Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 132910 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1365 on: November 17, 2017, 04:30:18 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 

                                                  శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఎప్పుడు తాతవద్దకు వాళ్ళందరూ వెళ్లినా రామానాయుడు తాత ఇంటి గుమ్మము వద్ద పెద్ద కర్రను అడ్డుగా పెట్టి కాపలాగా నిలబడి ఉండేవాడు . ఒకరోజు తాతగారు అతనితో ఆ కర్రను ఇవ్వమని చెప్పి దానిని బాగా ఊపి ఊపి ఇతని చేతిలో వేసి మరల తన చేతిలో వేయించుకుని ఆ విధముగా మూడు నాలుగుసార్లు చేసిన తరువాత " చంపుతా " అని రామానాయుడుతో అనగానే చంపు నాయనా అంటూ తలను తాత ముందు వంచి నిలబడగానే తాతగారు ఆ తలమీద నెమ్మదిగా ఆనీ  ఆననట్లు కర్రను తాకించి తిరిగి ఇచ్చేసారు . అప్పటినుండి వారికి ఈ కొట్లాటలమీద ,సంపాదన మీద మనసు వికలమై ఎప్పుడెప్పుడు తాతను చూడాలనే తహతహ ఎక్కువై వీలైనప్పుడల్లా తాతను దర్శించుకుంటూనే ఉండేవారు . తరువాత కేసు ఆఖరు వాయిదాకు వచ్చేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేరము చేసిన నిరుపేదలమైన తాము పశ్చాత్తాపముతో తమ తప్పులను తాత పాదాల వద్ద నుంచి క్షమించమని మనస్ఫూర్తిగా ప్రార్ధించగా తాత " బయట పడతావులే " అని ఆశీర్వదించి పంపగా వీరిపై కేసు అనూహ్యముగా కొట్టివేయబడింది . అంతే ! మొత్తం అందరూ  పరుగు పరుగున తాతను చేరి తమ శక్తి కొలదీ తాతను పూజించుకుని తమకు పునర్జన్మ నిచ్చిన తాతకు జీవితాంతం ఋణపడి  ఉంటామని మనసులో నిర్ణయించుకొని మరలి వెడలిరి .

 

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1366 on: November 18, 2017, 06:57:21 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అప్పటినుండి మరింత నమ్మకముతో కృతజ్ఞతతో తాతను పూజించే ఈ నిరుపేదల భక్తిని తాతగారుసదా స్వీకరిస్తూనే ఉండేవారు . ఒకసారి వీరు వెళ్లిన సమయానికి తాతగారికి ఎవరో భక్తులు ఐదు గిన్నెల స్టీలు కారేజి నిండుగా భోజనము ,పిండివంటలు నైవేద్యము రాగా తాతగారు వాటిని తాకనైనా తాకకుండా వీరు తీసుకువెళ్లిన చద్దిమూటలోని అన్నము తినుట ద్వారా వీరి ప్రేమను అంగీకరించిరి . తమపట్ల అంత దారుణంగా ప్రవర్తించిన తమ వాళ్ళ గురించి తాతను అడుగగా తాత " వాడే కాళ్ళ దగ్గరకు వస్తాడు " అన్నారు . ఇది జరిగిన కొంతకాలమునకు వీరు రాళ్ళుకొట్టే పట్టాను పొందడము వలన ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు . బండల కంపెనీకి "రామదాసు స్లాబ్స్ " అనీ " రామదాసు మైనింగు " అనీ అన్నింటికీ తాతగారి పేరు లద్దగిరి రామదాసుస్వామి పేరు కలిసి వచ్చేలా పెట్టుకోవడంతో వీరికి బాగా కలిసొచ్చింది . ఎలక్షన్ల సమయములో పాత యజమాని వీరి వద్దకు వచ్చి క్షమించమని అడిగి పాత కక్షలన్నీ మరచిపోయి తన తరపున ఎలక్షన్లలో నిలబడమని అడగడమే కాక వీరిని ధనసహాయము చేయమని అడుగగా వీరు అందుకు అంగీకరించి డబ్బు ఇవ్వడమే కాక అతని తరపున నిలబడిరి . ఆ తరువాత ఈ యజమాని మరణానంతరము అతని భార్య వాళ్లకున్న కొండను ఈ అన్నదమ్ములకే అమ్మివేయడంతో వారు ఆ కొండను రాళ్లు కొట్టి అమ్ముతూ మంచిస్థితికి చేరుకున్నారు . 

