నువ్వలా బాధపడుతుంటే తాత ఆగలేరు . ఎదో రూపంలో తప్పక నీ దగ్గరకు వస్తారని ఊరడించారు . ఎలాగోలా ఆనాటి యాత్ర ముగించి ఒక గుడిలో విశ్రమించగా ఊహించని విధంగా హైదరాబాదు నుంచి తాత ఫోటో రావడం జరిగింది . అప్పుడందరు  తాత ప్రత్యక్ష దైవం అన్న ఉత్సాహంతో ఆ రాత్రి గడిపారు . తెల్లవారేసరికి ఆ అబ్బాయి కూడా కాళ్ళు పగుళ్లు తగ్గినవాడై మిగిలినవారితో సమానంగా నడవగలిగాడు . షిరిడీ సాయి సేవ సంస్థ అధ్యక్షుడైన నారాయణ యాత్ర తాబేలు నడకలా సాగేది . ఇతను ఇతరులతో సంబంధం పెట్టుకోకుండా తెల్లవారేసరికి కాలకృత్యాలు ముగుంచుకొని బయలుదేరి వెళ్లిపోయేవాడు . అలా మెల్లమెల్లగా సాగుతూ వీరు కలిస్తే కలిసేవారు లేకపోతే లేదని తినడానికి ఏదైనా దొరికినా దొరకక పోయినా ముందు కెళ్ళేవాడు . రాత్రికి మాత్రం వీరిదగ్గరే బసచేసి తన యాత్రలో సఫలీకృతుడైనాడు .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1447 on: February 14, 2018, 07:33:00 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇక ఇంకొక ముఖ్య విషయం . పాదయాత్ర బీచ్ పల్లి చేరింది . అక్కడి ఆంజనేయాలయంలో అందరూ విశ్రమించి మరునాడు బయలుదేరారు . ఆ రోజు భోగి పండుగ . ఈ బృందంలోని మల్లేష్ ప్రతి సం . భోగిరోజు తాత  వద్దకు వెళ్లి తాతకు భోగిపళ్లు పోసేవాడు . తాత శరీరంతో లేని మొదటి భోగిరోజు అదే . పాదయాత్ర ప్రారంభమౌతూనే 3 కుక్కలు వారి వెంట నడిచాయి . సాధారణంగా కుక్కలు పొలిమేర వరకు వస్తాయేమో కానీ  ఏ కుక్కా తన గ్రామం వదిలిరాదు . అయితే ఈ కుక్కలు గ్రామ సరిహద్దులు దాటి ముందుకు నడిచాయి . ఊరి బయట చిన్న పూరిపాకలో హోటలుంటే అక్కడ తాతకు ప్రియమైన ఉగ్గాణీ  కనిపించింది . దత్తావతారమైన తాత ఆ కుక్కల రూపంలో దర్శనమిచ్చారని తాతకు  ఆ ఉగ్గాణీ  ప్రసాదం పెట్టారు . అది తిని తిరిగి రెండు కుక్కలు గ్రామంలోకి వెనుకకు మరలగా  ఒక కుక్క మాత్రం వారిని అనుసరించింది . భోగిరోజు ఆ కుక్క అలా అనుసరించడం చూసిన మల్లేష్ తాత ఆ రూపములో మనకోసమే వచ్చారంటూ దానిని పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు . అంతేకాక ఆ రోడ్డుమీదే రేగిపళ్ళు కనిపించగా కొని పూలదండ వేసి ఆ భోగిపళ్లు పోసి తన సంతోషం ఆ రకంగా వ్యక్తపరచాడు . ఆ కుక్క అలానే వారితోపాటు సుమారు 50 కి . మీ . ప్రయాణించి కల్లూరు చేరింది . పాదయాత్ర కర్నూలు చేరగానే అనుకోని విధంగా అక్కడ ఉన్న పోలీసు ట్రయినింగ్ సెంటర్ నుండి ప్రముఖులకు చేసే వందన సమర్పణ ,సంగీతం రెండే రెండు నిమిషాలపాటు వినిపించింది . అది ఊహించని వారందరూ కర్నూలులో తాతకు లభించిన ఘన స్వాగతానికి  ఆశ్చర్యపోయారు . నడిచిన ప్రతివారికీ ఆ గ్రామ సరిహద్దుకు రాగానే దుఃఖం హద్దులు దాటిపోయింది . ప్రతి ఒక్కరూ తాతతో తమకు గల అనుభూతులు గుర్తుకు రాగ దుఃఖాన్నాపుకోలేక  పోయారు . అప్పుడు కల్లూరు ప్రజలు ,తాత సంస్థాన్ నుంచి వచ్చిన చంద్రారెడ్డి చూపించిన ప్రేమ అపూర్వం . తమ తాత కోసం ఇంతగా బాధపడుతున్న ఆ బృందాన్ని వారు సాదరంగా ఆహ్వానించి ఊరడించారు . కల్లూరు గ్రామం గ్రామం ఈ బృందం కోసం తరలి కర్నూలు చేరింది . అక్కడినుండి పెద్ద ఊరేగింపుతో బ్యాండ్ మేళాలు ,మంగళవాద్యాలు ,విద్ద్యుద్దీపాలు ధగధగలతో శోభాయాత్ర ముందుకు సాగింది . షిరిడీలో చావడి ఉత్సవం ఎంత నయనానందకరంగా సాగుతుందో అంతే మనోహరంగా కర్నూలు నుండి శోభాయాత్ర కల్లూరు చేరే దారిలో " అవధూత శ్రీ రామిరెడ్డి తాత మహారాజ్ కీ జై "  జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి . ఆ రకంగా తాత దయతో కల్లూరు చేరిన బృందం తాత ఒడిలోకి చేరిన భావనకు గురైనారు . ఎందుకంటే పాదయాత్రలో తాత కురిపించిన మాతృప్రేమకు వారు పొంగిపోయారు . ఈ యాత్రలో పాల్గొనే అదృష్టాన్ని తమకు ప్రసాదించిన తాతకు వారు సదా కృతజ్ఞులమని తలచారు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                  గ్రంథ ప్రయోజనము -ఫలశృతి :

