Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 126388 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.    గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

కల్లూరు గ్రామము మొత్తము కుటుంబ పెద్దను కోల్పోయిన అనాథయైనట్లు తల్లడిల్లినది . వయసులో చిన్నవాడైనప్పటికీ చంద్రారెడ్డి ఈ బాధను దిగమింగి ధనారెడ్డి గారి సహాయ సహకారములతో ఈ వార్తను కర్నూలు పట్టణము మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతముల వారికి ఫోను ద్వారానో ,టెలిగ్రాముల ద్వారానో తెలియజేసిరి . ఆ విధముగా ఈ వార్తను అందుకున్న భక్తులందరూ తీవ్ర ఆవేదనతో ఒంగోలు ,నెల్లూరు ,విజయవాడ ,గుంటూరు ,హైదరాబాదు వంటి నగరముల నుండి హుటాహుటిన కర్నూలుకు బయలుదేరిరి . ఆ రకముగా కనీవినీ ఎరుగని రీతిలో భక్తజన సందోహము భోరున విలపించుతూ ఎవరికి వారే తాతతో తమకు గల అనుబంధములను తలచుకొని కుమిలిపోసాగిరి .

     
అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1426 on: January 23, 2018, 01:33:01 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఎవ్వరూ ఊహించని రీతిలో అనూహ్యముగా జరిగిన ఈ సంఘటన అందరనూ దుఃఖసాగరములో ముంచివేసినది . అవధూతలకు మరణం లేదు . వారి శక్తి అనంత శక్తిగా నిలచి సదా తమను కాపాడుతూనే ఉంటుందన్న విషయము తెలిసినప్పటికీ తాతగారి  దివ్య మంగళ రూపము కనుమరుగై పోతోందన్న బాధ అందరినీ దహించివేయసాగింది . ఎక్కడైనా ఒక మరణం సంభవిస్తే దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుటకు అందరూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరికీ వారే శోక సముద్రములో మునిగిపోయి ,ఓదార్చే దిక్కులేక తల్లడిల్లిపోయిరి . వేలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహము తాతగారి కడసారి దర్శనమునకై తహతహ లాడిరి . తాతగారి కడసారి దర్శనము అందరకూ లభించవలెనన్నచో టీ . వీ . వార్తలే ప్రధాన ప్రచార సాధనమని తలచిన హైదరాబాదు వాస్తవ్యులైన కృష్ణమూర్తిగారు టీ .వి . వారిని సంప్రదించగా వారు తాతగారు మీకు అవధూత అని తెలిసినంత మాత్రమున దానికి తగిన ఆధారము లేనిదే తామీ  వార్తను చెప్పలేమని తెలుపగా కృష్ణమూర్తిగారు వారిని అనేక విధముల ఒప్పించి రాష్ట్ర వ్యాప్తముగా వేలాది భక్తులకు ఈ వార్త తెలియనట్లు చేయుటయే కాక ,కర్నూలు చుట్టుపక్కల గ్రామముల నుండి ఈ వార్తను విని వందలాదిగా భక్తులు పరుగు పరుగున కల్లూరు చేరి కన్నులారా కడసారిగా తాతను దర్శించు భాగ్యము కలిగించుట ద్వారా భక్తులకు కృష్ణమూర్తిగారు తిరుగులేని సేవలందించిరి .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1427 on: January 24, 2018, 09:21:04 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మరుసటిరోజు అనగా 16-1-93 తేదీ సాయంత్రము వరకు భక్తులు తాతగారి ఆఖరి దర్శనముకై వెల్లువలా తరలి వచ్చి కన్నీటితో వారిని దర్శించుకొని పక్కకు జరుగుచుండిరి . ఇక సాయంత్రము మూడు గంటల ప్రాంతములో తాతగారి అంతిమ యాత్ర ఆరంభమాయెను . కర్నూలు వాసులైన సతీష్ వాళ్ళ డి . సి . యం ను అందమైన పూలరథము వలె అలంకరించి అందులో తాతగారి భౌతిక కాయమును ఉంచిరి . తాతగారు యోగనిద్రలో ఉన్నట్లే కాంతులీనుతున్నారు . భక్తులందరు విరివిగా పూలమాలలు తెచ్చి తాతగారిని ఆ పూలతో కప్పుచుండిరి . ఆ విధముగా అంతిమ యాత్రలో ముందుగా వివిధ రకముల వాయిద్యములు మ్రోగుచుండగా ,వెనుకగా భజన బృందములు తాత నామ సంకీర్తనములు చేయుచు జయ జయ ధ్వానములు చేయుచుండిరి . " అవధూత శ్రీ రామిరెడ్డి త్త మహారాజ్ కీ జై " అన్న నినాదములతో దిక్కులు పిక్కటిల్లుచుండగా భారమైన హృదయములతో ఊరేగింపు కదలుచుండెను . దూరప్రాంతముల నుండి తాత దర్శనమునకై వచ్చుచున్న భక్తులెందరో దారిలోనే తాత ఊరేగింపులో పాలు పంచుకొనిరి . ఆ విధముగా సాగుచున్న అంతిమయాత్ర కర్నూలు పట్టణ వీధుల గుండా ప్రయాణించి తిరిగి కల్లూరు ప్రవేశించెను . అప్పటికి రాత్రి 7 గంటలు అయినది . తాతగారి కడసారి దర్శనముకై భక్తజన సందోహము పోటీపడుచుండగా అత్యంత కష్టముమీద తాతగారిని మందిరములోనికి తీసుకురాగలిగిరి .
 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1428 on: January 25, 2018, 06:56:05 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
 తాతగారిని ఎక్కడ సమాధి చేయవలెనను అంశముపై కొంతసేపు చర్చ జరిగినప్పటికీ తాత తన ఇంటిని తానె సమాధి మందిరముగా మలచుకొని అది పూర్తయిన 37 రోజులకే సమాధి చెందిరి కాబట్టి తాతను తాత ఇంటియందే సమాధి చేయుట సమంజసముగా ఉండునని అందరూ ఏకాభిప్రాయమునకు వచ్చి అంతిమయాత్ర ముగించి వచ్చుసరికి తాతగారి మందిరము నందు సమాధి చేయుటకై కావలసిన ఏర్పాట్లన్నియూ ధనారెడ్డి గారి ఆధ్వర్యములో చురుకుగా సాగినవి . ఇక తాతగారిని ఏ విధముగా సమాధి చేయవలెనని విషయము కూడా చర్చనీయాంశమైనది . ఎందుకనగా తాతగారిని కూడా సాయిబాబా వలె పడుకోబెట్టి సమాధి చేయవలెనని కొందరూ ,అలా కాకుండా ఆ ప్రాంతములో గల ఆచారము ననుసరించి ఇటువంటి మహానీయులను కూర్చుండబెట్టి సమాధి చేయవలెనని కొందరూ సూచించగా కొంతసేపటికి వరకూ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది . చివరకు తాతగారిని కూర్చుండబెట్టి సమాధి చేయుటకే నిర్ణయించిరి . అనుకున్న విధముగనే అంతిమయాత్ర యాత్ర పూర్తయిన తరువాత తాతగారికి మంగళ స్నానములు చేయుటకు ఏర్పాట్లు ప్రారంభించుచుండగా గద్వాల్ కు చెందిన వెంకటేశ్వరమ్మ గారికి తాత గారి  పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలవని ఇంతకు ముందే తెలుసుకున్నాము కదా . ఆవిడ హఠాత్తుగా తాతగారి శరీరమునకు చెమట పడ్తున్నదనీ ప్రాణములతో ఉన్న తాతగారిని జీవ సమాధి చేస్తున్నారనీ పెద్దగా దుఃఖిస్తూ బాధపడుట ప్రారంభించిరి . అయితే ఆమెకు తనపై గల ప్రేమాభిమానములు తెలిసిన తాతగారు తనకు మరణము లేదను విషయమును తెలుపుటకు ఆ విధముగా ఆమెకు అనుభూతిని కలిగించిరి . అటు పిమ్మట తాతగారికి యధావిధిగా మంగళ స్నానములు చేయించి ,ఆ వస్త్రమును తీసి దిగంబరముగా సమాధియందు కూర్చుండబెట్టిరి . అక్కడనే ఉన్న ఒంగోలుకు చెందిన సుబ్బలక్ష్మిగారు ఆ వస్త్రమును తీసుకుని అది తాతగారు తనకిచ్చిన ఆఖరి ప్రసాదముగా భావించి దానిని భద్రపరచుకొనిరి . సమాధియందు కూర్చుండబెట్టిన తరువాత ఢిల్లీ వాస్తవ్యులైన కాడేగారు తీసుకువచ్చిన శాలువాతో తాత శరీరము కప్పిరి . ఆ ఆవిధముగా అందించిన శాలువ చిరస్థాయిగా తాతగారి శరీరముపై మిగిలిపోయినది . తాతగారు కన్నులు మూసుకుని కూర్చునియున్న ఆ దృశ్యము తాతగారు యోగ సమాధియందు కూర్చున్నట్లు గనే యున్నది . ఇక ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమాయెను . 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1429 on: January 26, 2018, 06:26:53 AM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

