Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 126126 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1305 on: September 15, 2017, 04:07:12 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )
                                       
                                             అధ్యయము -15
                      శ్రీ గణేశాయనమః   శ్రీ సరస్వత్యై నమః    శ్రీ రామవధూతాయనమః

                     కైవల్య ఫలప్రదాతం కలికల్మష నాశకం
                    తారయతి సంసారాత్ తాత ఇత్యక్షర ద్వయం
 
అవధూత రామిరెడ్డి తాత లీలావిలాసములోని మరికొన్ని మధుర ఘట్టాలు

అదృష్టరేఖ :

నిర్మల్ వాసియైన నరేంద్ర గుప్తాగారు వ్యాపారం విడిగా ప్రారంభించే ముందు తాతగారిని ఏ వ్యాపారము చేసుకోవాలని ప్రార్ధించగా తాత 'బీడీలు అమ్ముకో పో ' అని అన్నారు . తాతపై ఆధారపడి ఎవ్వరినీ సంప్రదించకుండా తమ బుద్ధికి తోచినట్లుగా వ్యాపారం ప్రారంభించిరి . అప్పటి నుంచి పరిస్థితులు అనుకూలించుట ప్రారంభమైనది . ఇంకా పూర్తిగా నిలకడలేని స్థితిలో తాతను దర్శించినప్పుడు తాతగారు వీరితో కారు తీసుకురమ్మన్నారు పైసలేలేవు . ఎలా కారు తెమ్మంటావు తాతా అని వీరు బాధపడ్డారు . కానీ  కొంత కాలమునకే మారుతీ వ్యాను కొనే స్థితికి వచ్చి కారును తీసుకుని తాతగారి వద్దకు వెళ్లిరి . అదే వ్యానులో నిర్మల్ నుండి తాతగారిని కర్నూలు తీసుకువెళ్ళుటకు బయలుదేరగనే  అందులో ఎక్కి కూర్చున్న తాత " పొక్కలున్నాయేంటి సారూ "అని అన్నారు . కొత్తబండి ,కొత్త టైర్లు ఎటువంటి అనుమానములకు ఆస్కారమే లేని పరిస్థితి అటువంటిది బండి బయలుదేరి అయిదారు కిలోమీటర్లు కూడా వెళ్ళక  ముందే టైరు పంక్చరైంది . ఆ విధముగా 25 కి . మీ .లోపు నాలుగైదు సార్లు అలానే జరిగింది . ఆ విధముగా ముందు జరగబోవు దానిని తాతగారు సూచించిరి . అంతే కాకుండా ఇది ఒక్క టైర్లకు మాత్రమే సంబంధించినది కాకూండా వ్యాపారములో కూడా డబ్బు ఏ విధముగా వచ్చిందో అదే విధముగా పోవడమూ కూడా జరిగినది . చిల్లుకుండలో నీరు నిలువ ఉండనట్లు వీరు సంపాదించిన ధనమంతా కూడా తెలియకుండానే ఖర్చయిపోవడం జరిగినది . అయితే ఇన్ని ఒడిదుడుకులకూ గల కారణమేమనగా ఈ నరేంద్ర గుప్తా గారి జాతకంలో భగవంతుడు అదృష్టరేఖను రాయడం మర్చిపోయాడు . అయితే ఆ గీతను సరిగ్గా గీసి తాత ఈయనను జీరో నుండీ హీరోగా మలచి లక్షాధికారుల జాబితాలో చేర్చిరి . తాతను నమ్ముకున్నందుకు తమ కర్మను ధ్వంసం చేసి యోగములో లేని అదృష్టాన్ని కలిగించిన తాతకు  సర్వదా కృతజ్ఞులై ఉన్నారు . ఒకసారి తాతగారి దర్శనం చేసుకున్నప్పుడు తాతగారు నీళ్లు తెమ్మని వీరిని అడుగగా తీసుకు వస్తూ వస్తూ ఎలా పడిపోయారో తెలియకుండా నిలువునా పడిపోవడము జరిగింది . అయినప్పటికీ చిన్న దెబ్బ కూడ తగలక పోవడంతో తాతగారు ఎదో కర్మను ఆ విధముగా తీసివేసిరని అర్ధమయింది . నేటికి కూడా ఎటువంటి విషమ పరిస్థితులలోనైనా తాతను తలచుకోగానే బీడీ తాగుతూ అభయమిస్తున్న  తాతగారు మదిలో ప్రత్యక్షమయ్యి ఈయనకు మానసిక ధైర్యం చేకూరుస్తారు . 2005 దసరాలో కూడా నష్టం వస్తుందని అనుకున్న విభాగములో నిత్యమూ తాత తనతో ఉన్న అనుభూతిని ఆయన పొంది ,నష్టానికి బదులు రెండు లక్షల లాభం పొందారు .
 

