Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 132943 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
చిన్మయ మిషన్ భక్తుడు :

1991 సంవత్సరములో తాత దర్శనానికి వెళ్లి ఇతను త్యాగరాజ కీర్తనలు పాడుతుంటే తాతగారు కూడా అతనితో పాటు అందుకుని పాడుతుండేవారు . ఎవరైనా భక్తులు తాతగారి కోసమై ఏవైనా నైవేద్యాలు తీసుకువస్తుంటే వారు రాకముందే తాతగారు వారు తెస్తున్న పదార్ధముల పేర్లు ముందే చెపుతుండడము ఈయనకు ఆశ్చర్యము కలిగిస్తుండేది . చిన్మయ మిషన్ లో ఈయన బ్రహ్మచారిగా నియమితులైనట్లు సమాచారము అందింది . ఆ సమయములో ఈయన తల్లికి ఆరోగ్యము దెబ్బతిని ఉండటంతో అందరూ వెళ్లవద్దని సలహా నిచ్చారు . ఎటూ నిర్ణయించుకోలేని ఇతను తాత వద్దకు వచ్చి దిగంబర నామము మనసులో జపము చేసుకుంటూ ఉండగా తాతగారు ' బొంబాయి వెళ్ళు ' అని చెపుతూ 'ఇంటికి పద ' అంటూ వీరింటికి వచ్చి భోజనము చేసి వెళ్లారు . ఆ తరువాత అతని తల్లికి ఆరోగ్యము కుదుటపడడము ,ఈయన బొంబాయి వెళ్ళడమూ జరిగి అక్కడ ఎంతో మనశ్శాంతిని పొందారు . అంతకు ముందు ఎప్పుడైనా తల్లితో ఇంట్లో పోట్లాడి తాత వద్దకు వెళితే 'కొట్లాడి వచ్చావా ' అని అడిగేవారు . ఆ తరువాత తాతగారు షాద్ నగర్ వెళ్ళినపుడు ఈస్వామి అక్కడకు వెళ్లడం తటస్థించగా అందరిలో ఉన్న ఈయనను దగ్గరకు పిలిచి ఇతను నమస్కారము చేసుకున్న తరువాతనే మిగిలిన వాళ్ళందరి చేత నమస్కారము చేయించుకుని ఇతనిపై తనకు గల ప్రత్యేక ప్రేమను తెలియజేసిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

సేవాభాగ్యం :

వెంకటరెడ్డి బి . క్యాంపు గారు 1980 సం . సంక్రాంతినాడు తాతగారిని గురించి తెలుసుకుని తాత దర్శనము చేసుకున్నారు . అప్పటినుంచి తరచుగా తాతగారిని దర్శించుట అలవాటుగా మారింది . ఆ తరువాత తాత తల్లి తాతగారికి స్నానము చేయించుటకు ఎవ్వరూ  వీరిని స్నానము చేయించమని చెప్పగా  పాదములు కడిగి ఆ తరువాత తాతగారికి మంగళస్నానము చేయించి హారతులిచ్చిరి . అలా క్రమముగా తాతకు క్రమము తప్పక స్నానమాచరించడము ఆయన ముఖ్య కార్యక్రమైనది . అలా కొన్ని సంవత్సరములు ఆయన తాతగారినీ  కొలుచుకో గలగడము నిజముగా తన అదృష్టముగా భావించిన ఈయన ఆ తరువాత కర్నూలుకు మారడము వలన ఆ సేవకు క్రమముగా దూరమైరి . కానీ చేసుకున్నన్ని రోజులూ ఎంతో ఇష్టముగా ఈ సేవ చేసుకున్న ఈయన ఈతి బాధలన్నీ తాతగారు తీరుస్తుండేవారు . ఒకసారి విపరీతమైన పంటినొప్పి జ్వరముతో బాధపడుతూ తాత  పాదముల వద్ద కూర్చొనగా తాతగారు తీక్షణంగా చూస్తూనే ఉన్నారు . ఆ ప్రభావమునకు వాపు జ్వరం తగ్గిపోయాయి . ఉదర కోశమునకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో అలానే బాధపడుతున్నారు . అలాంటప్పుడు ఒకసారి తాతగారు బీడి వెలిగించి సగము తాగి ఇతనికిచ్చి తాగమంటే ఈయన బయటకు వెళ్లి బీడీ తాగగానే పెద్దగా తేన్పు వచ్చి గాస్ పోయింది .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి ఇతను తాతగారి వద్ద కూర్చుని ఉండగా బీడీ సగం తాగి కిందపడేసి తాతగారు హఠాత్తుగా 'మంటలు ! మంటలు ! ఆర్పండి ' అని అరిచారు . అదే సమయమునకు వేరేవాళ్ళ స్కూటరుపై ప్రమాదవశాత్తు పెట్రోలు పడి   తగలబడి పోయినప్పటికీ తాత దయతో వారికేమీ కాకూండా ప్రమాదం తప్పింది . ఒకసారి వెంకటరెడ్డిగారు తాతగారి పాదములకు నమస్కరించి లేవబోతుండగా తాత పాదములకు మలినం ఉండడము చూసిన ఈయనకు మనసులో వేరు భావం కలిగింది . అదేరోజు కొత్తగా సైకిలుకు వేసిన టైరు పంక్చరై ఇబ్బందికి గురైరి . తాతపట్ల తనకు కలిగిన భావన తప్పు కాబట్టే తాతగారు అతని తప్పు అతనికి వెంటనే తెలిసేలా చేసిరి . ఆ విధముగా అతని తప్పు తెలియచేసి అతనిలో పరివర్తన కలుగచేసిరి . నేటికి కూడా నిత్యమూ తాతగారి అష్టోత్తర పూజను ఇంటిలో నిత్యమూ నిర్వహించనిదే ఏ పనీ ప్రారంభించక పోవడము వీరి స్థిర భక్తికి తార్కాణము .
 