భక్తులందరినీ ఎల్లప్పుడూ ఆప్యాయముగా పలకరించుచూ ,వారికి వచ్చిన కష్టములను రూపుమాపుతూ ,అందరి కర్మలనూ తాననుభవించుతూ ఎన్నెన్నో ప్రసాదములను ,ఆశీర్వాదములను తాత చేతుల మీదుగా అందుకున్నవారందరూ ఇప్పుడు తమ చేతులతో తాతగారిని ఏ విధముగా కప్పగలము అని హృదయ విదారకముగా విలపించుచుండిరి . చేతులారా తాతను సమాధి చేయవలసి వచ్చిన తమ దురదృష్టమును తలచుకొని దుఃఖించుచుండగా అప్పటివరకు ఎవరికీ వారుగా బాధపడిన భక్తులందరూ ఒక్కసారిగా పెద్ద పెట్టున రోదించడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినది . ఒక్కసారి తాతగారి మందిరములోనికి ప్రవేశించు వారు తిరిగి   వెళ్లకపోవడముతో వేలాదిగా బయట వేచియున్న భక్తులకు ఒక్కసారిగా లోపలనుండి రోదనలు తారాస్థాయి నందుకోగా జరిగినదేమిటో అర్థము కాక వారూ బిగ్గరగా విలపించసాగిరి . ఈ విధముగా భక్తుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుచుండుట గాంచిన ధోన్ నుండి వచ్చిన భక్త బృందము ,కర్నూలు రామ్మోహన్ ,మల్లేష్ ,నెల్లూరు జయచంద్రారెడ్డి ఇక ఆలసించిన పరిస్థితి పూర్తిగా విషమించుట ఖాయమని గ్రహించి మనసును దిటవు చేసుకొని సమాధి లోపలకు దిగి కార్యక్రమమును ప్రారంభించిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1430 on: January 28, 2018, 06:34:59 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ విధముగా ఆ కార్యక్రమము ప్రారంభమైనాక ఇక భక్తులందరూ ఎడతెరపి లేకుండా ముందుకు వచ్చి ప్రమిదలను తెచ్చిన శైలజ సాయి సచ్చరిత్రలో  బాబా గురుస్థానము లో ఒకసారి తవ్వి చూడగా అక్కడ నాలుగు ప్రమిదలు వెలుగుతూ కనిపించుట ,బాబా స్వయముగా అది తన గురుస్థానమని దానిని మట్టితో కప్పివేయమని  సంగతి మదిలో మెదలాగా తాతగారు కూడా అందరకూ గురువుగారు కాబట్టి వారి సమాధి యందు కూడా దీపములుంచుటకే సాయిబాబా తనకు షిరిడీలో ప్రేరణ కలిగించి దీపములు పంపించెనని తలచి నాలుగు దీపములు వెలిగించి నాలుగుదిక్కులా ఈ దీపములు పంపించెనని తలచి నాలుగు దీపములు వెలిగించి నలుదిక్కులా ఈ దీపములనుంచిరి . అటు పిమ్మట కార్యక్రమమంతా చకచకా సాగిపోయినది . తాతగారి దేహము మొత్తము క్రమక్రమముగా కనుమరుగౌతూ చివరకు ముఖము ,కళ్ళు ఇలా ఒక్కొక్కటిగా మూసివేయ బడుతుండగా ఆ దివ్యమంగళ రూపమును ఇక ఎన్నటికీ చూడలేమన్న దుఃఖము మరొక్కసారి ఉప్పొగింది . ఇక తల మాత్రము కప్పబడవలసి ఉండగా అప్పుడు షిరిడీ గురుస్థానము నుండి సాయిబాబా స్వయంగా పంపించిన గులాబీపూవును ఆఖరుగా శైలజ తాత శిరస్సు పై అలంకరించడముతో తాతగారిని సమాధిచేయు కార్యక్రమము ముగిసినది . అప్పటికి రాత్రి తొమ్మిది గంటలు దాటినది . ఇక ఒక్కొక్కరుగా తాతగారి సమాధిని దర్శించుకొని పుష్పగుచ్ఛములచే సమాధిని అలంకరించుచూ ముందుకు సాగుచుండిరి . ఆ విధముగా భక్తులందరూ ఆ రాత్రంతయూ సమాధిని దర్శించుకొని భారమైన హృదయములతో వెనుదిరిగుచుండిరి . మరుసటి ఉదయముననే భక్తులు తాతగారికి యథావిధిగా హారతులు పాడి పూజలు గావించిరి . ఆ విధముగా ముందురోజు వరకు తాతను ప్రత్యక్షముగా దర్శించి పూజించుకున్న భక్తులందరూ ఒక్కరోజు తేడాతో తాతగారి సమాధిని పూజించ వలసి వచ్చినదని దుఃఖించిరి . ఇక ఆ రోజు నుండి సమాధి మందిరములో నిత్యపూజలు ,హారతులూ క్రమపద్ధతిలో కొనసాగుచున్నవి .