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి వీరు అందరూ కలిసి తాత వద్ద నిద్ర చేయుటకు వెళ్ళినపుడు అప్పుడే షిరిడీ ,పండరి యాత్రలు ముగించుకుని వచ్చిన తాతగారికి నిద్రాభంగము కలుగనీయరాదనీ ,బీడీలు అందివ్వరాదనీ రకరకాల ఆంక్షలు పెట్టి తాతగారి అన్న వెంకటరెడ్డి  గారు వీరిని  తాత వద్ద నుంచి బయటకు తాళము వేసుకుని వెళ్లిపోయిరి . తాతగారి పాత ఇంటిలో తాతగారు ఎప్పుడూ ప్రత్యేకముగా ఒకే స్థలములో నిలబడియుండి ఆ స్థలమునకు శక్తినిస్తున్నట్లుగా ఉండేవారు . అందువలన ఆ స్థలమును ఎవ్వరూ తొక్కకుండా పరిరక్షించుట కొరకు ఆ బండపై తాత పాదరక్షలను  చంద్రారెడ్డి ముద్రించెను . ఆ అన్నదమ్ములలో ఒకరైన  నారాయణ అక్కడ తలపెట్టుకుని పడుకోగా పెద్దమద్దయ్య ఆ పక్కన పడుకొని ఉండగా అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి తాతగారు పెద్ద మద్దయ్య ఒడిలో తలపెట్టుకుని పుల్లన్న అన్న వ్యక్తిపై కాళ్ళు పెట్టుకుని నారాయణ దగ్గరగా పడుకొని ఉండడము చూసి ఆనందముతో వీరి ఒళ్ళు పులకరించగా ఎక్కడ కదిలితే తాతకు నిద్రాభంగము కలుగుతుందోనని కదలకుండా పడుకునే ఉన్నారు . కొంతసేపటికి లేచిన తాతగారు వీరిని బీడీ అడుగగా తాతగారు స్వయంగా అడుగుతుంటే ఎలా కాదనగలమని భావించి అమాయకపు భక్తితో తాత అన్నగారి ఆంక్షలను పక్కనపెట్టి తాతగారికి బీడీలను అందించిరి . ఆ రకముగా తాతగారు ఆ రాత్రంతా వారికి ఏకాంత సేవాభాగ్యము కలిగించి వారిని అన్ని విధాలా దీవించి తృప్తి పరచిరి . రాత్రి అన్నగారి ప్రవర్తన వలన చిన్నబోయిన వీరి మనసులను తాత సంపూర్ణముగా తృప్తిపరచిరి . ఆ మరునాడు ఎవరి శక్తి కొద్దీ తాతగారికి వారు పూలదండలూ అవీ తీసుకువచ్చి తాతను పూజించి తమ కృతజ్ఞతలు తెలుపుకొనిరి . అప్పుడు పెద్ద మద్దయ్య వంగి తాత పాదములకు నమస్కరించేటప్పుడు తాతగారు అతని వీపుపై తన మెడలోని పూలమాల తీసివేసారు . అప్పుడతను లేచి నిలబడితే ఆ దండ పడిపోతుందన్న భయముతో కొంతసేపు అలానే ఉండిపోయి ఆ తరువాత నెమ్మదిగా ఆ దండను చేతులలోకి తీసుకుని పదిలముగా ఇంటికి తీసుకువచ్చి భద్రపరచుకున్నాడు . ఇప్పటికీ ఆ దండ అతని ఇంటిలో అలానే ఉంది . సుమారు పదమూడు సంవత్సరములుగా సురక్షితముగా భద్రపరచుకోవడము అతని స్థిరభక్తిని తెలియచేస్తోంది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1368 on: November 20, 2017, 03:47:49 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆ విధముగా తాతగారు రాక్షసత్వముగా ప్రవర్తించే కిరాతకుల మనసులలో ప్రేమజ్యోతిని వెలిగించి వారిలో మానవత్వము నింపుట ద్వారా వీరిని మనుషులుగా మార్చడమే కాక వారిలో భక్తి బీజములు ,మూఢభక్తి ,స్థిర నమ్మకములను పెంపొందించి వారిని చక్కని మార్గములో నడిపిస్తున్నారు .