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సుమారు పాతిక ముప్పై సం . ల క్రితమే భరద్వాజ మాస్టారుగారి ద్వారా తాతగారి గురించి తెలుసుకున్న కర్నూలు వాస్తవ్యులు దయాళ్ శరణ్  వెంటనే తాతను దర్శించుకుని వచ్చిరి . ఇక అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తముగా ఏ భక్తులు తాతను దర్శించుకోవాలన్నా వారికి దయాళ్  శరణ్ మార్గదర్శకులయ్యారు . కల్లూరు కుగ్రామము కావడము ,అప్పటికింకా తాతగారి ప్రభావము తెలియకపోవుటచే కర్నూలు వాసియైన దయాళ్ శరణ్ గారినే అందరూ తప్పని సరిగా కలిసి వారి ద్వారా తాత వద్దకు  వెళ్లగలిగేవారు . ఈ విధముగా ఈయన ఎందరెందరో భక్తులకే కాకా అనేక సంస్థల వారికి కూడా సలహా సహాయము లందించిరి . దయాళ్ శరణ్ గారి ప్రమేయము లేకుండా నేరుగా తాతను దర్శించిన సంస్థలుకానీ ,భక్తులుకానీ ఆ కాలములో చాల తక్కువ . ఈ రకముగా తాత సేవ చేసుకునే భాగ్యము దక్కిన వీరు ఈ ముసలి వయసులో బాబా మందిరమును నిర్మించి ఆ సేవలోనే కాలం  వెళ్లదీస్తున్నారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1324 on: October 04, 2017, 03:21:21 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
సహజముగా సాయి భక్తులైన రామ్మోహన్ గారికి అవధూతలపట్ల అవగాహన కానీ , వారిని దర్శించి సేవించుకోవాలనే ఆసక్తిగానీ  ఎంతమాత్రములేవు . స్నేహితుల బలవంతముపై తాతను దర్శించుటకు వెళ్ళినవారు తాతపట్ల ఆరాధనా భావము కలుగగా వారానికో ,పదిరోజులకో ఒకసారి కారేజీలో ప్రసాదము తీసుకువెళ్లి తాతకు సమర్పించుకొనేవారు . ఈ విధముగా కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత అనుకోని అవాంతరములు ఎదురై ఊహించని విధముగా రెండు సంవత్సరములు తాత వద్దకు కనీసం దర్శనమునకు వెళ్ళుటకు అవకాశం కుదరలేదు . ఆ తరువాత వెళ్లేసరికి తాతగారు దర్శనమివ్వక వెనుకకు తిరిగి పడుకున్నారు . క్షమించమని ఎంతగానో ప్రాధేయపడితే " మీరంతా ఆఘమేఘాల మీదున్నారు సారూ !" అని పలికారు . తన తప్పును తాను  పూర్తిగా తెలుసుకున్న రామ్మోహన్ గారు ఇక ఎప్పుడూ అటువంటి పొరపాటు చేయలేదు . వారిలో కలిగిన ఈ పరివర్తనను అంగీకరించిరి కాబట్టి తాతగారు వీరికి అనేక ముఖ్య సందర్భములలో తన సేవ చేయు భాగ్యమును కలిగించిరి . గురుస్థానమందు స్వామీజీ పంపించిన ద్వారకామాయి ఫోటోను కర్నూలు నుండి తెచ్చినది వీరి కారులోనే ,తాత తల్లి సమారాధనకు అన్నదాన కార్యక్రమ నిర్వహణ భాగ్యము దక్కినది వీరికే . అంతేకాక శివరాత్రినాడు అనేకమంది భక్తులకు తాతగారి దర్శన భాగ్యము కలిగించినది కూడా వీరే . ఈ విధముగా కీలక సందర్భములలో తాతగారు వీరి సేవననుగ్రహించిరి . ఒక సందర్భములో వీరిని తాతగారు 'మాలిక్ బాబా ' వద్దకు తానే స్వయంగా పంపించిరి . ఆ తరువాత మాలిక్ బాబా సమాధి చెందినపుడు భక్తులెవ్వరూ బాధతో ముందుకు రాలేనప్పుడు మాలిక్ బాబాను సమాధి చేసిన అనుభవంతో వీరు ముందుకు వచ్చి కార్యక్రమమంతా దగ్గరుండి పద్ధతి ప్రకారము జరుగుటలో ముఖ్య పాత్ర పోషించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥


                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

  ఒకసారి కర్నూలు సాయిమందిరము చాలా సంవత్సరముల క్రితము కళావిహీనమై శక్తిని కోల్పోయినట్లైనప్పుడు  రామ్మోహన్ గారు ,డాక్టర్ సుదర్శన్ గార్లు మూడు నాలుగు సార్లు తాతగారిని ఈ మందిరమునకు రమ్మని ఆహ్వానించగా వచ్చినపుడల్లా తాత ఆ మందిర ప్రాంగణ నాలుగు దిక్కులా కలియదిరిగి  పరిస్థితిని అదుపుచేసిన తరువాత ఆ మందిర ప్రాభవము పెరిగి తేజోమయముగా వెలుగొందుతోంది . నేటికీ కూడా ఆ మందిరములో అభివృద్ధి కార్యక్రమములో భాగముగా ఐదు దత్తావతారముల విగ్రహములు ,తాతగారితో పాటుగా ఇతర అవధూతల విగ్రహములను ప్రతిష్టించదలచుకున్నప్పుడు  ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి అనేక అవరోధములను ,విమర్శలను అధిగమించి మొత్తము తొమ్మిది విగ్రహములను చేయించి అన్ని విగ్రహములను మొదటగా తాత వద్ద నుంచి నిద్రచేయించిన తరువాతనే ప్రతిష్ఠగావించిరి . ఈ రకముగా తాతగారు సమాధి నుండి కూడా ఆ కార్యాక్రమములో ఉన్న ఆటంకములను తొలగించి దైవ కార్యక్రమము జయప్రదమగునట్లు రామ్మోహన్ గారిని ఆశీర్వదించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1326 on: October 06, 2017, 03:19:07 PM »

