Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 137058 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 అక్కడ నుండి తాతగారితో కలిసి బృందమంతా ఋషికేశ్ బయలుదేరి గంగాతీరమును చేరిరి . మనోహరమైన ఆ ప్రకృతి శోభకు అందరూ పులకరించి గంగా తీర్థమును సేవింపగా ,గంగామాత మాత్రము ఇంతటి మహాయోగి దర్శన భాగ్యముచే పులకరించి పరవళ్లు తొక్కింది . అప్పుడు నారాయణ రెడ్డి గారికి గంగానది ఎప్పుడెప్పుడు మహనీయుల పాదస్పర్శచే తన కంటిన మాలిన్యమును తొలగించుకోవాలని ఎదురుచూస్తూంటుంది అని తెలిసిన వారగుటచే పవిత్ర గంగానది మధ్యకు తాతగారిని రమ్మని ప్రార్ధించగా "సరే పోదాం పద " అంటూ ముందుగా తెలియచేయనప్పటికీ ,నది దిగువ వైపు గుండా కొంత దూరము నడచి అక్కడ ఉన్న ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి అక్కడనే అయిదారు నిమిషములు కదలకుండా నిశ్చలముగా నిలుచుండిపోయిరి . నాలుగైదు అడుగులఎత్తున ఆ రాయి చివర అతి కష్టము మీద రెండు పాదములుంచుటయే గగనము . అంతటి సన్నని ఆ రాతిమీద తాత అంత సమయము నిలుచుండిపోయిరి . అది గమనిస్తున్న నారాయణరెడ్డి ,మదిలేటి  తదితరులందరూ తీవ్ర ఆందోళనమునకు గురియైరి . ఎందుకనగా ఏ మాత్రము పట్టుతప్పినా అంత ఎత్తు నుండి క్రిందకు పడిపోవుట ఖాయము . మానవ సహజమైన ఆత్రుతతోనూ , తాతపై వారికున్న ప్రేమవల్లనూ వారారకముగా ఆందోళన చెందిరి కానీ ,సృష్టిని శాసించి ఆపగల సర్వాధికారియైన తాతకు ఆ రాయి ఒక లెక్కనా ? కొంతసేపు ఆ విధముగా తాత తన లీలావిలాసమును చూపి అటు పిమ్మట కిందకు దిగివచ్చి గంగా జలమునకు చేరువగా వచ్చుసరికి మదిలేటి ఆపుకోలేని ఉత్సాహముతో గంగోదకమును తెచ్చి తాత పాదములను భక్తితో కడిగాడు . ఆ నీరంతా తిరిగి గంగానదిని చేరింది . ఆ విధముగా నారాయణరెడ్డి గారికి తాత పాదస్పర్శచే గంగానదిని పునీతము చేయవలెనన్న సంకల్పము నెరవేరినది .
 
             
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1381 on: December 03, 2017, 09:54:20 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అక్కడి నుండి మరలిన తాత నేరుగా అక్కడకు దగ్గరలో ఉన్న స్మశానంలో నిలబడిరి . అప్పుడక్కడ తాతను చూసి తరించిన భక్తులందరికీ భస్మోద్ధూళిత వేషధారియైన రుద్రుడు ,బాలోన్మత్త పిశాచ వేషధారియైన దత్తుడు తాతలో దర్శనమివ్వగా అందరూ ఆనందములో మునిగిపోయిరి .
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1382 on: December 04, 2017, 09:07:51 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి.  శైలజ )