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అవధూతలకు మరణమే ఉండదు కావున మానవులకు జరుగు కర్మకాండలతో పనిలేదు . అయితే తాతగారు తానూ సమాధి చెందిన తొమ్మిదవ నాడు చిన్న చమత్కారము చూపించిరి . వృత్తిరీత్యా తపాలాశాఖలో పనిచేయుచున్న శైలజకు తాతగారు సమాధి చెందిన తొమ్మిదవ నాడు ఆఫీసులో పనిచేయుచున్న సమయములో ఉత్తరముల మధ్యనుండి ఒక అందమైన పెద్ద ఎర్ర గులాబీ చేతులలోకి వచ్చింది . ఆ గులాబీ అచ్చు తాతగారి సమాధినాడు గురుస్థానములో బాబా తలపై నుండి పడగా తీసుకుని వచ్చి  తాతగారి తలపై నుంచిన పూవు మాదిరిగానే ఉన్నది . తన పది సంవత్సరముల సర్వీసులో ఎన్నడూ ఈ విధముగా జరగనందున ఆమెకు సంతోషమూ ,దుఃఖమూ సమపాళ్లలో కలిగినవి . ఎందుకంటే చిన్నతనము నుండి గురుచరిత్రను పారాయణము చేయుచున్న ఆమెకు శ్రీ నృసింహాసరస్వతి స్వామి  తను శ్రీశైలములోని పాతాళగంగలో అంతర్ధానమయిన తరువాత తన నలుగురు ముఖ్య శిష్యులకు నాలుగు పుష్పములను నదిలోనుండి పంపించినట్లు గురుచరిత్రము నందున్నది . అదేవిధముగా ఇప్పుడీ సంఘటనను గమనిస్తే అది తాతగారు ఆమెకు పంపిన ప్రసాదముగా భావించి కన్నీళ్లతో ఆ గులాబీ పూవును భద్రపర్చుకున్నది . అయితే మనసులో మాత్రం తాత తనపై నిజముగానే ఇంతటి కృపను కురుపించినారా ,తానూ తాతగారి ప్రేమకు నిజముగనే నోచుకున్నానా అయితే ఈ విషయము నిర్ధారణ కావాలంటే తనకొక నిదర్శనము కనిపించిన ఈ పూవు రావడము యాదృచ్చికము కాదనీ అది తాతగారు తనకు పంపిన ప్రసాదమని తెలుసుకోగలుగుతాననీ మనసులో భావించగనే తాతగారు అందుకు తగిన నిదర్శనము చూపించిరి . ఇక అప్పుడామె అంతులేని ఆనందముతో ఆ పూవును భద్రపరచుకున్నది . ఆ విధముగా తాతగారు తాను నిర్దేసించినట్లుగానే జీవనం గడుపుతున్న ఆమెకు తన ఆశీస్సులను ఆ విధముగా అందచేసి ఆమెకు అంతులేని మనోశక్తిని కలిగించిరి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1432 on: January 30, 2018, 07:58:29 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అవధూతలు సమాధి చెందినప్పటికీ వారి శక్తి అనంత శక్తిలా నిలచి మనను కాపాడుతుందని మనకందరకూ తెలుసు . అయితే అందరకూ ఆ నమ్మకము స్థిరపడి తాత ఉన్నారను నిదర్శనము కలుగుటకు ఇప్పుడొక సంగతిని తెలుసుకుందాము . మనము ఇంతకు మునుపే తాతగారి ప్రథమ దర్శనమునకై వస్తున్నా గోపీనాథ్ కుటుంబమును ఊబి నుండి బయటకు రప్పించి తాతగారు కాపాడారని తెలుసుకున్నాము . అదే గోపీనాథ్ కుటుంబము తాతగారి సమాధి కార్యక్రమములో పాల్గొని అది పూర్తయిన తరువాత శ్రీమతి విజయలక్ష్మి గారి కారులో తాతగారిని గురించిన విషయములనే ముచ్చటించుకుంటూ భారమైన హృదయములతో నుండిరి . ఇంతలో హఠాత్తుగా ఒక లారీ ఎదురుగా అదుపు తప్పి వస్తుండడము గమనించిన విజయలక్ష్మిగారి భర్తగారైన రామకృష్ణగారు ఒక్కసారిగా కారును రోడ్డుపై నుండి పక్కకు తిప్పిరి . అప్పుడక్కడ ఉన్న ఒక పెద్ద రాయికి తగులుకొని కారు పల్టీలు కొట్టింది . విజయలక్ష్మిగారు ఒక్కసారిగా 'తాతా ' అని అప్రయత్నముగా అరచిరి . ఆ తరువాత కొంతసేపటికి ఒక్కొక్కరు తేరుకుని ఎవరికేమైనదోనని ఆత్రముగా ఒకరినొకరు పలకరించుకోగా అందరూ స్వల్ప గాయములతో బయటపడిరని అర్ధమయ్యింది . రామకృష్ణగారు ఏ మాత్రము ఆలసించినా వారందరూ ఆ లారీ ప్రమాదములో మరణించి ఉండేవారు . సమాధిలో కూర్చున్న మరుక్షణము నందే తాతగారు మళ్ళీ  అదే కుటుంబమును ప్రాణములతో రక్షించుట గమనిస్తే తాతగారికి శరీరముతో అవసరంలేదనీ ,వారి సూక్ష్మ శరీరము ,అనంత శక్తి కలకాలము మనను కాపాడతాయను సంగతి తేటతెల్లమయినది .