ఆ తరువాత రామిరెడ్డి గారి తండ్రి రామకృష్ణారెడ్డి గారు కలగొట్ల గ్రామ ప్రారంభమున కల తన భూమి 11 సెంట్లను తాత మందిరమునకు ఇచ్చిరి . అప్పుడు ఊరివారందరూ కలిసి గర్భాలయము నిర్మించగా కర్నూలు డా . సత్యనారాయణ రెడ్డిగారు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణము పూర్తిగావించి తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటుగా గణేశుడు ,దత్తాత్రేయులవారి  వారి విగ్రహములను కూడా ప్రతిష్ఠించిరి . ఇప్పుడు అక్కడ ప్రతి గురువారము  భజనలు జరుపుటయే కాక ప్రతిష్ఠాపన కన్నా ముందు వరకు ఈ గ్రామ ప్రజలందరూ తాతగారి ఆరాధన దినోత్సవమునకు కల్లూరు చేరి వారందరూ తాతగారి ఆస్థానమందు అన్నదానము నిర్వహిస్తూ తాతపట్ల తమకు గల ప్రత్యేక ప్రేమను ఆ విధముగా తెలియచేసేవారు . అయితే తాతగారి విగ్రహ ప్రతిష్ఠాపన  జరిగిన సంవత్సరము నుండి కలగొట్ల గ్రామములోనే  తాతగారి చిత్ర పటమును అందముగా అలంకరించిన రథములో నుంచి గ్రామము మొత్తము ఊరేగించగా ఇంటింటా తాతగారికి నీరాజనాలర్పిస్తూ గ్రామ ప్రజలందరూ తమ ఆరాధనా దైవమును కన్నులారా గాంచి తరిస్తున్నారు . ఈ విధముగా తాతగారికి ఆ గ్రామముతో గల అనుబంధము చిరస్ధాయిలా నిలిచిపోయి వారి మంచి చెడులు ,యోగక్షేమములు ఎప్పటికప్పుడు తాతగారు గమనిస్తూ వారికేలోటు కలుగకుండా కాపాడుతున్నారు .


అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1369 on: November 21, 2017, 05:08:35 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 

ఢిల్లీ యాత్ర :

అనేకప్రాంతములలో మన రామావధూత గారిచే వివిధ సంస్థలవారు నిర్వహించిన కార్యక్రంమములు ఇంతకు ముందే తెలుసుకున్నాం .  ఈ విధంగా స్వామీజీ ఇప్పుడు ఢిల్లీలో తాతగారి సమక్షంలో కార్యక్రమం నిర్వహించుటకు సంకల్పించి ఢిల్లీ భక్తులను  సమావేశపరచి వారినీ కార్యక్రమమునకు ఉత్సాహపరచిరి . అఖండ సాయినామ సప్తాహ సమితి ,హైదరాబాదు వారి సహకారంతో ఢిల్లీలో నామసప్తాహము నిర్వహించమని ఢిల్లీలోని ముఖ్యభక్తులైన శ్రీ మధుసూదన్ గారు , శ్రీ వికాస్ మెహతా ,శ్రీమతి వందన మున్నగు ముఖ్య భక్తులకు సూచించగా సెప్టెంబర్ 6 ,1991 సప్తాహ  ముహూర్తము నిర్ణయించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అనుకున్న శుభ సమయము ఆసన్నమాయెను . తాత వచ్చు రైలు ఆగీ ఆగగానే భక్తజన ప్రవాహం కడలి ముందుకు సాగి ఒకరికంటే ఒకరు ముందు ఆ దివ్యమంగళ రూపమును దర్శించి పూలమాలలు వేయుటకు ఆతురత అపడిరి . మంగళ
 ప్రదాతా ,దివ్యస్వరూపుడు అగు తాతగారు పాదం మోపుట తోడనే దిక్కులు పిక్కటిల్లునట్లు జయ జయ ధ్వానములు చేసి లెక్కకు మించిన పూలహారములను తాత  మెడలో వేసి సాష్టాంగముగా నమస్కరించిరి . తాతగారు కూడా వారి ఆతురతను భక్తిప్రపత్తులను ఆస్వాదిస్తూ మందహాసము చేస్తూ మందగమనము సాగించిరి . భక్తులు ఈ రకమైన ఆనందంతో తెలియాడుచుండగా తాతగారు హఠాత్తుగా " టెంకాయలు ( కొబ్బరికాయలు ) వచ్చినవా ?" అని అడిగిరి . తాత ఇలా ఎందుకు అడిగారో ఎవ్వరకూ అర్ధంకాలేదు . అప్పుడు మధుసూదన్ గారికి సప్తాహములో ధునిలో వేయుటకు విజయరాఘవన్ అను భక్తుని ద్వారా కేరళ నుండి తెప్పించుచున్న 500 కొబ్బరికాయలు కూడా ఆ రైలులోనే రావలసి ఉన్నవను సంగతి స్ఫురణకు వచ్చి తాతగారి సర్వాంతర్యా మిత్వమునకు ఆశ్చర్యచకితులైరి . ఆ విధంగా తాత ఢిల్లీలో తన పాదం మోపుతూనే తన భగవత్ తత్త్వమును చాటి చెప్పిరి . స్టేషను వెలుపల మంగళ వాయిద్యములు ,చక్కని తెల్లని గుర్రములచే కట్టబడి పూలచే అలంకరింపబడిన రథము సిద్ధముగా ఉంచి తాతను వేడుకోగా తాత అంగీకరించి రథమును అధిరోహించి ముందు సీటుపై కూర్చుండిరి . వెనుక సీటునందు సాయిబాబా పెద్ద పటము దానిపై ఛత్రము అమర్చబడియున్నవి . మంగళవాయిద్యములు ,బాణాసంచాల హోరుతో రాజధాని నగర వీధుల గుండా జైత్రయాత్ర కదులసాగెను . కొంతసేపటికి తాతగారు " ఇక్కడ బాగాలేదు ,అక్కడ కూర్చుందామా " అంటూ రథము వెనుకసీటు అలంకరించిరి . ముందుగా తాతగారు ,వారి వెనుక బాబాగారి చిత్రపటము ఆ సన్నివేశము కడు మనోహరముగా ఉండి భక్తులంతా తమ కోరిక ,శ్రమకు సంపూర్ణత్వము లభించిందన్న ఆనందంతో తేలియాడుతూ సాయినామమును జపిస్తూ " రామిరెడ్డి తాతకీ జై " అనుచూ ముందుకు సాగుచుండిరి . ఈ విధముగా సాగు యాత్రలో దారి పొడవునా వేలాదిమంది జనులకు తాతగారి దర్శన భాగ్యం కలిగినది . ఈ రకముగా రథము సప్తాహ ప్రాంగణము చేరగానే అక్కడ వాతావరణము కోలాహలముగా మారిపోయినది . పురోహితులు వేదమంత్రోచ్చారణములతో  పూర్ణకుంభములతో స్వాగతించగా తాత సభావేదికను చేరి ఆసనంపై ఆశీనులైరి . ఆ రకంగా తాతగారి సమక్షంలో ఆనందోత్సాహములతో సాయినామ సప్తాహము ప్రారంభమయ్యెను .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1371 on: November 23, 2017, 04:44:34 PM »
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