అవధూత అనుపదమునకు స్పష్టమైన వివరణ ,ఆ లక్షణములైన బాలోన్మత్త పిశాచ వేషధారణ ,భక్త జనోద్ధారణ ,లోకకల్యాణం ,ధర్మ సంస్థాపన కార్యక్రమములే కాక దయ ,శాంతి ,కరుణ ,అక్రోధము ,సత్యము వంటి ధర్మ లక్షణములు మూర్తీభవించిన పరిపూర్ణ దత్తావతారమే శ్రీ రామావధూత మహారాజు .

అవధూత రామిరెడ్డి తాత జీవిత చరిత్ర గ్రంథ రచన ప్రారంభించే ముందుగా తాతగారి సమాధి వద్ద తాతగారు ఎవరి కర్మలను తొలగించి ఎవరినైతే అనుగ్రహింప దలచిరో  అటువంటి వారి వద్దకే ఈ గ్రంధం చేరాలనీ ,అట్లు కాకుండా ఈ గ్రంధం అలంకార ప్రాయం కారాదనీ మనస్ఫూర్తిగా ప్రార్ధించి గ్రంథరచన పూర్తి గావించుట జరిగినది . ఆ భావం కార్యరూపం దాల్చి అనేకానేక భక్తుల లౌకిక సమస్యలనూ ,బాధలనూ తాతగారు తీర్చడము మాత్రమే కాక వారి ఆధ్యాత్మికోన్నతికి మార్గం సుగమము చేస్తున్నారు . ఆ విధంగా సాయిబాబాను దర్శించనప్పటికీ బాబా ఆశీర్వాదం ,అనుగ్రహం పొందుతున్నట్లే తాతగారి గ్రంథ పారాయణ చేసినవారు కానీ ,తాత సమాధిని దర్శించిన వారుకానీ తాత అనుగ్రహమును ప్రత్యక్షముగా పొందగలుగుతున్నారు . ఇందుకు సంబంధించిన ఉదాహరణములు సందర్భానుసారంగా గ్రంధములో పొందుపరచబడినవి .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1449 on: February 16, 2018, 08:14:58 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

కరువు రక్కసి కోరలనుండి యుధోపియా ప్రజలను కాపాడిన విధానమూ
కర్నూలు పట్టణంలో వరద తాకిడిలో ప్రాణనష్టం లేకుండా రక్షించడమూ
ధర్మ సంస్థాపనలో భాగంగా మందిర శంఖుస్థాపన ,ప్రతిష్ఠలు గావించడమూ
లోకకళ్యాణార్ధమై గ్రామ గ్రామము పర్యటించి పరిస్థితులు చక్కబరచడమూ
ఎటువంటి క్లిష్టపరిస్థితులలోనైనా నేనున్నానన్న అభయము భక్తుల కొసగి వారికి మానసిక స్థైర్యాన్ని కలిగించడమూ . 
 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1450 on: February 17, 2018, 05:55:10 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