ఆ తరువాత తాతగారు  వెలుపలకు వచ్చి నదీ తీరము ఎగువ నుండి నడక సాగించిరి .అక్కడ నుండి రోడ్డుపైకి రావలెనంటే ఒకటే దారి ఉన్నది . తాత ఆ దారి గుండా కాకుండా వేరొక మార్గములో దారియంతయూ తెలిసిన వారివలే చకచకా నడుచుచూ ముందుకు సాగుచుండిరి . తాతతో ఉన్న భక్తులందరూ తాత ఎక్కడకు వెళ్తున్నారో తెలియక తాతను వెంబడించిరి . తాత తిన్నగా నడుచుకుంటూ ఆ ఇరుకు దారిలో పయనించి నేరుగా రోడ్డుమీదకు చేరిరి . అసలు ఆ మార్గము గుండా వెళితే రోడ్డును చేరవచ్చన్న సంగతి ఎవరకూ తెలియదు . మరి తాతగారు ఎప్పుడూ ఋషికేశ్ కు వెళ్ళనప్పటికీ ఆ మార్గము మొత్తము పరిచయమున్నట్లు ప్రవర్తించుట గమనిస్తే తాతగారి సర్వజ్ఞత్వము మనకందరకూ తెలియుటయే కాక అవధూతలకు భాషా ప్రాంతముతో నిమిత్తము లేక ఈ ప్రపంచమంతా వారే అన్న సంగతి స్పష్టమగుచున్నది .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1383 on: December 05, 2017, 04:12:59 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 ఋషికేశ్ నుండి రామ్ ఝులా మీదుగా లక్ష్మణ్ ఝులాను చేరిరి . అక్కడ గల ప్రఖ్యాత శివాలయములో 12 అడుగుల శివలింగము కలదు . తాతగారు ఆ మందిరములో ప్రవేశించి ఆ శివలింగము పై చేతులుంచి నిశ్చలముగా నిలుచుండిపోయిరి . ఈ దృశ్యమును గాంచిన అక్కడి పూజారి నిశ్చెస్టుడై నోటమాట రాక నిలుచుండిపోయెను . ఆ విధముగా తాత తానే శివరూపమని చెప్పకనే చెప్పి తనకు ఎదురులేదని నిరూపించిరి .
 
  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1384 on: December 06, 2017, 05:41:52 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10.  గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ   గురవేనమః ॥

                                   శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
మందిరము వెలుపలకు వచ్చిన తరువాత తాతగారి వింత చర్యలు ,ప్రవర్తన చూసి తాత సామాన్యుడు కాదన్న సంగతిని గ్రహించి ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి తాతను దర్శించి నమస్కరించుకుని వెళ్లిరి . అటు పిమ్మట తాతగారు కాలినడకన ఆ ప్రాంతమంతా కలియతిరిగిరి . ఆ విధముగా ఆధ్యాత్మిక చింతనకు కేంద్రమైన ఋషికేశ్ ప్రాంతము అవధూత పాదస్పర్శచే పునీతమైనది . ఆ విధముగా ఎందరెందరో యోగులను ,ఋషులను ,సాధువులను ధన్యత నొందించిన ఆ పావన క్షేత్రము సాక్షాత్ భగవత్సాక్షాత్కారముచే పరవశించింది .

ఏ విధముగా ఎన్నెన్నో మధురానుభూతులు ,మహిమలను ఉత్తరదిశ ప్రజలకు అందించిన తాత ఒక తీపి గుర్తును వాళ్లకు మిగిల్చి కల్లూరుకు మరలి వచ్చిరి .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఈ తిరుగు ప్రయాణములో తాతగారు ఒక చిన్న చమత్కారమును చూపించిరి . అదేమనగా తాతగారు తిరుగు ప్రయాణములో ఢిల్లీ చేరగనే ఢిల్లీ భక్తులందరూ స్టేషను చేరి వారి వారి ప్రేమాభిమానములకు తగినట్లుగా ఎవరికీ తోచిన తినుబండారములు -ఫలహారములు ,పళ్ళు ,స్వీట్లు ,ఇలా రకరకముల  నైవేద్యములను అర్పించి తాతగారికి దారి పొడవునా ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా ఏర్పాట్లు గావించి భారమైన మనసులతో మరలివెళ్లిరి . అయితే ఈ భజన బృందములో  సాయిబాబాను తప్ప అవధూతలపై ఏ మాత్రమూ విశ్వాసము లేని కృష్ణమూర్తిగారు అందరూ తాతగారికి నైవేద్యములు తెస్తే వీరు మాత్రము ఒకరికోసం దారిలో భోజనముకై ఇబ్బంది కలుగకుండుటకై ఆంధ్ర హోటలు నుండి ఒక దోశెను తెచ్చి ఇచ్చి వేరొక కంపార్టుమెంటు లోని వెళ్లిపోయారు . అయితే ఆ తరువాత తెలిసింది తాత తనకోసం అంతమంది తెచ్చిన అన్ని పదార్ధములనూ పక్కకు పెట్టి తన కోసము తీసుకురాని ఆ దోశెను కొంచెము కూడా మిగల్చకుండా మొత్తం తిని ఒక చిటికెడు ప్రసాదరూపంలో కృష్ణమూర్తిగారికి పంపించిరి . ఈ విధముగా తాత ఆయన నిష్కల్మష హృదయమునూ ,ఒకరిపైననే ధ్యానముంచవలెనన్న సిద్ధాంతమునూ గ్రహించి సాయిబాబా రూపములోనే ప్రసాదము గ్రహించుట ద్వారా వారినీ విధముగా ఆశిర్వదించిరి . నేడు ఆ కృష్ణమూర్తి గారే తాత సమాధి తరువాత తాతగారి పేరున స్థాపించబడిన అనాధ శరణాలయమైన "రామసన్నిధానము " నాకు విశేషముగా సేవ చేయుచున్నారు .   ఆ రకముగా భవిష్యత్తు తెలిసిన తాత ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆనాడే ఆశీర్వదించి భవిష్యత్కార్యక్రమము జరిపించుటకు కావలసిన శక్తిని ప్రసాద రూపంలో అనుగ్రహించిరి .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1386 on: December 08, 2017, 04:38:03 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