తాతగారు ప్రతిరోజూ కొంతమంది భక్తుల ఇళ్లకు వెళ్లి వారి అవసరములను బట్టి దీవించుచూ వారి కష్టములను తొలగించుచూ అనేక విధములుగా వారిని ఆనందపరచుచుండిరి . ఈ సంఘటలన్నియు సందర్భానుసారము  వివరింపబడినవి . ఇట్లు రెండు  రోజులసప్తాహ కార్యక్రమము పూర్తయ్యి మూడవరోజు కూడా నిర్విఘ్న్వముగా సాగుచుండగా రాత్రి 10. నిమిషములకు తాతగారు తమ పర్యటన ముగించుకు వచ్చుసరికి హఠాత్తుగా కారుమేఘములు కమ్మి కుంభవృష్టి వాన మొదలాయెను . సప్తాహమునకై వేసిన గుడారములన్నీ తడిసిపోయి నీరంతా లోపలకు ప్రవేశించు ప్రమాదమేర్పడినది . అప్పుడు తాతగారు గర్జిస్తూ చెమటలు పట్టగా అనేక సంకేతములనిచ్చిరి .  ఆ రకంగా కేకలు వేస్తూ సప్తాహ ప్రాంగణమంతా కలియతిరుగుతూ కొంతసేపు ఆ రకంగా చేయగా కుండపోతగా పడిన వర్షము తగ్గి చిరుజల్లు మాత్రము పడుచున్నది . భక్తులందరూ సంతోషముగా తాత దరిచేరి ప్రకృతిని శాసించిన విధమును గూర్చి చర్చించుకుంటుండగా హఠాత్తుగా ఒక భక్తుడు తాను గాంచిన అద్భుత దృశ్యమును అక్కడున్న వారందరికీ తెలిపెను . అదేమనగా చిరుజల్లుగా పడుతున్న వాన ఒక్కచుక్క కూడా తాతగారిపై పడకపోవడం ఆ భక్తుడు గమనించి ఆశ్చర్యానందములతో   తాత తలమీద చేయిపెట్టి చూడగా నిజముగానే అక్కడ ఒక చుక్క నీరు పడుటలేదు . తాత చుట్టూ చేరిన భక్తమండలి మాత్రం ఆ వానజల్లులో తడుచుచుండిరి . ఈ భక్తుడు విషయము చెప్పగనే అప్పటివరకు ప్రకృతిని శాసించి వానను ఆపిన తాతశక్తికి మైమరచుచుండగా ఇప్పుడు ఈ దృశ్యమును కన్నులారా గాంచి తాత కృపాదృష్టిలో అందరూ తడిసి ముద్దయిరి . ఆందరూ ఆనందపారవశ్యములో " అవధూత రామిరెడ్డి తాత మహారాజ్ కీ జై " అని జయజయ ధ్వనులు చేసిరి . కొంతసేపటి పిదప తాత బయటకు వచ్చి నిలిచి ఆకాశం వైపు చూచుచూ బిగ్గరగా అరువగా వెంటనే ఆ వానజల్లు కూడా ఆగిపోయి ఆకాశం ప్రకాశవంతమైనది .  ఈ దృశ్యమును గాంచిన ప్రతి  భక్తునకు షిరిడీలో తుఫాను రాగా బాబా దానిని ఆపివేసి ప్రజలను రక్షించిన సంగతి మదిలో మెదలగా వారు తాతలో సాక్షాత్ బాబాను దర్శించి తరించిరి . అనేక శ్రమల కోర్చి వారు చేయు నామసంకీర్తన యందు ఎటువంటి ఆపద కానీ ,ఆటంకం కానీ రానీయక తాతగారు సదా వారికి అండదండగా నిలచి  ఈ కార్యక్రమము నిర్విఘ్నముగా జరుగునట్లు కాపాడుచుండిరని అందరకూ తేటతెల్లమైనది . రెండు రోజుల తరువాత కూడా ఈ పరిస్థితి ఏర్పడగా తాత ఈ విధముగానే అదుపు చేసిరి .
 