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1306 on: September 16, 2017, 08:47:03 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                       శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

లాలన :

న్యాయవాది వృత్తిలో ఉన్న సతీష్ కోర్టుపని మీద కర్నూలు వెళ్ళినప్పుడల్లా సాయిబాబా మందిరమునకు వెళ్లడం అలవాటు . ఒకసారి అలాగే రాత్రి సమయానికి గుడికి వెళ్లేసరికి అక్కడి పూజారి మాటల సందర్భములో తాతగారి గురించి చెప్పగా విని ఆ తరువాత దర్శనం చేసుకున్నాడు . దర్శనానికి వెళ్ళేటపుడు అరటిపళ్ళు తీసుకుని వెళ్ళాడు . వెళ్లిన దగ్గర నుండి తాతగారు ఇతనినే చుస్తున్నారు . కానీ ఏమీ పలకరించలేదు . అయినా అలానే కూర్చునుండగా కడుపులో ఆకలి దంచేస్తున్నా ,అక్కడున్న భక్తులంతా వెళ్ళిపోయినా ,ఇతనొక్కడే కూర్చుని ఉన్నాడు . అప్పుడు అతని ఆకలి గ్రహించి నట్లుగా తాతగారు " ఆకలేస్తోందిగా -తిను " అంటూ రెండు అరటిపళ్ళనిచ్చారు . తాను చెప్పకమునుపే తన ఆకలి గ్రహించి అమ్మలా ఆదరించి తీర్చిన తాతపై ప్రేమాభిమానాలు కలుగగా సతీష్ మళ్ళీ ఇంకొకసారి తాత దర్శనానికై వచ్చాడు .
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1307 on: September 17, 2017, 03:56:36 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి. శైలజ )

అయితే ఇతను వెళ్లేసరికి తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి . లోపల తాతగారు ఉన్నారో లేదో తెలియని ఇతను తలుపులు తెరవడానికి జంకు కలుగగా ఇంతలో లోపలనుండి తలుపులు తెరుచుకుని తాతగారే స్వయంగా "మనబాబు వచ్చాడు " అంటూ సమాధానమిచ్చారు . ఇది చుసిన సతీష్ ఆనందముతో తాత సన్నిధిలో గడిపాడు . అయితే అనుకోకుండా అదే రోజు రాత్రి తాత ఇంట్లోనే అతనికి జ్వరము వచ్చింది . అప్పుడు తాతగారు 'పిల్లాడ్ని ఇక్కడే ఉండనీ ' అన్నారు . ఆ తరువాత చంద్రారెడ్డి ఇచ్చిన మజ్జిగ తాగి కొంత తేరుకున్న సతీష్ ఎందుకుండిపోయాడో తనకే తెలియకుండా తాత సన్నిధిలోనే ఉండిపోయాడు . ఆ రకంగా పిల్లాడ్ని ఇక్కడే ఉండనీ  అన్న తాతగారి ఆజ్ఞ అప్రయత్నంగా నెరవేరిపోయింది . అలా ఇంటిని వదిలిపెట్టిన సతీష్ ను ఇంటివారు కూడా చిత్రంగా రమ్మనమని బలవంతం చేయకపోవడము వింతగా అనిపించింది . అలా 18 నెలల కాలము తాత సన్నిధిలో గడిపిన అదృష్టం ఇతనికి దక్కింది . రేయింబవళ్లు తాతతోనే ఉండిపోయిన ఇతనిని తాతగారు కూడా ఎంతో లాలనగా చూచుకున్నారు . ఒక్కొక్కసారి మంచి నిద్రలో నుండి మెలకువ వచ్చి చూసేసరికి ఇతని పక్కన తాతగారు ఇతని కాలుమీద కలువేసి పడుకుని ఉండడము  చూసిన ఇతనికి అదొక కలలా అనిపించేది . ఆ విధముగా సాక్షాత్ భగవంతుని ఒడిలో నిద్రించే భాగ్యము దక్కిన ఇతను ధన్యుడు . అలా తాతగారితో గడిపిన ఆ 18 నెలలు మధురానుభూతులు మిగిలిపోగా 1992 నవంబరు మాసములో తాతగారు ఇతనిని కల్లూరు వదలి వెళ్ళమని ఆదేశించిరి . అతనిని పంపిన రెండు నెలల లోపే తాత మహా సమాధి నొందిరి . దీని బట్టి చుస్తే భవిష్యత్తు తెలిసిన తాత ఇతనిని కావాలనే కల్లూరు నుండి పంపిరని స్పష్టముగా తెలుస్తుంది . ఇప్పటికీ అనేకసార్లు తాతగారి దర్శనం కలలో సతీష్ కి లభిస్తూనే ఉంది .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1308 on: September 18, 2017, 04:41:40 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