కృష్ణమూర్తిగారు తన పదవీ విరమణ తరువాత పూర్తిగా సాయిసేవకు అంకితమై ఎందరెందరకో  సాయిసేవా భాగ్యమును కలిగించిరి . త్రికరణ శుద్ధిగా సన్నిధానమునకు సాయిబాబా ,తాతగారే యజమానులూ తాము సేవకులమని భావించి నిస్వార్ధముగా తన వయసును కూడా లెక్కించక సన్నిధానమునకు అన్ని విధముల సేవలనూ తానె స్వయముగా నిర్వహిస్తూ పూర్తి బాధ్యతను స్వీకరించిరి . వీరి నిష్కల్మష హృదయమునకు మెచ్చిన తాత వీరినే సన్నిధాన సేవకు ఏకైక వ్యక్తిగా ఎందుకొని సేవ చేయించుకుంటున్నారు . అంతేకాక ఈ గ్రంథరచన సమయములో వీరికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు తాతగారే ముందుగా సూచించి అపాయము నుండి కాపాడుట ద్వారా వీరి సేవకు అంతము లేదని నిరూపించిరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1387 on: December 09, 2017, 04:02:02 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

రామిరెడ్డి తాతవంటి సద్గురువులు జీవనది వంటివారు . నది గమ్యము సముద్రము . ఆ సముద్రాన్ని చేరేటప్పుడు నది దారిలో ఉన్న దాహార్తుల దాహం తీరుస్తూ అన్నదాతల పంట పొలములకు నీరందిస్తూ జీవితాలకు వెలుగునిచ్చే విద్యుత్పత్తి గావించుచూ తన గమ్యాన్ని తాను చేరుతూనే ఇన్ని రకాలుగా మానవాళికి ఉపయోగపడుతుంది . అదే విధముగా అవధూత రామిరెడ్డి తాత తన సహజస్థితియైన అలౌకిక స్థితిలో ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటూనే భక్తజనోద్ధరణ గావిస్తున్నారు .

                                                                         త్వమేవ  సర్వం మమ దేవ దేవ
                                                                  పద్దెనిమిదవ అధ్యయము సంపూర్ణము
                                                                    ఆరవరోజు పారాయణము సమాప్తము .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1388 on: December 10, 2017, 04:40:55 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

                                                     ఏడవరోజు పారాయణము

                                                        మహాప్రస్థానము
                                                      అధ్యాయము -19
                                శ్రీ గణేశాయనమః  శ్రీ సరస్వత్యై నమః   శ్రీ రామావధూతాయనమః

                           మౌనివర్యం మహోజ్వలం మహదానంద దాయకం
                                తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

సాయిగీతా మందిర్ ( గద్వాలు ):