 
 అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1372 on: November 24, 2017, 04:56:06 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఢిల్లీ సభ్యులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సప్తాహ కార్యక్రమములో గురువారం నాటి సాయంత్రం చిన్నపిల్లలచే బాబా జీవిత చరిత్ర నుండి కొన్ని ముఖ్య ఘట్టములను సాంస్కృతిక కార్యక్రమములో భాగంగా ప్రదర్శించిరి . పిల్లలందరూ అత్యంత ధైర్య సాహసములతో ప్రభావంతముగా ఈ కార్యక్రమములో పాల్గొని సప్తాహ  కార్యక్రమమును రక్తి కట్టించిరి . అటు పిమ్మట ప్రతి గురువారం షిరిడీలో నిర్వహించు పల్లకీసేవ ( చావడి ఉత్సవం ) ప్రారంభమైనది . బంగారు రంగులో మెరిసిపోతున్న రథమునకు రెండు తెల్లని గుర్రములు కట్టబడియున్నవి .  రథమునందు  పటము ,ఛత్రము అమర్చబడి యున్నవి . అందు తాతను ఆసీనులు కమ్మని వేడుకోగా అందుకు తాతగారు అంగీకరించలేదు . కానీ భక్తులను నిరుత్సాహ పరచుకుండుటకు తాతగారు రథారోహణము గావించిరి . భక్తుల ఆనందము అంబరమంటినది . షిరిడీలో నాటి బాబా పల్లకి ఉత్సవము కళ్లెదుట కనబడుతుండగా వాయిద్యములు మారు మ్రోగుచుండగా బాణా సంచాల ధ్వనుల మధ్య భక్తులంతా ఆనంద పరవశ్యముతో నాట్యములు ,కోలాటములు చేయుచు కోలాహలముగా శోభాయాత్రలో పాల్గొని సప్తాహ ప్రాంగణమును చేరుసరికి రాత్రి 11 గం . అయినది . అప్పుడు తాత అక్కడున్న వారితో " పాయసముందా " అని అడుగుతూ వంటశాలకు దారితీసిరి . భక్తులు తాతను అనుసరించిరి . చూడగా ఆ రోజు నిజముగానే అక్కడ పాయసము వండబడినది . తాత ఆ వంటశాలలో ఒక బస్తాపై కూర్చుని వంటవాని చేతితో పాయసమును తినిపించుకొనిరి . ఈ దృశ్యము వలన తాతగారి సర్వజ్ఞత తెలియుటయే కాక కొన్ని రోజులుగా భక్తులందరూ సంతృప్తిగా భోజన సదుపాయములు కూర్చిన ఆ వంట వానిని కూడా తాత అతని చేతితో స్వయంగా తినిపించగా తిని అతని సేవకు గుర్తింపునిచ్చి అతనిని ధన్యమొనర్చిరి .
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1373 on: November 25, 2017, 05:08:07 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