 15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥   
   
                                           శ్రీ రామవధూత చరిత్ర (టి . శైలజ )

స్వప్నఫలం :

ఒకసారి తాతగారు భక్తుల మధ్య కూర్చుని ఉన్న నారాయణరావుగారిపై తన పంచెను మూటలా కట్టి విసిరేసి 'చాలా ' అని అడిగారు . అనగా నారాయణరావుగారు తృప్తినొందిరా అని తాతగారు అడిగిరి . అంతేకాక రావుగారికి వారి అబ్బాయిని తాతగారు ఆశీర్వదించిన బాగుండునని మనసులో అనుకోగానే వెంటనే తాతగారు తను తింటున్న మామిడిపండును ఆ అబ్బాయి పైకి విసిరి తన ఆశీర్వాదమును తెలుపుటయే కాక ఆ తండ్రి మనసును శాంతిని ,తృప్తిని కలిగించిరి .

ఒకసారి నారాయణరావుగారు రాత్రి సమయమునందు తన ఇంటిలో బాతురూముకు వెళ్లి ఒక్కసారిగా వెనక్కుపడిపోయిరి . అప్పుడు వారి తలకు గాయము పైకి కనిపించక పోయినప్పటికీ తలా ఇటూ అటూ టిప్ప్పలేనంత భారముగా తయారైంది . డాక్టరునకు చూపిస్తే వారియేమి  పరీక్షలు చేస్తారోనని వైద్యము చేయించుకోవడము ఇష్టములేని వీరు తాతగారు తనకు ఈ కష్టము తప్పించాలని మనసులో ప్రార్ధించుకున్నారు . ఆ తరువాత రెండు రోజులకు నారాయణరావు గారు నిద్రిస్తుండగా కలలో దూరము నుంచి వస్తున్న తాతగారిని చూస్తూనే పాదనమస్కారము చేసుకోబోగా తాతగారు ఈయన తలను పట్టుకుని గట్టిగా ఊపేసారు . తెల్లవారి లేచి చుస్తే ఈయన తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి యథాస్థితి చేకూరింది . ఆ విధముగా ఈయనకు డాక్టర్ల బారిన పడడము ఇష్టము లేకపోవడముతో తాతగారు ఆయన మనసుకు తగినట్లుగానే ఆయనను ఆ బాధనుండి విముక్తులను చేసిరి . దీనిని బట్టి తాతగారు సమాధి తరువాత కలలోనే జబ్బులను నయం చేయగల సమర్ధులని తెలియుచున్నది .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1309 on: September 19, 2017, 04:55:31 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                   శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