                                                          తమేవ సర్వం మమ దేవ దేవ
                                                    ఇరువదవ అధ్యయము సంపూర్ణము


 


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1433 on: January 31, 2018, 07:32:45 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

                                            అధ్యాయము -21
                           శ్రీ గణేశాయ నమః   శ్రీ సరస్వత్యై నమః శ్రీ రామావధూతాయ నమః

                                             పరమ పవిత్రం పూజనీయం పావనచరితం
                                            తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

పునః దర్శనము :

తాతగారుసమాధి  చెందిన తరువాత ఆ సమాధిని పాలరాతితో నిర్మించిన అన్ని విధములా అనుకూలముగా ఉండునని భావించిరి . అయితే తాతగారిని సమాధి చేయునపుడు సమాధిని ఆ రోజు కేవలము మట్టితో కప్పివేసిరని  తెలుసుకుని సమాధి లోపల నుండి గోడలు నిర్మింపకున్న పైన కట్టు సమాధికి ఆధారముండదు కావున తప్పనిసరి పరిస్థితులలో సమాధి చుట్టూ తవ్వి తవ్వి గోడలు కట్టుట అన్ని విధములా శ్రేయస్కరమని నిర్ణయించిరి . పనివారు వచ్చి పనిని ప్రారంభించిరి . కొంతసేపటికి ఈశాన్యంవైపు మట్టిని తవ్వుతుండగా అనూహ్యముగా తాతగారి పాదము దర్శనమిచ్చెను . అది గాంచిన ఒక్కరూ పనిని వదిలివేసి ఆశ్చర్యముతో ఏమి చేయుటకు పాలుపోక నిలుచుండిపోయిరి . ఎందుకనగా తాతగారిని సమాధి చేయునపుడు ఉత్తరదిక్కుగా కూర్చునబెట్టి ఆ తరువాత పూర్తిగా మట్టితో కప్పి సమాధి చేయుట జరిగినది . అటువంటిది తాతగారి పాదము ఒక మూలగా కనిపించుట గమనిస్తే కూర్చోపెట్టిన తాతగారు ఏ విధముగా పక్కకు ఒరిగిరో ఊహకందని విషయము . అప్పటికి తాతగారు సమాధి చెంది సరిగ్గా 21 రోజులు గడిచినవి . అసలు పాదము కనిపించుటయే ఒక ఆశ్చర్యమనుకొంటే ఆ పాదము నల్లగా నిగనిగలాడుతూ సజీవముగా కనుపించినది . ఇక్కడ ఒక ముఖ్య విషయము గమనించవలెను . తాతగారిని సమాధి  చేయునపుడు ధోన్ నుండి వచ్చిన భక్తులు చొరవ తీసుకొని కార్యక్రమమును నడిపించిరని తెలుసుకున్నాము . వారు అప్పటికే మరియొక యోగీశ్వరుడును సమాధి చేసియుండుటచే వారికీ విధానమంతా క్షుణ్ణ ముగా తెలిసియుండుటచే వారారోజు విరివిగా ఉప్పు  బస్తాలు తెప్పించి సమాధి చేయునపుడు అందులో వేయించుటచే తాతగారి శరీరము ఎటువంటి దుర్వాసనకూ లోనుగాకుండా శిధిలమైపోవునని తెలిపిరి . అంతేకాక ఒక చిన్న చీమ కూడా లోపలకు దూరకుండునట్లు కొంచెము కూడా వెలితి లేకుండా సమాధిని పూర్తిగా మట్టితో కప్పివేసిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1434 on: February 01, 2018, 03:30:01 PM »