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదులో ఉండే సాయిబాబా భక్తుడైన శ్రీనివాస్ కు మొదటినుంచి బాబా ఫోటోను ఫొటోలా కాక స్వయముగా బాబాలానే భావించడం అలవాటు . అతని ప్రతి చర్యలోనూ ఈ భక్తిభావము ప్రస్ఫుటముగా కనిపించుచుండేది . ఇతను ప్రతి సంవత్సరమూ వినాయకచవితికి కల్లూరు తాతగారి వద్దకు వెళ్ళుట అలవాటు . అక్కడకు వెళ్లిన తరువాత వినాయకుని పూజించినట్లుగా తాతగారికి అష్టోత్తర పూజ గావించి ,హారతులిచ్చి తాతలోనే వినాయకుని దర్శించేవాడు . సాయిభక్తుడైన ఇతనికి ప్రత్యేకముగా తాతగారిపై భక్తి భావములు ఎక్కువగా లేనప్పటికీ ప్రతి సంవత్సరమూ విధిగా వినాయచవితి నాడు తాతను పూజించేవాడు . ఒకసారి ఆ విధముగానే కల్లూరు చేరేసరికి తాతగారు ఇంటిలో లేరని తెలిసి తాతను వెదుకుతూ వెళ్లుచుండగా రోడ్డు పక్కగా ఒక గట్టు మీద కూర్చుని ఉన్న తాతను గాంచి ఆ నడిరోడ్డు మీదనే తానెప్పుడూ నిర్వహించే అష్టోత్తర పూజను ప్రారంభించాడు . ఇతను తనతో పాటుగా పూజా ద్రవ్యములన్నీ వెంట తీసుకువెళ్ళేవాడు కాబట్టి అక్కడే ఎటువంటి ఇబ్బందీ లేక పూజ ప్రారంభించాడు . తాతగారి అష్టోత్తరమును అక్షింతలతో తాతాగారికి పాదపూజ చేస్తున్న అతనితో తాత " అక్షంతలతో చేయకూడదు సారూ , గుచ్చుకుంటాయి "అని చెప్పారు . అది వినగానే అతనికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్లు అయింది . ఎందుకంటే అష్టోత్తరము అంటే 108 సార్లు భగవంతుని పూజించడమే కదా . అలా అన్నిసార్లు ఉత్సాహముతో వీరు వేసే అక్షింతలవల్ల భగవంతునికి ఎంత బాధాకరమో ఒక్కసారి అతనికి అర్ధమయ్యింది . వెంటనే అతను ఆ విధముగా పూజించడము ఆపుచేసాడు . అయితే ఇక్కడ మనము గుర్తించవలసినది ఒకటుంది . అదేమిటంటే ఈ శ్రీనివాస్ సాయిబాబాను ప్రత్యక్షముగా ఉన్నట్లు భావించి పూజిస్తాడు కాబట్టి తాతగారు కూడా ఆ భావనను సమర్ధించినట్లుగా బాబాను అతను నిజముగా భావించ గలుగుతాడని ఆ విధముగా తెలియచేసిరి . అతను కూడా తాత ఉపదేశములోను సారమును చక్కగా గ్రహించినవాడై ఇక ఎక్కడ ఏ రూపములో భగవంతుని పూజించాలన్నా అక్షింతలతో విగ్రహమును పూజించునట్లుగా కాక భగవంతుని ప్రత్యక్షంగా పూజించున్నట్లు పూలతో మాత్రమే పూజింపసాగాడు .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1327 on: October 07, 2017, 05:08:32 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అవధూతలను ప్రత్యక్షంగా దర్శించినపుడు వారి చర్యలు వింతగా ఉండి అర్ధము చేసుకోవడం అందరికీ సాధ్యము కాదు . అవధూతలకు ఎటువంటి శౌచములతో పనిలేదన్న సంగతిని పూర్తిగా గ్రహించలేక ఇతను ఎప్పుడు తాతను దర్శించుటకు వెళ్లినా తాతగారు ముఖము కడుగకపోవడమూ ,స్నానము చేయకుండా ఉండడమూ చూసి పైకి నమస్కారములు చేసినప్పటికీ మనసులో మాత్రము కొంత  అసౌకర్యముగా తలచేవాడు . ఇతనికి ఈ ఆలోచన ఉన్న సంగతి ఎవ్వరకూ తెలియదు . ఎప్పుడు తాతను దర్శించినా తాతగారు కనీసం నోరు పుక్కిలించి అయినా నోటిని శుభ్రపరచుకోవచ్చు కదా అన్న ఆలోచన అతని మనసును తొలుస్తూ ఉండేది . ఒకసారి తాతగారి దర్శనానికి వెళ్ళినపుడు తాతగారు నోటినిండుగా నీరు పోసుకుని పుక్కిలించి "థూ " అని ఇతని మీదకు ఉమ్మబోతుండగా అతనికేమైందో అతనికే తెలియనట్లు అతను దోసిలి పట్టి ఆ నీటిని తీర్థముగా తాగేసరికి ఆ నీరు నూటికి నూరుపాళ్లు తులసి తీర్థములా ఉండడము గ్రహించినవాడై ఆశ్చర్యపోయాడు . ఈ చర్య ద్వారా తాత అవధూతలకు ఈ శౌచాశౌచములతో నిమిత్తము ఉండదను విషయము అతను గ్రహించేలా చేసారు . అప్పటివరకు అతనికి ఉన్న భ్రమలు తొలగగా అవధూతల మహత్యం అర్ధమయ్యింది .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి  శైలజ )