రాత్రులందు ఎంతటి చలినైనా లెక్కించక సప్తాహ సభాప్రాంగణ  ముందుండి పరిస్థితులను పూర్తిగా అదుపులో ఉంచి కట్టడి చేసిన తాత కృప వలన సప్తాహము దిగ్విజయముగా పూర్తయి ముగింపు కార్యక్రమముగా పూర్ణాహుతి ,గోపాలకాలా  జరుపు సమయము ఆసన్నమైనది . భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో ధునిలో కొబ్బరి కాయలను వేసుకుని తమ కర్మలను ధ్వంసం చేసుకొనిరి . తాతగారి చేతులమీదుగా కొబ్బరికాయను ధునిలో వేసినచో ఆ కార్యక్రమం సఫలీకృతమగునని భావించిన సభ్యులు ధునికి ఇరవై అడుగుల దూరములో ఉన్న తాతచేతికి కొబ్బరికాయను ఇచ్చి ఆశీర్వదించమని కోరగా అక్కడ నుండే తాత ఆ ఆకాయను ధునిలోకి విసిరిరి . అంతదూరం నుండి వేసిననూ ఆ కాయ సరిగ్గా ధుని మధ్యలో పడగా పెద్ద జ్వాల వచ్చి ధుని చక్కగా మండసాగెను . అక్కడ చేరిన భక్తులందరూ అద్భుత దృశ్యమును కన్నులారా గాంచి ఆనంద భాష్పములు కార్చిరి . తాత ఈ చర్య ద్వారా తాత ఆశీర్వాదం పొంది అంతవరకు రెండునెలలుగా ఈ కార్యక్రమ నిర్వహణకు పడిన శ్రమ అంతా దూదిపింజలా తేలిపోగా అందరి మనసులు తేలికపడ్డాయి . 

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1374 on: November 26, 2017, 04:19:00 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారి ఆశీస్సులు సంపూర్ణముగా అందుకున్న ఆ భక్తుల ఆనందమంతా ఆఖరి ఘట్టమైన 'గోపాలకాలా ' ఉత్సవములో పెల్లుబికినది . వయో భేదమును మరచి అందరూ రెట్టించిన ఉత్సాహముతో పోటీపడుచుండిరి . అప్పుడు తాతగారు మధ్యలో కూర్చొనగా చుట్టూ చేరిన హైదరాబాదు బృందం

గోపాలా -గోపాలా -రే రామిరెడ్డి తాతా గోపాలా !
రామిరెడ్డి తాతా గోపాలా -హే రామావధూతా గోపాలా

అని మధురముగా ఆలపిస్తుండగా ఆ దృశ్యము గోపికా పరివేష్టితుడైన గోపాలుని తలపించగా అవధులు లేని ఆనందం తో వారిలో ఉత్సాహాన్ని మరింత పెంచినట్లు తారాస్థాయికి చేరుకోగా ఆనందోత్సవముల మధ్య ఉట్టి కొట్టబడి కార్యక్రమం విజయవంతమైనది .

                                             ఓం భజన ప్రియాయ నమః

ఆ రకముగా జయప్రదముగా సప్తాహ కార్యక్రమము ముగించి అందరకూ విరివిగా అన్నదానము చేసి మిఠాయిలు పంచి తమ భక్తి ప్రపత్తులు చాటుకుని ఇంతకాలం తమకు అండగా నిలిచి ఈ కార్యక్రమము జయప్రదంగా జరుగునట్లు ఆశీర్వదించిన తాతను వదలలేక బరువెక్కిన హృదయమములతో అందరూ తాతకు వీడ్కోలు తెలిపిరి .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

ఉత్తరదేశ జైత్రయాత్ర:

ఢిల్లీలో సాయినామ సప్తాహము ,గోపాలకాలా సమాప్తి అయినా పిమ్మట తాతగారు ఉత్తరదేశ యాత్రకు పయనమైరి . జోలేకోట్ నివాసియైన శ్రీ యాదవ్ గారు అక్కడ ఒక సాయిమందిరమును నిర్మింపదలచిరి . కావున ఆ స్థలమునందు శ్రీ శ్రీ శ్రీ రామిరెడ్డి తాతచే ప్రారంభోత్సవము ,12 గంటల అఖండ సాయినామము చేయ సంకల్పించిరి . కావున తాతగారితో పాటుగా భజన బృందమంతా ఢిల్లీ నుండి జోలేకోట్ పయనమైరి .