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

జయచంద్రారెడ్డిగారు సమాధిలో ఉన్న తాతను పద్మాసనంలో కూర్చుండునట్లు చేసి ఉప్పు తగ్గితే దుకాణం వారిని బతిమాలి మరింత ఉప్పు తెచ్చి తాత శరీరమునకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తపడిరి . వీరి సతీమణి జయమ్మగారికి తాత  సమాధియైన 15 రోజులకు ఒక కాలువలాంటి దాంట్లో కూర్చుని ఉన్న తాత కాళ్ళను చాలా ఇరుకుగా పెట్టుకుని కూర్చున్నట్లు కల వచ్చింది . ఆ తరువాత వారం రోజులకే తాత పాదము దర్శనమివ్వడమూ ,తాత  సమాధిలో పడుకుని ఉన్న స్థితికి వచ్చిరను  సంగతి తెలిసినది . అయితే ఈ రెండు చర్యలకు భిన్నముగా కూర్చోబెట్టిన తాతగారు పడుకుని యున్న స్థితికి రావడమూ ,ఆ పాదము జీవముతో ఉండడము అక్కడున్న ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యములలో ముంచివేసినది . ఏ సంగతి అప్పటికప్పుడు కార్చిచ్చు వలె కల్లూరు గ్రామములో పాకిపోయింది . తండోప తండాలుగా తరలివచ్చి భక్తులంతా తాతగారి పాద దర్శనము చేసుకొని తరించిరి . ఈ చర్య ద్వారా తాత తనకు మరణము లేదనీ ,తన శరీరము శిథిలము కాదనీ భక్తులకు తెలియపరచుట వలన భక్తులందరూ తమకు తాత ఆశీస్సులు కలకాలము నిలచి ఉండునను ధైర్యముతో తాతను దర్శించి మరలినారు .ఈ  విధముగా సుమారు రెండువేలమందికి ఆనాడు తాతగారి పాదదర్శనము లభించి ధన్యులైరి . భక్తజన సందోహమును అదుపుచేసి సమాధిని ఎప్పటివలెనె  కప్పివేసి పనులు తిరిగి ప్రారంభించి సకాలమునందు పూర్తిచేసిరి .  తాతపట్ల పెద్దగా అవగాహన ,భావన లేని శైలజ అక్క పద్మజకు తాతగారు కలలో కనిపించి వెంటనే శైలజను కల్లూరు పంపించి ఆమెచే విష్ణు సహస్రనామము పారాయణ చేయించమని సమయముతో సహా సూచించగా కల్లూరు చేరిన శైలజ తాతగారు సూచించిన సమయము సరిగ్గా వారి మొదటి సమాధి అభిషేకము కావడము చూసి ఆనందముతో తన పారాయణ చేసి ఆ సేవలో పాల్గొంది .  అప్పటినుండి తాత  సమాధి నందు సజీవముగా ఉన్నారను భావము అందరికీ ఎంతో తృప్తినీ ,ధైర్యాన్ని ఇచ్చినది . అందుకనే వేలాదిగా భక్తులు తాతగారి సమాధిని దర్శించి ,అభిషేక పూజలు గావించి మేలు పొందుచున్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