ఆగస్టు 15 వ తేదీ 1989 సం . న తాతగారి ఆదేశానుసారము అఖండ సాయినామ సాప్తాహ  సమితి వారు గద్వాలులో సాయినామ ఏకాహము నిర్వహించుటకు నిర్ణయించి ఆ గ్రామ పెద్దయిన శ్రీ సమర సింహారెడ్డి గారి తల్లియైన శ్రీ వెంకటేశ్వరమ్మ గారిని సంప్రదించగా వారు సకల ఏర్పాట్లనూ సమకూర్చి భజన కార్యక్రమమును జయప్రదం గావించిరి . ఆ సందర్భములో మనస్ఫూర్తిగా వెంకటేశ్వరమ్మగారు   సాయిబాబాకు నమస్కరించుకోగా బాబా ఆశీర్వచనము  వారికి సంపూర్ణముగా లభించింది . ఆ తరువాత ఆవిడకు కల్లూరు తాతగారి వద్దకు వెళ్ళవలెననే సంకల్పము మనసుకు కలిగింది . అయితే అనుకోని విధముగా విపరీతమైన జ్వరము వచ్చి ఎన్నిరోజులైనా జ్వర బాధ తగ్గకపోవుటచే పరీక్షలు చేయించగా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు  అనీ, అందుకే జ్వరం తగ్గడం లేదనీ డాక్టర్లు నిర్ణయించిరి . పెద్ద పరీక్షలు చేయించుటకు కర్నూలుకు తీసుకు వెళ్ళవలసిందిగా సలహానిచ్చిరి . అప్పుడు వెంకటేశ్వరమ్మగారు కర్నూలు వెళ్లి అక్కడ అన్ని రకముల పరీక్షలు చేయించుకోగా వాటి రిపోర్టులు రావడానికి మూడు నాలుగు గంటల వ్యవధి ఉన్నదని చెప్పిరి . అప్పుడు వెంకటేశ్వరమ్మగారికి ఈ సమయములో తాతగారిని దర్శించుకోవచ్చునను ఆలోచన కలిగింది . వెంటనే  స్వీటు తీసుకుని తాత వద్దకు బయలుదేరిరి . సుమారు 3,4 కి . మీ దూరములో నున్న కల్లూరుకు బయలుదేరేసరికి అప్పటివరకు లేనిది పెద్దవాన మొదలయ్యింది . చూస్తుండగనే  మోకాళ్లలోతు నీళ్లు వచ్చేసాయి . అప్పుడుజీపు   నాపుకుని వర్షానికి భయపడి ఒక ఇంట్లో  తలదాచుకుని ఆ ఇంటివారిని తాతగారి గురించి అడుగుతుండగా అనుకోని విధముగా ఆ వర్షములోనే తాత అక్కడకు రావడము జరిగినది . వెంటనే తాతగారికి నమస్కరించి స్వీటు నందివ్వగా తాతగారు దానిని స్వీకరించక 'ప్రాణం బాగోలేదు ,వద్దు '! అన్నారు . ఆ ఆతరువాత ఆవిడ ఎంతగా బ్రతిమాలినా తాత అంగీకరించలేదు . ఈవిడ కళ్ళు మూసుకుని తాతను మనసులో ప్రార్ధించుచుండగా తాతగారు ఆమె ముందుగనే మూత్ర విసర్జన గావించిరి . అది చూసిన అక్కడున్న గ్రామస్థులు ఆ వచ్చినవారిలో ఎవరికో ఆరోగ్యం బాగుండకపోవుట చేతనే తాతగారు ఆ విధముగా చేసిరనీ ,అప్పటితో ఆ బాధ తీరిపోయింది తెలిపారు . ఆ తరువాత వెంకటేశ్వరమ్మగారు వాళ్ళు తాతగారి ఇంటికి వెళ్లి తాతను మరల దర్శించుకుని కర్నూలుకు మరలి వచ్చి రిపోర్టులు తీసుకోగానే అన్ని రిపోర్టులు సరిగా ఉండి ఎక్కడా ఏమీ ఆరోగ్య సమస్య లేదని తేలింది . అక్కడ గద్వాలలో డాక్టరుకు ఆ రిపోర్టులు చూసి అంతులేని ఆశ్చర్యము కలిగింది . ఇక్కడ తాను  ఖచ్చితంగా పరీక్షలు చేసి ఊపిరి తిత్తుల సమస్యగా అక్కడ అది లేదని తేలడము డాక్టరుకు అంతుపట్టని విషయముగా తోచింది . అంతకుముందు జ్వరముచే బాధపడిన ఆవిడకు గద్వాలుకు వచ్చిన తరువాత ఇక ఏ ఆరోగ్య సమస్యా రాకుండగా ఆనందముగా ఉన్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