బంగారు గొలుసు :అనగొండ శివమ్మగారి పెద్దకూతురు ఏడెనిమిది సంవత్సరముల పాప మెడలో ఉన్న గొలుసు దొంగతనము చేయబడింది . అయితే దొంగతనము చేసినతనే అయ్యో మెడలో గొలుసు లేదేమిటో చూడమని చెప్తూ తనమీద అనుమానమా ? అని అడిగేసరికి ఎవ్వరికీ అతని మీద అనుమానం రాలేదు . అప్పుడే తల్లి పెరిగెత్తుతూ తాత వద్దకు విషయము వివరించగా తాత "నువ్వింట్లో ఉండు వాళ్ళే ఇస్తారు " అని చెప్పారు . గొలుసు తీసుకుని వెళ్లిన అతని తల్లికి రెండు సంవత్సరముల తరువాత సంగతి తెలుసుకుని గొలుసును తిప్పి వారికి పంపించింది . అదే గొలుసును ఆ అమ్మాయి పెళ్ళైనపుడు తాత ప్రసాదముగా ఆ అమ్మాయికి మంగళసూత్రముగా ఇచ్చారు . వీళ్ళందరూ ఎప్పుడు లద్దగిరి వెళ్లినా తాతను కూడా తమతో పాటు రమ్మని ప్రార్ధించగా తాతగారు నేను వస్తాను అని చెప్తూనే తెల్లవారే వరకు కల్లూరులోనే ఉండేవారు . తెల్లవారే సరికి 30 కి .మీ దూరంలో ఉన్న లద్దగిరిలో కనిపించడము చూసి అందరకూ తాత ఎప్పుడు బయలుదేరేవారో ఎప్పుడు వచ్చేవారో ఎవ్వరకూ అర్ధమయ్యేది కాదు . అందరూ ఇది తాతగారి లీలగా భావించేవారు .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1310 on: September 20, 2017, 04:49:05 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||


                                      శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

భక్తి -విశ్వాసం :

కర్నూలు వాస్తవ్యులైన గోపాల్ రెడ్డిగారు తాతగారిని ప్రత్యక్షముగా దర్శించుకోలేక పోయినప్పటికీ తాతపట్ల అపారమైన భక్తి విశ్వాసములు కలవారు ,ఏ దేముని పూజించినా ,పూజించకున్ననూ ,ప్రతి నిత్యమూ నియమము తప్పక తాతను పూజించుట వీరి దైనందిన కార్యక్రమము . వీరి  భార్య మాధవిగారికి మాత్రము తాతపట్ల అంతగా నమ్మకము లేదు .  అందుకే వీరు  తాతగారు ఉన్నట్లు  తనకు నిదర్శనము కనిపిస్తేనే తాను  నమ్ముతాననీ లేకపోతే లేదనీ అనుకుని తాతగారికి  ఇష్టమని చెప్పే జొన్నరొట్టి ,పుంటికూర చేసి ఉంచుతాననీ ఎదో ఒక రూపములో వచ్చి తాతగారు దానిని స్వీకరించాలనీ అప్పుడే తాతను తాను నమ్ముతాననీ  మదిలేటితో  వాదించిరి . ఆ సమయములో వారింటిలో అవ్వ ఎన్నడూలేని విధముగా శుచిగా స్నానముచేసి జొన్నరొట్టె .,పుంటికూర తయారుచేసి నైవేద్యము పెట్టమని పూజ  చేసుకుంటున్న మాధవికి ఇవ్వడం జరిగింది . ఆ అవ్వ పూజా మందిరములోనికి రావడం కూడా అదే  ప్రథమము . ఈ లీలను చూసిన మాధవి ఆశ్చర్యమునకు అంతేలేదు . ఎందుకంటే ఎదో ఒక రూపములో తాతగారు వచ్చి తినాలనుకుంటే పూజా మందిరములోకే ప్రసాదము రావడముతో తాత ఉన్నారన్న నమ్మకము ఏర్పడింది . నిష్కల్మషమైన గోపాల్ రెడ్డిగారి భక్తి విశ్వాసములకు మెచ్చినట్లుగా తాతగారు తన ఆరాధనోత్సవమునకు మూడుసార్లు మొత్తము అన్నదానము వీరి చేతుల మీదుగా జరిపించు అవకాశమును ,అదృష్టమును వీరికి కలిగించిరి .
 
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1311 on: September 21, 2017, 06:37:33 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

 