తాతగారు పైన వివరించిన విధముగా తన తత్త్వమును తెలియచేసినప్పటినుండి అతనికి ఆ ఆలోచనైతే పోయింది . అటువంటి స్థితిలో ఒకసారి తాతను దర్శించినప్పుడు తాతగారు మలవిసర్జన గావించి వెనుక భాగమంతా చూచుటకు కాదు అసహ్యముగా ఉండునట్లు చేసుకొనిరి . అది చూసిన శ్రీనివాస్ మళ్ళీ అతనిలో పాత ఆలోచనలు పైకి లేవగా అతనిలో ఒక విధమైన అసహ్యము తలెత్తింది . అప్పుడే సరిగ్గా తాతగారు అతనిని పిలిచి "కడగరా " అని ఆదేశించిరి . అప్పుడిక అతను ఎటువంటి ఆలోచనా లేకుండా తాతకు మొత్తమంతా కడిగి శుభ్రముగా ఉండునట్లు చేసాడు . అతనిలోని ఈ ద్వంద్వ భావము పోవుటకే  తాతగారు ఈ విధముగా ప్రవర్తించి అతని మనసులోని నిర్మాలిన్యమును తొలగించి అతని మనసును శుభ్రపరచిరి . అతనే ఈనాడు చిన్న వయసు నందే షిరిడీలో ,వృద్ధాశ్రమమును నెలకొల్పి ఎందరో నిరాశ్రితులైన వృద్ధులకు రక్షణ కల్పించి వారికి అండగా నిలిచి వారి బాగోగులు చూసుకుంటున్నాడు . వారి సేవచేయు సమయములో అతను ఎటువంటి అసహ్య భావమూ మనసులో రాకుండా ఎంతో నిర్మలంగా ,ప్రశాంతముగా ఈ సేవ చేసుకుంటున్నాడు . అతని భవిష్యత్తు తెలిసిన తాతగారు అతనికి నిజమైన సేవ ఎలా చేయాలో అనుభవపూర్వకంగా ఆనాడే నేర్పించిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1329 on: October 09, 2017, 04:41:20 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాతగారు ఎప్పుడు ఎవరిని కరుణించి ఆశీర్వదిస్తారో ఆ లీలలు ఎవ్వరకూ అర్ధము కావు . నాగశిరీష తాను  కోరుకోకపోయినప్పటికీ తాతగారే స్వయముగా ఆమెను ఎన్నుకుని రామసన్నిధానమందు నిత్యమూ హారతి ,భజనలు గావించు అదృష్టమును ప్రసాదించిరంటే ఆమెపట్ల తాతగారి కున్న ప్రేమ అర్ధమవుతున్నది . తన అమాయక ప్రేమతో సన్నిధానము పిల్లలపట్ల బాధ్యత వహించిన ఈమె ఎంతో ప్రేమతో వారిని ఆదరించుట ద్వారా వారి ప్రేమను పొంది నిత్యం తాత నీడలో , తాత సేవలో తరిస్తూ జన్మ సార్ధకతకు మార్గం చూపే తాత పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మెలుగుతున్నది . దత్త భక్తురాలైన ఈమెకు దత్తావతారుడైన తాత తన సేవాభాగ్యము ప్రసాదించారు .
 .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                


 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1330 on: October 10, 2017, 08:29:39 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10.  గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ   గురవేనమః ॥