ఇక అప్పటితో తాతగారి పట్ల అంతులేని నమ్మకము ఏర్పడిన ఆవిడ తన 65 సం . ముదుసలి వయసులో ఎప్పుడు తాతను చూడాలనిపిస్తే అప్పుడు కల్లూరుకు పరుగున వెళుతూ తాతను దర్శించి వస్తుండేవారు . ఆ విధముగానే ఒకసారి వెళ్లి తాతకు పాదనమస్కారము చేస్తుండగా తాతగారు ప్రపంచములో లేనన్ని తిట్లు తిట్టడం ప్రారంభించారు . ముసలితనము ,ఊళ్ళో గొప్ప పేరు ఉన్న ఆవిడ ఏంచేయాలో పాలుపోక అట్లానే తాత ముందు కూర్చుండిపోయిరి . ఎప్పటికోగానీ తాత శాంతించలేదు . తాత ఎందుకీ విధముగా ప్రవర్తించిరో ఆవిడకు అర్ధము కాలేదు . ఆ తరువాత ఆవిడకు గద్వాలులో ఒక సాయిబాబా మందిరము నిర్మించవలెనన్న సంకల్పము కలిగి తాతను ప్రార్ధించగా తాతగారు 'వద్దులే ' అన్నారు . అప్పుడామె అసలు సంకల్పము  కలిగించిందే మీరైనప్పుడు  వద్దు అన్న ప్రసక్తే రాదని ఎంతగానో ప్రార్ధించగా " తంతే నువ్వే పోతావు " అంటూ ఆమెను బెదిరించిరి . అయినప్పటికీ ఆవిడ ఏ మాత్రమూ తొట్రుపడక తాతగారిచే బలవంతముగనే  సరే ననిపించుకుని మరలి వెళుతుండగా తాతగారు " వస్తూండు -పెద్దమ్మా " అని అన్నారు . తాతగారు స్వయముగా ఆ విధముగా తెలపడముతో ఆవిడ కల్లూరు రావడము ఎక్కువ చేసిరి .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1390 on: December 12, 2017, 06:02:05 PM »

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ తరువాత సుమారు రెండు సంవత్సరములకు తాతగారు మందిర నిర్మాణమునకు సంపూర్ణ అనుమతినిచ్చి ఆశీర్వదించిరి . ఆ రకముగా తాతగారి సంపూర్ణ అనుమతికై వేచి చూసిన  ఆవిడ ఇక అప్పటినుండి పనులు ప్రారంభించి మే 16-1991 న శంఖుస్థాపనకు శుభముహూర్తమును తాత అనుమతితోనే నిర్ణయించిరి . అఖండ సాయి నామ సప్తాహసమితి వారి ఆధ్వర్యముతో భజన కార్యక్రమము " ఓం  సాయిశ్రీ శ్రీ సాయి జయ జయ సాయి " సాయి నామ ఏకాహము ప్రారంభమాయెను . ఆ తరువాత అందరూ కలిసి కల్లూరు చేరి తాతగారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించగా వేదపండితులు పూర్ణ కుంభములతో ఆహ్వానించగా గద్వాలులో పాదం మోపిన తాతగారు ఆ ఎండాకాలము నందు కదలకుండా రెండు గంటలపాటు నిలబడి భక్తులందరికీ పాద  దర్శన భాగ్యం కలిగించిరి . ఆ తరువాత తాతగారికి మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు ధరింపచేసి తరువాత శంఖుస్థాపన నిమిత్తము తాతగారి చేతికి కొబ్బరికాయ నివ్వగా తాత ఒక్కసారిగా హుంకరించి ఆ కొబ్బరికాయను వేయగా అంతటి మందు టెండలో గట్టిగా ఉన్న నెలలో ఆ కాయ  రెండడుగుల లోతుకు కూరుకుపోయింది . అది చూసిన వేంకటేశ్వరమ్మగారు సంతోషముతో తాతకు పాదనమస్కారము చేయుచూ ధ్యానస్థితి నొందిరి . ఆ తరువాత యధాస్థితికి చేరుకున్న ఆవిడ తాతగారికి మనస్ఫూర్తిగా తన కృతజ్ఞతలు తెలుపుకుని తాతగారిని తమ ఇంటికి సాదరముగా ఆహ్వానించగా తాత వారింట అడుగిడిరి . కొంతసేపటి తరువాత తాతగారు ' బొమ్మలు వేసేవాడిని పిలిపించు ' ( ఫోటోగ్రాఫరు ) అని అడిగి మరీ ఫోటోలు తీయించుకున్నారు . ఆ తరువాత వెంకటేశ్వరమ్మగారు తాతగారి పాదసేవ చేసుకుంటూ కూర్చోగా తాతగారు ఆవిడను పాట పాడమన్నారు . అసలు పాటలంటే తెలియని ఆవిడ ఏ పాట  పాడాలని తాతనే అడుగగా తాత ఏమీ ఫరవాలేదు మొదలు పెట్టమన్నారు . అప్పుడు తాత పాదాలు గట్టిగా పట్టుకుని అప్రయత్నముగా " ఏ తీరుగ నను దయ చూసెదవో ఇన వంశోత్తమ రామా ! నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా !!" అని తాతగారి దయవలననే ఆర్ధ్రముగా పాడేసరికి అక్కడున్న వారందరూ మైమరచిపోయిరి . పాట  పూర్తవడంతోనే తాతగారు వెంటనే అందుకుని ' సాయి రహమ్ నజర్ కర్ నా ,బచ్చోమ్ కా పాలన్ కర్ నా " అని పాడసాగిరి . తాతగారి ప్రేమలో అందరూ తడిసి ముద్దయిరి . 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1391 on: December 13, 2017, 09:52:43 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