                                                  శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆరాధనోత్సవము నాడు మాధవిగారు తప్పనిసరిగా తాత అభిషేక పూజకు హాజరగుదురు . ఏ కారణము చేతనైనా వీరికి వెళ్ళడము ఆలస్యమైతే అక్కడ తాత సమాధి మందిరములో కూడా అనుకోకుండా ఆలస్యము జరిగి , వీరు వెళ్లిన తరువాతనే అభిషేకము ప్రారంభమైన సందర్భములు కూడా కలవు . అంతేకాక ఒకసారి మాధవిగారు  ఇంటి నుండి ప్రత్యేకముగా తాతగారికి నైవేద్యము వండి చేసుకుని తీసుకువెళ్లేసరికి అక్కడ ఇసుకవేస్తే రాలనంత భక్తజన సందోహములో తాను  తెచ్చిన నైవేద్యము లోపలకు వెళ్లి ఇచ్చే అవకాశము లేక ఎవరి ద్వారానో లోపలకు తాతకు నైవేద్యము పెట్టమని చెప్పుట జరిగింది . మదిలేటి  కనిపిస్తే తాను  తెచ్చిన టిఫిను కారేజి గుర్తులు చెప్పి అందులో ఉన్న నైవేద్యమును అందరికీ పంచి పెట్టమని చెప్పాలని ఈవిడ కోరిక . అయితే వందల కొద్దీ అక్కడ తాతగారి కోసము ఎదురు చూస్తున్న నైవేద్యములలో తన దానిని గురించి ప్రత్యేకముగా చెప్పే అవకాశములేక చేయగలిగినది ఏదీ లేదనుకుంటూ అన్నదాన కార్యక్రమము జరుగుచోటుకు మెల్లగా వచ్చేసరికి అప్పటికే అక్కడ సమాధి మందిరములో తాతకు నైవేద్యము పెట్టి ఇక్కడ భక్తులనాదరికీ ప్రసాదముగా ఈవిడ తెచ్చిన నైవేద్యమునే వడ్డించుట చూసిన ఈమెకు ఆశ్చర్యముతోపాటు ఆనందము కలిగి తాత తమకు అన్నదానము చేయు అవకాశమిచ్చినందుకు తృప్తిగా ఆ దంపతులిద్దరూ తాతకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొనిరి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1312 on: September 22, 2017, 06:08:41 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                              శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సత్యనారాయణ వ్రతం :

పాండురంగారెడ్డి గారు ఎంతటి సమస్యనైనా తాత ద్వారా పరిష్కరించుకునే వీరు ఏ పనిచేయాలన్నా తాత  అనుమతి ,ఆశీర్వాదములతోనే పూర్తిచేస్తారు . అటువంటి వీరికి సత్యనారాయణ వ్రతమును తమ ఇంటిలో చేయించుకొను కార్యక్రమము తాత సమక్షములో జరిపించుకోవాలని కోరిక కలిగి  తాతను వేడుకోగా తాతగారు అందుకు అంగీకరించి ,కార్తీకపౌర్ణమి పుణ్యదినమున తన ఇంటిలో స్నానము కూడా చేయకుండా తుంగభద్ర నదికి వరద వచ్చిన కారణముగా కర్నూలు పట్టణమంతా వర్షములతో ఉన్నప్పటికీ ఉదయము పదిగంటలకల్లా వీరి గృహమును పావనము చేసి అందరితో మంగళ స్నానములు చేయించుకుని అందరినీ ఆనందపరచుటయే కాక మొత్తము వ్రతము పూర్తయ్యి అందరూ భోజనాదులు ముగించుకుని మరలి వెళ్ళేవరకు తాత వారింటి నుంచి కదలక యుండి వారి కోరికను నెరవేర్చిరి . అయితే ఇది జరిగిన రెండు  నెలలకే తాతగారు సమాధి చెందడముతో ఆఖరిసారిగా తాత తమ ఇంటిని పావనమొనర్చి తమను ఆనందపరచిన సంగతి వారి హృదయములలో ముద్రించుకుపోయినది .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1313 on: September 23, 2017, 10:54:39 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )


ఆనాడే  కాక ఏనాటికీ తాతగారినే నమ్ముకున్న ఆ కుటుంబమును తాతగారే రక్షించి కాపాడుచుండిరి . 2001 సంవత్సరములో తప్పనిసరి పరిస్థితులలో ఆర్ . టి . సి . బస్సు సమ్మె ఉన్న సమయములో నెల్లూరు వెళ్లిన వీరి భార్య వేదవతి గారికి తిరుగు ప్రయాణములో ఒక్క బస్సే కాకా ఇతర సౌకర్యములు లభించక అక్కడ ఉండుటకు వీలులేక వచ్చుటకు దారిలేక ఆ రాత్రి సమయములో ప్రాణములు అరచేతపట్టుకుని పరిస్థితిని తన భర్తకు ఫోను ద్వారా వివరించగా ఆ సమయమునకు కల్లూరులో తాతగారి సమాధి వద్ద నున్న భర్త మనస్ఫూర్తిగా తాతకు నమస్కరించిన వెంటనే అక్కడ ఎవరో తెలిసిన కండక్టరు కనిపించి , ఈవిడ వద్దకు వచ్చి ఒకే ఒక్క బస్సు కర్నూలుకు బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నదనీ వెంటనే వచ్చి ఎక్కమనీ చెప్పేసరికి ఆవిడ ఈ విషయము భర్తకు ఫోను ద్వారా తెలిపి సమాధి నుండి కూడా తాత తమకు సమాధానము చెప్పి రక్షించిన విధము చూసి ఇక ఆ రక్ష తమ కుటుంబమునకు సదా ఉండునని ఆనందించిరి .
   