                                   శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

హైదరాబాదు ఎ .పి . ఫిషరీస్ లో అకౌంటెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే కోదండంగారు సాయిబాబా గురించి తెలుసుకున్నప్పటి నుంచి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లి ప్రసాదము పంచిపెట్టి రావడము ప్రారంభించిరి . ఆ కాలములో కర్నూలులో ఇల్లు కట్టుకోవాలని వీరనుకోగా వీరి అన్నయ్య మాత్రము వీరికొరకై కల్లూరులో 1990 వ సం . లో  ఇల్లు కట్టించిరి . ఆ సమయములో వీరికి తాతగారి గురించి తెలియదు , కానీ తాతగారు వీరు ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి వీరి ఇల్లంతా కలియతిరిగి వెళ్లారు . ఈ ఇల్లు కట్టిస్తున్న అన్నయ్యకు కూడా తాత మహత్మ్యము  అప్పుడు తెలియదు . ఆ తరువాత కాలములో తాతగారి శక్తిని గ్రహించిన వీరి అన్నయ్య తాతగారు కోదండంగారి ఇంటిని పావనం చేసిన సంగతిని తెలియజేసిరి . ఆ రకముగా తన దర్శనము కూడా చేసుకోని అతని ఇంటిని భవిష్యత్తు తెలిసిన తాత పావనం చేసిరి . 1994 వ సం . లో ఉద్యోగ విషయమై ఏ నిర్ణయమూ తీసుకోలేని సమయములో బాబాపై భారము వేసి బాబా ఆదేశము ప్రకారము కర్నూలు రావడము జరిగినది . అప్పటి నుండి సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహించుటే కాక అందరి సహాయ సహకారములతో కర్నూలులోని కొత్తపేటలో నాగసాయి మందిరమును నిర్మించ గలిగిరి . 
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11.   అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )


 కోదండం గారు షిరిడీ యాత్ర చేయాలనుకుని తాతగారి సమాధిని దర్శించిన ఆటంకములు ఉండవని డా . సుదర్శన్ గారి సలహా మేరకు తాతను దర్శించగా అనుకోకుండా వీరి బస్సులో ప్రయాణమే చేసిన ఆనందం వెంకటేశ్వర్లు గారి సహాయంతో తాత ఆశీస్సులతో షిరిడీ యాత్ర సఫలమైనది .

స్వంత ఇల్లు అమ్మి చేయాలనుకున్న రెండవ అమ్మాయి వివాహము కూడా సత్సంగ్ భక్తుల సహాయ సహకారములతో నిర్విఘ్నముగా జరుగుటచేత అసలు తానెవరో కోదండంకు తెలియక మునుపే ఆ ఇంటిని పావనము చేసిన తాతగారు ఆ ఇంటిని అమ్మనీయరని అర్ధమై నిశ్చల మనస్సుతో తాతగారి సేవను నిర్విఘ్నముగా చేసుకోగలుగుతున్నారు . ఆ విధముగా తాతను ప్రత్యక్షముగా  దర్శించి అనేక అనుభూతులను పొందిన ఎందరికో దొరకని భాగ్యము తాతగారి ఆశీర్వాద ఫలితముగా వీరికి దక్కినది . అప్పటి నుంచి ,వీరు ఎందరెందరో భక్తులకు తాతగారి మహిమను తెలియపరుస్తూ వారందరూ తాతను దర్శించి మేలుపొందునట్లు చేయుటలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1332 on: October 12, 2017, 04:34:37 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

కల్లూరులో తమ స్వంత ఇంటిని అద్దెకు ఇచ్చి ఉద్యోగరీత్యా కర్నూలులో అద్దె ఇంట్లో ఉన్న వీరి కుమార్తె 2000 వ సం . నందు డి .ఎస్సీ టీచరు పరీక్షకు కష్టపడి చదివి పరీక్షలు బాగారాసిన  తృప్తిని తెలియజేచేయగా ఆ అమ్మాయికి  ఆ ఉద్యోగమూ వస్తే కల్లూరులోని ఆ ఇంటిని అమ్మి వేసి కర్నూలులో స్థిరపడి నాగసాయి మందిరంలో బాబా సేవలు చేసుకోవాలని వీరి ఆలోచన . అయితే ఊహించని విధముగా ఆ అమ్మాయి పరీక్ష తప్పడంతో ఇల్లు అమ్మాలనే తన ఆలోచన బాబాకు సమ్మతము కాదని అర్ధమయింది .