భగవత్సరూపులూ ,కారణజన్ములూ ,పరిపూర్ణ ఆత్మ స్వరూపులూఅయిన శ్రీశ్రీశ్రీ రామవధూత గారికి మరణము లేదన్న సంగతి అందరకూ తెలిసినదే . కావున సామాన్య మానవులకు జరుపు ఉత్తర క్రియలు వారికి అవసరము లేదు .. అయినప్పటికీ భక్తులు తమ సంతృప్తి కొరకు యోగులకు మండల పూజలు ,ఆరాధనలూ సలుపుట వాడుకలో ఉన్నది . అదేవిధముగా తాతగారికి కూడా భక్తులందరూ మండలారాధన జరుపుటకు ఫిబ్రవరి 24 వ తేదీని నిర్ణయించిరి . భక్తులందరికీ ఆహ్వానపత్రికలు ,సమాచారములు అందచేయబడినవి . తాతగారు ఎల్లప్పుడూ కూర్చొను వేపచెట్టు ప్రాంతము (కల్లం ) అంతా శుభ్రపరచి విశాలమైన డేరాలు వేసి దూర ప్రాంతముల నుండి వాహక భక్తులకు వసతి ఏర్పాటు చేసిరి . వంటశాలలు నిర్మించిరి . ఎక్కడెక్కడ నుండియో భక్తులు ముందు రోజుకే కల్లూరు చేరిరి . 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1436 on: February 03, 2018, 08:33:57 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి.  శైలజ )

తాత మండలారాధనకు కల్లూరు వచ్చిన కాశిరెడ్డి తాత చేతికి తాతగారి వద్ద నుండే కర్ర నివ్వగా వారా కర్రను పట్టుకుని కొంత దూరము వెళ్లిన తరువాత తిరిగి ఇవ్వబోతే వీరు ఆ కర్రను కాశిరెడ్డి తాతగారి వద్దనే ఉంచుకోమనిరి  .    . రెడ్డి తాతగారి వద్దనే ఉంచుకోమనిరి . అప్పుడు ఆయన "రామిరెడ్డి ఎక్కడకు వెళ్ళాడు ? కర్ర నిక్కడే ఉండనీయండి " అన్నారు ఆ మాటలతో కూడా తాత సమాధి చెందలేదు . మనము ఎప్పుడు మనస్ఫూర్తిగా తలచుకుంటే ప్పుడు తాత ఆశీస్సులు తమకు లభించగలవన్న ధైర్యము కలిగింది .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1437 on: February 04, 2018, 07:32:34 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