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1314 on: September 24, 2017, 03:57:11 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత 

శ్లో ॥ 21.  శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
             గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                          శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఆర్థికస్థితి :

కర్నూలు పాతబస్టాండు దగ్గర ఉండే విఠొబారావుగారు తాతగారికి నిశ్శబ్ద భక్తుడు 2001 వ సంవత్సరములో తాతగారి గురించి తెలిసినప్పటి నుంచి క్రమం తప్పక ప్రతిరోజూ తాత దర్శనము చేసుకుంటున్నారు . వీరి  అమ్మాయికి వివాహము నిశ్చయమైన సందర్భములో వీరు ఒక దుకాణము ఆ అమ్మాయికి కట్నము కింద ఇస్తానని మాటిచ్చేసారు . అయితే తరువాత  ఆలోచించి చుస్తే ఆ దుకాణము ఇచ్చేస్తే దానిపై వచ్చే అద్దె వీరిది కాదు కాబట్టి ఆర్థికముగా తట్టుకోవడం కష్టము కాబట్టి తాతగారిపై భారమువేసి ,పెళ్లికుమారుని ఇంటికి విషయము చెప్పుటకు వెళ్లి తన ఇబ్బంది గురించి తెలుపగా కొంతసేపు తర్జన భర్జనలు తరువాత ఈయన ఇవ్వగలిగినంత మొత్తమునకే  దుకాణము ఇవ్వకపోయినా పరవాలేదు అని చెప్పడము కేవలము తాత లీల తప్ప వేరొకటి కాదని వీరి ఉద్దేశ్యము .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1315 on: September 25, 2017, 04:32:59 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ ) 
ఇంకొక సందర్భములో కూడా దుకాణములకు చెల్లించు పన్ను ( టాక్స్ ) విపరీతముగా పెరిగిపోయి వ్యాపారాస్తుంలదరికీ  మోయలేని భారముగా తయారైనది . విఠోబా  గారు తాతగారి భక్తులగుటచే తాతగారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని 3000 రూపాయలలోపు పన్ను అయితే తాను  కట్టగలననీ అంతకు మించి తనతో కాదనీ అధికారులకు నచ్చచెప్పుటకు వెళ్లగా అక్కడ ఉన్న వారు తన స్నేహితులే కావడంతో  సమస్య చెప్పగానే  వారు సానుకూలముగా స్పందించి ఇతను తాతను కోరినట్లుగానే 2975 రూపాయలకే పన్ను నిర్ణయించడం జరిగింది . తాతను ప్రత్యక్షముగా దర్శించిన భక్తులు తాత  వలన ఏ విధముగా లాభము పొందినారో తానూ ఆ విధముగా లాభం పొందుతున్నాననీ తాతను చూడలేదను బాధకన్నా తాత ఆశీస్సులు తనకు కలవను ఆనందము తనకు చాలని అతని అభిప్రాయము .
 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1316 on: September 26, 2017, 03:37:43 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
                 గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

                                              శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

అలానే కలగొట్లలో నివసించే నాగప్ప పొట్టకూటి కోసము కర్నూలులో రిక్షానడుపుకునే నిరుపేద . కర్నూలులో ఉండే కుమ్మరి లక్ష్మన్న ద్వారా తాతగారి గురించి తెలుసుకుని తాత దర్శనము చేసుకున్నాడు . ఆ తరువాత తాతగారు అప్పుడప్పుడు ఇతని రిక్షా ఎక్కి తిరిగేవారు . అప్పటి నుంచి ఆర్ధిక పరిస్థితులలో మార్పువచ్చి కష్టాలు తీరాయి . ఇప్పటికైనా ఏ విధమైన కష్టమొచ్చినా తాత నాశ్రయించి ఆ కష్టాల నుంచి గట్టెక్కుతాడు .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