మరుసటి సంవత్సరము అదే ఉద్యోగమునకు దరఖాస్తు చేసేటపుడు తాతగారి సమాధి వద్దకు వెళ్లి ఈసారి ఆ అమ్మాయిగనుక ఉద్యోగం సంపాదించు కోగలిగితే కల్లూరుకు మకాం మార్చి తాతగారికి ,సమాధికి సేవ చేసుకుంటానని తాతగారిని  మనస్ఫూర్తిగా ప్రార్ధించి ,ఉద్యోగమునకు అప్పీలు చేసిరి . తీరా పరీక్షా సమయమునకు వీరి అమ్మాయి నిండు గర్భిణీ కావడంతో పరీక్షకు ఎక్కువగా చదవలేక పోవుటయే కాక ,పరీక్షను కూడా బాగా రాయలేకపోయినది . అయితే తండ్రి సలహాపై సమాధానములు రాసేముందు తాతగారిని మనస్ఫూర్తిగా తలచుకొని ప్రార్ధించి ,పరీక్ష ప్రారంభించి రాసింది . ఆ అమ్మాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించుటయే కాక అనుకూలమైన స్థలములో ఉద్యోగములో చేరిపోవుట కేవలం తాత దయ ఆశీస్సులు తప్ప వేరొకటి కాదు అన్న సత్యమును గ్రహించిన కోదండంగారు తాను  తాతగారికి వాగ్దానము చేసిన విధముగానే కల్లూరుకు మకాము మార్చుటయే కాక ,నిత్యము తాతగారి సమాధికి అష్టోత్తర పూజ ,హారతులు నిర్వహించుట ద్వారా తాత సేవను చేసుకుంటూ తాత నీడలో కాలము గడుపుతున్నారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1333 on: October 13, 2017, 04:56:31 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )


భగవద్దర్శనంతో సమానమగు అవధూత దర్శనమే కాక వారి లీలలను ప్రత్యక్షంగాకానీ ,పరోక్షంగా కానీ అనుభవించి తమ లౌకిక సమస్యలను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో సేవామార్గంతో పురోగతి పొందుతున్న భక్తులందరూ ధన్యులే .
 తనలీలావిలాసంతో భక్తులను రకరకములుగా అలరించి ,అనుగ్రహించిన తాతగారికి ఏ విధంగానూ ఋణం తీర్చుకోలేని మనము ఆ లీలావిలాసాన్ని మనసారా గ్రోలుతూ ఆ లీలలలో తెలియాడుతో ఆ లీలలను మననం చేసుకుంటూ మదిలో తాతను మనస్ఫూర్తిగా నింపుకుంటూ కలకాలం తాత భక్తులుగా నిలబడగలిగే  భాగ్యాన్ని ప్రసాదించమని తాతగారిని కోరుకోవడమే మనము చేయగలిగినది .

                                              త్వమేవ సర్వం మమ మమ దేవ దేవ

                                                 పదిహేనవ అధ్యాయము సంపూర్ణము
                                           అయిదవరోజు పారాయణము సమాప్తము

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1334 on: October 14, 2017, 03:53:41 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

 ఆరవరోజు పారాయణ
                                                                   రక్షకుడు
                                                               అధ్యయము -16
                             శ్రీగణేశాయనమః  శ్రీ సరస్వత్యైనమః   శ్రీ రామావధూతాయనమః
 
                                           పాపహరం పాదతీర్థం పరమపద సోపానం
                                          తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం

                       ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
                       ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్

అవధూత రామిరెడ్డి తాత తన భక్తులపై కురిపించిన ప్రేమాభిమానములకు అంతులేదు . భగవత్సరూపుడైన తాత తన భక్తుల యోగ క్షేమములను తాను వహిస్తూ ఉండేవారు . వారికే హాని కలుగకుండా అన్నివైపుల నుండి కాపాడుతూ భక్తుల యోగక్షేమం అనగా వారి మంచి చెడులు మాత్రమే కాక వారి కర్మలను ధ్వంసం చేస్తూ వారిని ప్రాణహాని నుండి తప్పించి నూతన జీవితం ప్రసాదించిన మహానుభావుడే మన రామిరెడ్డితాత . అటువంటి ప్రాణదాతకు మనసారా నమస్కరిస్తూ ఈ అధ్యాయం ప్రారంభిద్దాం .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!