శ్రీ యాదవ్ గారి పొలము ,ఇండ్లు ఇక్కడ అనేక ఎకరములలో విస్తరించియున్నవి . భజన బృందమంతా తాతగారితో సహా ఈ ప్రాంతమునకు చేరుసరికి రాత్రి ఆయెను . అంతకు మునుపే భజన ఏర్పాట్లలో భాగంగా షామియానాలు ,తివాచీలు ,ధునికి కావలసిన యజ్ఞగుండము అన్నియు సిద్ధపరచిరి . . అయితే అనుకోకుండా ఆ రాత్రి యంతయు వర్షము కురియుటచే ఏర్పాట్లన్నియు నేల  మట్టమాయెను . ఈ పరిణామము గమనించిన యాదవ్ గారు చింతాక్రాంతులైరి .   

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1376 on: November 28, 2017, 04:26:21 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
అయితే మరుసటి ఉదయము తెల్లవారగనే తాతగారు ఎవ్వరూ చెప్పకుండానే మందిరము నిర్మింపచేయదలచిన స్థలమునకు చేరి అక్కడ నిలబడి పరిస్థితి నంతయు పర్యవేక్షించగా నామ సంకీర్తన ప్రారంభమాయెను . ఆ విధముగా ప్రతికూలముగా నున్న వాతావరణము నందు అసలు భజన జరుగుటకు ,అత్యంత దుర్లభము అనుకున్న స్థలము నందే అత్యంత ఉల్లాస వాతావరణము నందు ఉత్సాహముగా భజన ప్రారంభమగుట చూసి అందరూ ప్రకృతిని శాసించి భగవంతుని కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగునట్లు ఆశీర్వదించిన తాతగారి ప్రేమలో మైమరచిపోయిరి . ఆ సమయములో శ్రీ యాదవ్ గారి ఆర్ధిక పరిస్థితులు అంతగా బాగుండలేవు . వారు వ్యాపారము నందు నష్టపోయి అనేక చిక్కులలో నుండిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1377 on: November 29, 2017, 04:49:40 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

కలత చెందిన హృదయముతో నున్న యాదవ్ గారి స్థితి గ్రహించిన తాత వారేమి తెలుపక మునుపే " నీకు బాగయితదిపో " అని ఆశీర్వదించిరి . ఆ విధముగా కోరకుండగనే వరములనిచ్చు కరుణామయి మన కల్లూరు మాయి అని మరొకసారి ఋజువైనది . పన్నెండు గంటల నామ సంకీర్తన అనుకుని మొదలుపెట్టిన భజన ఇరవై నాలుగు గంటల వరకు పొడగింపబడెను . రాత్రి సమయములో వాతావరణమంతయు అత్యంత చల్లగా మారి విపరీతముగా చలిగాలులు వీచుచుండెను . తాత అవసరములన్నింటిని దగ్గరయుండి గమనించు చంద్రారెడ్డి తాతగారికి ఎన్నిసార్లు ఉన్నితో చేయబడిన దుప్పటిని కప్పుటకు ప్రయత్నించినా తాత అన్నిసార్లూ దానిని తీసి దూరముగా విసిరివేసిరి . ఆ విధముగా ఉధృతమైన చలిగాలులు మధ్య ఆ అర్ధరాత్రి సమయమందు తాత దిగంబరముగ నుండి తన ప్రత్యక్ష అవధూత తత్త్వమును లోకమునకు మరియొకసారి చాటిచెప్పిరి . అవధూతలకు శరీర స్పృహ ఉండక ఎండను ,వాననూ ,చలినీ ఏదీ లెక్కచేయరనియు అసలు వారికి ఇవేవీ అంటవను విషయమును దృఢపరచిరి .