బాధ - బెంగ :

లక్ష్మీదేవమ్మ ఒకసారి 1992 వ సంవత్సరము మార్చి 5 వ తారీఖున తాత దర్శనానికి వెళ్లి తాతకు నమస్కరించగానే తాతగారు ' అబ్బా ఎంత భారము పెట్టావు నామీద ' అన్నారు . అప్పుడామె మిద్దెలడిగినా ,మాణిక్యాలు అడిగినా ,ఐదవతనం అడిగానంతే కదా తాతా అని అనగానే తాతగారు ' అదే పెద్దపని ' నాతో కాదు అన్నారు . తాతగారు ఎందుకిలా అన్నారో అర్ధము కాని  ఆమె వెళ్ళిపోయింది . అయితే మార్చి 30 తారీకున ఈశ్వరయ్యకు ఆక్సిడెంట్ జరిగింది . ప్రాణాపాయస్థితి లో అతనుండగా అతని కొడుకు పరుగున తాత వద్దకు వచ్చి ఏడుస్తూ నిలబడగా తాత పలకకపోవడము అక్కడే ఉన్న మద్దిలేటి ఆతృతగా పిల్లడు ఏడుస్తుంటే ఏం చెప్పవేంటి తాత అనిఅడిగేసరికి తాతగారు ' డబుల్ జీరో అయిపొయింది ' అన్నారు . అంతే ఆ మర్నాడే ఈశ్వరయ్య మరణించాడు . ఆ విధముగా ఆమెకు ముందుగా తెలియచేయడమే కాక అందులో తానేమి చేయనని కూడా స్పష్టముగా పలికిన తాత  కొడుకు వచ్చి ప్రాధేయపడినప్పటికే జరగవలసినది జరిగిపోయిందని సెలవిచ్చారు . ఆ తరువాత కొడుకు తాత వద్దకు వచ్చినపుడు తండ్రిలేని ఆ కొడుకు తలను ప్రేమతో నిమురుతూ తాతగారు అతని జీవితమంతా సాఫీగా సాగుతుందని ధైర్యమిచ్చిరి . తల్లికూడా తాత భక్తురాలుగా ఉంటూ తన కష్టసుఖాలు తాతకు చెప్పుకునేది .

 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఎన్నో సంవత్సరములుగా ఎప్పుడూ తమ కళ్ళముందే ఉండే తాత తరువాత కాలములో అనేకదూర ప్రయాణములు చేసి భక్తుల బాధలను బాపుతూ ధర్మ సంస్థాపన గావిస్తుంటే కల్లూరు ప్రజల మనసులు తాత రాకకై తహతహలాడేవి . అదే విధముగా లక్ష్మీదేవమ్మ కూడా తాతగారు ఢిల్లీ యాత్రకు వెళ్లి చాలా రోజులైనారని తాతకోసమై ఎదురుచూస్తూ తాతను తలచుకుంటూ పడుకునే సరికి కలలో బంకు దగ్గర తాత కనిపించగా ఆనందముతో తాత రెండు పాదములనూ గట్టిగా పట్టుకుని ఏడుస్తుండగా మెలకువ వచ్చింది . అయితే తెల్లవారి ఢిల్లీ నుంచి వచ్చిన తాత దర్శనం అదే  బంకు  దగ్గర నిజముగా లభించడముతో ఆమె ఆందపారవశ్యం చెందుతూ తాత పాదాలకు నమస్కరించింది .

 

 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2371
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1319 on: September 29, 2017, 04:48:43 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

1993 సం || సంక్రాంతికి కుడుములు తయారుచేసి కొడుకుచే తాతగారికి పంపగా తాతగారు అతనితో 'అమ్మకు చెప్పు ఆరోగ్యం బాగోలేదని ' అన్నారు . అయితే వీరు అది ఈమె గురించి అనుకున్నారు . కానీ , తాత  తన సమాధి విషయమును సూచించిరను సంగతి మర్నాడు కానీ వారు తెలుసుకోలేకపోయారు . బద్దలయిన గుండెలతో పరుగు పరుగున తాతను చేరి తాతగారి అంతిమ దర్శనము చేసుకుని వచ్చిరి ; నేటికి కూడా కష్టానికైనా సుఖానికైనా తాతపైననే ఆధారపడి జీవిస్తున్నారు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!