వెంకటేశ్వరమ్మ భర్తగారు గీతామందిరము నిర్మింపదలచి మధ్యలోనే ఆగిపోగా వెంకటేశ్వరమ్మగారు తాతగారిని ఆ మందిరము పూర్తిచేయాలా అని అడుగగా తాత అందుకు అనుమతినిచ్చిరి . అప్పుడు ఈవిడ ఆనాటి ముఖ్య మంత్రి  కోట్ల విజయభాస్కరరెడ్డి గారిని సంప్రదించి గీత మందిరము పూర్తగుటకు కావలిసిన ధనసహాయము చేయమనికోరగా వారు మూడున్నర లక్షలు మంజూరు చేసిరి . ఆ ధనముతో ' సాయి గీతా మందిరము ' ప్రారంభమాయెను . పునాదులలో మొదటి అయిదు గంపలు వెంకట్రమమ్మగారు తవ్వివేసిరి . ఆ తరువాత ఎటువంటి ఆటంకములు లేకుండా మందిర నిర్మాను చురుకుగా సాగింది . ఆ తరువాత ఆవిడ తన రెండవ కుమారుడైన శ్రీ భరత సింహారెడ్డిని వెంటబెట్టుకుని జైపూరుకు వెళ్లి బాబా విగ్రహము ,బండలుకు ధర నిర్ణయించి 20,000 రూపాయలు వారికి చెల్లించి వచ్చిరి . తీరా  విగ్రహము తీసుకుని వాళ్ళు వచ్చేసరికి ఈవిడ దగ్గర డబ్బులు ఒక్క రూపాయి కూడా సమయానికి లేవు . వాళ్లకు చెల్లించవలసిన రూ . 80,000 గురించి వారు తొందర చేయసాగిరి . ఏమి చేయాలో పాలుపోక  ఆవిడ సతమతమవుతూ మనసులోనే ఈ ఆపద తప్పించమని తాతను ప్రార్ధించగా ఆ పక్కనుంచే వెళ్తున్న అబ్బాయిని పిలిచి అడుగగా అతను డబ్బులు వసూలు చేసుకు ఇంటికి వెళ్తున్నాని చెప్పేసరికి ఆ అబ్బాయి సంచిలో చూడగా సరిగ్గా రూ . 80,000/- ఉన్నవి . వెంటనే వాటిని తీసుకుని వారికి చెల్లించి ఇది తాత లీలగా గుర్తించి మనసులోనే తాతగారికి నమస్కరించి విగ్రహమును కల్లూరు చేర్చి తాతగారి గురుస్థానము నందుంచిరి .