భక్తుల సంసారిక బాధలు తీర్చి సుఖమయ జీవనం ప్రసాదించడమూ
తన సర్వజ్ఞతతో భక్తుల మనసులకు ఊరటను ,ప్రశాంతతనూ కలిగించి వారిని ఆతృత ,ఆరాటములనుండి తప్పించడమూ
పంచభూతములనూ సందర్భానుసారం అధీనములో ఉంచుకొనడమూ
ఎందరెందరో భక్తులకు ప్రాణభిక్ష నొసగడమూ
తన లీలావిలాసముతో ,వేదవాక్కులతో ,సర్వజ్ఞతలతో భక్తులను అలరించి వారికి వారి వారి అర్హతలను బట్టి జీవన సాఫల్యం కలిగించడమూ తాతగారి అవతార ప్రాముఖ్యములోని కొన్ని ముఖ్య ఘట్టాలు .
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1451 on: February 18, 2018, 10:04:33 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

క్రమశిక్షణతో ఉంటూ తాతగారిపై పూర్తి నమ్మకముంచి మన ప్రతి చిన్న కార్యక్రమానికైనా తాతగారిపై సంపూర్ణముగా ఆధారపడి మన మంచి చెడులు గమనించి తీర్చిదిద్దేది తాతగారేనను కృతనిశ్చయంతో ఉండడము వలన మనం సమాజంలో ప్రజలు ఎదుర్కొనే ఒత్తిడి ,నిరాశ ,నిసృహలకు లోనుకాకుండా మన జీవితంలో ఏ స్థాయిలోనైనా సరియైన నిర్ణయం తీసుకొని ఇహపర సుఖాలతో పాటు ఆధ్యాత్మిక ప్రగతికి బాటలు వేయగలుగుతాము . కావున ప్రతి ఒక్కరూ ఆడంబరాలు ,ఆర్భాటములకు ఉంటూ మానసిక భక్తి ,ఉన్నతి ,విశ్లేషణలకే  ప్రాధాన్యమిస్తూ క్రమశిక్షణతో ప్రభువుపై ఆధారపడి నిదానమనే నినాదంతో జీవన సాగిస్తే ఎటువంటి ఆటుపోట్లకూ గురికాకుండా నిర్మలంగా ,నిశ్చింతగా ,ప్రశాంతంగా సాగుతుంది . అటువంటి జీవితం పొందాలంటే సద్గురు రామవధూత మహారాజు జీవన చరిత్ర పారాయణ చేసి తాతగారి తత్త్వాన్ని ఆకళింపు చేసుకొని ఆచరణలో పెట్టగలిగితే ఇవన్నీ కరతలామలకములే .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1452 on: February 19, 2018, 08:23:25 PM »
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

తాతగారిపై మనసు నిలిపితే తాతనే నమ్మిన వారిని తాత కల్పవృక్షము ,కామధేనువు వలె రక్షించి కాపాడును . అంతేకాక ఎవరినైతే తాతగారు తన పిల్లలుగా భావించుతారో వారిని అన్ని విధములా కాపాడుతూ వారికి ఏ లోటూ రానీయకుండా చూసుకుంటారు . తాత భ్కాటులా ఇంట రోగములు ,దారిద్య్ర దుఃఖములు నిర్మూలమై వారు దీర్గాయుష్మంతులై పాడిపంటల  చేతనూ  ,సిరిసంపదలతోనూ తులతూగుతూ సర్వ సుఖములను అనుభవించగలరు . తాతగారి జీవిత చరిత్ర పారాయణము చేయువారి యోగ క్షేమములను తాత తానూ వహించి వారి కష్టములను ,కర్మలను తొలగించి వారికి శుభములు చేకూర్చును . పారాయణము చేయువారి భక్తి నమ్మక ములపై ఆధారపడి ఫలితముంటుంది కాబట్టి పూర్తి ఏకాగ్రతతో ఈ గ్రంథ పారాయణము చేసిన విద్య ,ధనము ,వ్యాపారము ,వివాహము ,సంతానము వంటి లౌకికపరమైన కోరికలు నెరవేరగలవు . అంతేకాక తాతగారి లీలలను ,తత్వమును చక్కగా గ్రహించి ఆధ్యాత్మికోన్నతిని పొందుటకు ఎంతగానో ఉపయోగపడు ఈ గ్రంధమును సప్తాహ విధానమున పారాయణ పూర్తిచేసి  కృపను పొందగలరు . ప్రత్యేకించి  శ్రీరామనవమి ,గురుపూర్ణిమ ,కృష్ణాష్టమి ,దత్తజయంతి ,సంక్రాంతి ( కనుమ ) పర్వదినములలో పారాయణ చేసిన విశేష ఫలితములను పొందవచ్చును .