                           
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1378 on: November 30, 2017, 04:48:32 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
 
జోలేకోట్ నుండి యాదవ్ గారు బరేలీ దగ్గర నిర్మించబోయే ఫ్యాక్టరీ స్థలములో రెండు గంటలపాటు నామసంకీర్తన చేసి అక్కడ నుండి రాత్రి 9 గం . ల ప్రాంతములో హరిద్వార్ కు పయనమైరి . బరేలీ పట్టణ శివారు ప్రాంతములలో పెట్రోలు కొరకై కారులన్నీ ఆగగా తాతగారు హఠాత్తుగా కారుదిగి దిగంబరులై నిలిచిరి . తాతగారి ఈ చర్యలో ఎదో అంతరార్థముంటుందని అందరూ అనుకొనుచుండిరి . ఇంతలో దూరము నుండి ఒక ఫకీరు వచ్చి తాతకు 15, 20 గజాల దూరములో కూర్చుని తదేక దృష్టిని సారించి గమనించుచుండిరి . ఆ రకంగా కొంతసేపు వారిద్దరూ ఒకరినొకరు కళ్ళతో పలకరించుకొనుచు మౌన సంభాషణము జరుపుచుండగా హఠాత్తుగా ఆ ఫకీరు గారి కళ్ళవెంట ధారాపాతముగా నీళ్లు కారుట ప్రారంభమాయెను . తాత మాత్రము నిశ్చలముగా కొంతసేపు అటులనే నిలిచి తరువాత దుస్తులు ధరించి తిరిగి కారులో కూర్చుండిరి . ఇది జరిగిన కొంతసేపటికి ఆ ఫకీరు చుట్టూ పది ,పదిహేను మంది గుంపుగా చేరిరి . వారందరూ ముస్లిం మతస్తులవలె నుండిరి . వారితో ఈ  ఫకీరు గారు తాతగారిని చూపించి ఎదో చెప్పగా వారందరూ తాతగారి కారు వద్దకు చేరి దర్శించి నమస్కరించి వెళ్లిపోయిరి . ఒక్క పలుకైనా లేకుండగనే  ఈ దృశ్యమంతా అత్యంత నిశ్శబ్దముగా ఒక కలవలె జరిగిపోయెను . తరువాత అక్కడ ఉన్నవారిని అసలు వచినవారెవరూ అని విచారించగా మొదట వచ్చిన ఫకీరు ముస్లిము గురువనియు ,తరువాత అక్కడ ఉన్నవారిని అసలు వచ్చిన వారెవరూ అని  విచారించగా మొదట వచ్చిన ఫకీరు ముస్లిము గురువనియు ,తరువాత వచ్చిన బృందమంతా ఆయన శిష్యులనియు వారందరూ అక్కడకు దగ్గరలోనే దర్గాకు చెందిన వారనియు చెప్పిరి . తాతగారి యొక్క ఈ లీలను గాంచిన భక్తబృందమంతా ఆశ్చర్యానందములలో మునిగిపోయిరి . ఎక్కడ కర్నూలు ? ఎక్కడి బరేలి ? వీరిద్దరూ ఒకరినొకరు ఎలా తెలుసు ,అసలు ఆ ముస్లిం గురువు తాతలోని మహత్యమును ఎట్లా గుర్తించగలిగెను , వారి మధ్య జరిగిన మౌనసంవాదన యేమి ఇటువంటి జవాబు లేని ప్రశ్నలకు సమాధానము ఒక్కటే అదే తాతగారి అవతార ప్రాముఖ్యము . అందుకే ముస్లిం మత గురువైనప్పటికీ ఆయన తాతగారిలోని దైవత్వమును గుర్తించగలిగాడు . జాతి ,కుల ,మతములకు అతీతముగా భగవంతుడొక్కడే అన్న సిద్ధాంతమునకు ప్రత్యక్ష నిదర్శనము ఈ సంఘటనము .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1379 on: December 01, 2017, 05:05:49 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

 తెల్లవారేసరికి హరిద్వార్ చేరి గంగానదీ తీరమును చేరిరి . గంగామాత ఎప్పుడెప్పుడు యోగుల పాదధూళితో తన కంటిన మాలిన్యమును తొలగించుకో వలేనన్న ఆతృతతో ఎదురు చుసిన శుభఘడియ ఆసన్నమాయెను . తాతగారు కారు దిగి తన పవిత్ర పాదధూళిచే మహోన్నతమైన పుణ్యక్షేత్రమును పావన మొనర్చిరి . శాంతి కుంజ్ గాయత్రీ ఆశ్రమము వారు సుమారు 150 మందికి వసతి నిచ్చుటయే కాక ఉచిత భోజన ఏర్పాట్లు గావించగా అక్కడ కొంతసేపు సాయినామ సంకీర్తన జరిపిరి . 

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!