 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1392 on: December 14, 2017, 10:34:35 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                       శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి తాత దర్శనమునకు వెళ్ళినపుడు తాతగారు ఈవిడను రెండు రూపాయలు ఇమ్మనిరి . ఈవిడ వెదకి చూడగా రెండు రూపాయలు కనిపించలేదు . రెండు రూపాయలు లేవని తాతతో చెప్పగా 'ఉన్నాయి చూడు ' అన్నారు . తిరిగి చూసేసరికి రెండు రూపాయలు కనిపించి తాతకివ్వగా  తాతగారు కొంతసేపు వాటిని చేతితో ఆడించి ఆ తరువాత ఆశీర్వాదముతో తిరిగి ఇచ్చి 'భద్రంగా దాచుకొని పూజించుకో ' అని సెలవిచ్చిరి . అప్పటి నుండి ఆవిడ ఆ రెండు రూపాయల నాణెమును పూజలో భద్రపరచుకొని నిత్యం అభిషేకం చేయుచున్నారు . ఎప్పుడు తాత వద్దకు వెళ్లినా ఈవిడకు పోయిన శక్తి తిరిగి వచ్చుటే కాక ,నూతనోత్సాహము కలిగినట్లుండేది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1393 on: December 15, 2017, 03:25:51 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
ఆ తరువాత తాతగారి సమాధి మందిరమునకు పాలరాతి బండలు పరిపించు భాగ్యము వీరికిచ్చిరి . తాతగారి సమాధి అనంతరము తీవ్ర ఆవేదనకు గురైన తాతకై చాలాకాలము దుఃఖించి ఆ తరువాత 1998 వ సం . లో సాయిగీతా మందిర విగ్రహ ప్రతిష్ఠను పూర్తిచేసిరి . ఆనాడు గురుస్థానము నుండి తాత విగ్రహము బయటకు తీసుకుని వచ్చుటకు మనుషులను ఏర్పాటు చేస్తామని చెప్పిన వారు మాట తప్పుటచే అక్కడ విగ్రహము బయటకు తీయుటకు మనుషులను లేక ఏమి చేయుటకు పాలుపోని స్థితిలో రోడ్డు పైకి వచ్చి నిలబడి చూచుండగా అనుకోకుండా ఆ దారి వెంట వెళ్తున్న విద్యార్థుల బృందమును చూసి వారిని బతిమాలగా వారు వచ్చి ఎంతో అవలీలగా బాబా విగ్రహమును గురుస్థానము నుండి బయటకు తెచ్చి రథములో కెక్కించిరి . ఆ విధముగా తాతగారు తన సమాధి తరువాత కూడా వారినన్ని విధముల కాపాడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమమును జయప్రదముగా సాగునట్లు ఆశీర్వదించిరి . 80 సం . ల ముదుసలి వయసులో ఏ మాత్రమూ తొట్రుపాటు లేకుండా అనర్గళముగా  నిన్న మొన్న జరిగిన విషయమును వివరించినంత తేలికగా పదునాలుగు సంవత్సరముల క్రితము జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు స్వయముగా వెంకటేశ్వరమ్మగారు చెప్పగలుగుట కేవలము ఆవిడకు తాత పట్ల గల ప్రేమాభిమానములు ,భక్తి భావనల వలననే సాధ్యమయినది . మొత్తము వివరములన్నీ తెలిపిన తరువాత ఒక్కసారిగా తాతను తలచుకున్నా భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడుస్తూ ఆనాటి మధురస్మృతులను మరీ మరీ తలచుకొనిరి .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2425
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1394 on: December 16, 2017, 09:46:43 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.   అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
శ్రీశైలయాత్ర :

" శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే " ఒక్కసారి శ్రీశైల శిఖరం దర్శించినట్లైతే ఇక మరల జన్మంటూ ఉండదు అందురు . హిందూ సాంప్రదాయములో శ్రీశైలము అత్యంత ప్రాముఖ్యమును కలిగిన పుణ్యక్షేత్రము . ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనముచే తరించిన వారెందరో . అంతేకాక దత్త సాంప్రదాయములో ఈ క్షేత్రమునకు అత్యున్నత స్థానం కలదు . ఎందువలననగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఈ క్షేత్రమందలి పాతాళ గంగయందు కృష్ణానదిలో అదృశ్యులైరి . కావున దత్త భక్తులందరూ శ్రీశైలము అత్యంత ప్రీతీ పాత్రమైన క్షేత్రం .
 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!