                                      ఇరువది ఒకటవ అధ్యాయము సంపూర్ణము
                                        ఏడవరోజు పారాయణము సమాప్తము

                                  పదములె చాలు రామా !
                                 నీ పద ధూళులె పదివేలు !

                            త్వమేవ మాతాచ పితాత్వమేవ
                            త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
                            త్వమేవవిద్యా ద్రవిణం త్వమేవ
                           త్వమేవ సర్వం మమదేవ దేవ

                                                సర్వం
                                   
                                 శ్రీ రామావధూతార్పణ మస్తు

.

 

     
అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                      శ్రీ గజానన్ మహారాజ్ దివ్యచరిత్ర (సంకలనము :వేము రామ మోహన రావు )

                      సమర్పణ : పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారి పాదపద్మములకు
                                             
                                         శుభమస్తు
                                     శ్రీ గురుభ్యోనమః
                                   శ్రీ విఘ్నేశ్వరాయనమః
                                    శ్రీ శ్రీ శ్రీ గజాననాయ నమః

గజాననుల ప్రథమ దర్శనం

మనభారత దేశం మాహాత్ములకు పుట్టినిల్లు . ఇచ్చట ఎందరో మహానుభావులు ఉద్భవించి వారి యొక్క శక్తి సామర్ధ్యాలను ప్రజాసేవకే అంకిత మొనర్చి ,వారు ఆచరించి ,ఆచరించవలసిన మార్గాలను మనకు బోధించి సన్మార్గములో నడిపించారు . 'సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం ' అని గదా ఆర్యోక్తి . అటువంటి మాహాత్ములను దర్శించిన ,స్పృశించిన పాపపంకిలమైన ఈ జీవితమును పావనమైన సన్మార్గములో నడుపుకొనుటకు అవాకాశం ఏర్పడగలదు . అటువంటి వారి చరిత్రలు పారాయణ చేసినా ,గానం చేసినా  ,శ్రవణం చేసినా  ఫలితం తప్పక కలుగును . ఎన్నో యుగాలు గడిచినా ఈనాటికి రామాయణ ,భారత ,భాగవతాలు ,ఇతిహాసాలు ,ఉపనిషత్తులను ,మనం మననం చేసుకుంటూనే వున్నాము . ఇంకా చేసుకుంటాము . ఇందులో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         
« Last Edit: February 23, 2018, 11:15:49 AM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                       శ్రీ గజానన్ మహారాజ్ దివ్య చరిత్ర ( వేము రామ మోహన రావు )

శ్రీ మాణిక్యప్రభు ,స్వామి సమర్ధ ,శ్రీ సాయిబాబా ,శ్రీ గురుసిద్ధారూఢ ,తాజుద్దీబాబా ,టిబెట్ మిలారేపా , మొదలగు మహాత్ములు అవతరించిన పుణ్యభూమి మనది . ఈ దివి మీదే శ్రీ గజాననమహారాజ్ అను గొప్ప మహాత్ములు అవతరించిరి . ప్రస్తుత విషయము శ్రీ గజానన మహారాజ్ మనకు అందించిన లీలలను తెలియవచ్చు . ఈ చిన్న పుస్తకమును అవకాశము కలిగినప్పుడు పారాయణ చేసిన సత్ఫలితములు పొందవచ్చును . మహాత్ములు ఏ జాతివారు ? ఎప్పుడు పుట్టారు ?ఎక్కడ నుండి వచ్చారు ? అనే విషయాలు సాధారణంగా ఎవరికి తెలియవు . మనకు ఒక రత్నం దొరికిందనుకుందాము , మన దృష్టి దాని యొక్క కాంతిపైనే వుంటుంది గాని అది ఎక్కడ దొరికింది ,దాని విలువ ఎంత ? దానిని ఎవరు ఎక్కడ నుండి తెచ్చారు ,అనేవి స్ఫురణకు రావుగదా ?
 
 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: February 23, 2018, 11:15:17 AM by Gurupriya »