గుంటూరు బాలచందర్ గారు తాతగారు శరీరముతో నుండగా ఎప్పుడూ కూర్చును ఉండు విధముననే ఒక నిలువెత్తు తైలవర్ణ చిత్రమును వేయించి తీసుకుని వచ్చిరి . తాతగారి చిత్రము తేజోమయముగా నుండి జీవకళ ఉట్టిపడుచునట్లుగా ఉన్నది . ఆ చిత్రపటమును చూసిన వారందరికీ తాతగారు మన కళ్లెదుట కూర్చుని ఉన్నట్లే ఉన్నది . అంత సజీవంగా పటము చిత్రించిన  చిత్రకారుడు నాగేశ్వరరావుగారు నిజముగా ధన్యులు . తాతగారి ఆ పటమును ఊరేగించుటకై సకల ఏర్పాట్లూ చురుకుగా సాగినవి . పూలతో శోభాయమానముగా అలంకరింపబడిన రథము   సిద్ధముగా నుండెను . ముందుగా సమాధి మందిరమునందు అష్టోత్తర పూజలు ,హారతులు యథావిధిగా జరిపిన పిదప తాతగారి చిత్రపటమును రథముపై నుంచిరి . భక్తుల జయ జయ ధ్వానములు మిన్నుముట్టుచుండగా ,వివిధ రకముల వాయిద్యములు మ్రోగుచుండగా ,బాణ సంచాల హోరులో ,చిరుగంటల సవ్వడిలో రాగయుక్తముగా పాడు పాటలకు లయబద్దమైన తాళములు జతకలుపగా ,ఆనందనృత్యముల మధ్య శోభాయాత్ర బయలుదేరినది . వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహము కల్లూరు పురవీధుల గుండా కర్నూలు పట్టణము వీధుల గుండా తిరిగి కల్లూరులోని వంటశాలవైపుకు వచ్చి ఆగినది . ఈ విధముగా తాతగారి చిత్రపటముతో జయప్రదముగా ముగిసిన ఊరేగింపు వంటశాలవైపు వచ్చుసరికి వంటలు సిద్ధముగానున్నవి .  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1438 on: February 05, 2018, 08:49:01 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

కలగొట్ల గ్రామముతో తాతాగారికి ఉన్న అనుబంధము తెలిసినదే . అదేవిధముగా ఆ గ్రామ ప్రజలకు తాతగారు సాక్షాత్ శ్రీరామచంద్రుడే . ఆ గ్రామం మొత్తం తాతను తమ ఇలవేల్పుగా ,కుటుంబ పెద్దగా ఆరాధించి కొలుచుట మనమింతకుముందే తెలుసుకుని ఉన్నాము . వారు తాతపై తమకు గల ప్రేమాభిమానములను తెలుపుటకు ప్రత్యేకముగా వేరొక వంటశాలను ఏర్పాటుచేసి వంటలు ప్రారంభించిరి . వారు తాతగారి పట్ల తమకు గల ప్రత్యేక ప్రేమను తెలుపుటకు ఈ మార్గము ఎంచుకొనిరి . అనుకోని విధముగా తాతగారి శోభాయాత్ర ముగించి వచ్చుసరికి వీరి వంటశాల నుండియే మొదటగా ప్రసాదము వచ్చెను . ఆ విధముగా తాతగారు కూడా తన కోసము వచ్చిన తన భక్తుల ప్రేమ పూర్వకమైన ఆరగింపును స్వీకరించిరి . ఆ తరువాత రెండు వంటశాలలు పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండిటియందు విరివిగా అన్నదానము జరిగెను . ఎక్కువగా బీదవారు ,అన్నార్తులు అన్నదానము నందు పాల్గొనుటచే అందరకూ తృప్తిగా భోజనమిడినారు . వేలాదిగా భక్తులు తాతగారి మహాప్రసాదమును మనసారా భుజించారు . మధ్యాహ్నము మొదలైన అన్నదానము రాత్రి పదిగంటల వరకు రెండు వంటశాలయందును విరామము లేకుండా సాగెను .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1439 on: February 06, 2018, 08:27:10 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అటుపిమ్మట అనేకమంది భక్తులు మధురమైన భజనలు గావించిరి . రాత్రి సుమారు 10 గంటలకు హరికథా కాలక్షేపము ఏర్పాటు చేయబడినది . తాతగారి మహిమలను శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామితో పోలుస్తూ కథాగానము మధురముగా సాగినది . ఈ విధముగా తాతగారి మండలరాధన కార్యక్రమము అత్యంత భక్తిశ్రద్ధలతో ,ప్రేమానురాగముల మధ్య దిగ్విజయముగా వైభవముగానూ జరిగినది . అప్పటివరకు తాతగారిని ప్రత్యక్షముగా దర్శించి పూజించుకున్న భక్తులందరకూ తాతగారి దివ్యమంగళ రూపము కనుమరుగగుటను జీర్ణించుకొనలేక అందరూ భారమైన హృదయమములతో ఈ కార్యక్రమము ముగిసిన తరువాత మరలి వెళ్లిరి .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!