Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 126382 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1290 on: August 31, 2017, 06:05:50 PM »
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥   

                                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )  .

ఒకసారి కేశమ్మకు అనుకోకుండా  జబ్బు చేయగా ఏమి చేయాలో తెలియక తాత  సమాధి వద్ద ఎంతో బాధపడుతూ తన జబ్బు తొలగించమని తాతను ప్రార్ధిస్తూ తాత సమాధి వద్దనే నిద్రచేసింది . అప్పుడు కలలో తాతగారు ఈమె మెడమీద కాలువేసి నొక్కిపెట్టి ఉంచారు . ఉక్కిరిబిక్కరి అయినా ఈమె లేచి చూసేసరికి అది కల అని తెలుసుకోవడమే కాక తన జబ్బు నయమైన సంగతిని కూడా గ్రహించి తాతకు భక్తిపూర్వక నమస్కారము లందించుచున్నది .

 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1291 on: September 01, 2017, 04:49:25 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥

                          శ్రీ  రామావధూత   జీవిత చరిత్ర ( టి . శైలజ )

డీ . సి .యం

కర్నూలు పట్టణం లో తాతగారు సతీష్ వాళ్ళ ఇంటిని పావనము చేసినన్ని సార్లు ఇక ఏ ఇంటినీ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో . 1985 సంవత్సరంలో వీరు మొదటిసారిగా తాతను దిగంబరముగా చూసినప్పటికీ ఎంతో ఆప్యాయతానందము కలిగింది . అప్పటినుంచి వీలయినప్పుడల్లా తాతను దర్శించుకుంటూ ఇతని భార్య రాజేశ్వరీ తాతకు తలదువ్వడం ,స్నానం చేయించడం వంటి పనులన్నీ ఒక చిన్నపిల్లవాడికి తల్లి చేసినట్లుగా చేసేది . ఆ రకముగా తాతతో వారికి అనుబంధం పెరిగింది . ఒకసారి సతీష్ అందరినీ తాత వద్దకు దర్శనానికి తీసుకువెడతానని చెప్పి తరువాత భార్య  అడిగితే చెంపదెబ్బ కొట్టాడు . అప్పుడామె పిల్లలను తీసుకుని కల్లూరుకు నడుచుకుంటూనే వెళ్ళిపోయింది . అప్పుడు తాత ఆమె నమస్కారం చేస్తే చేయించుకోలేదు . బజ్జీలు పెడితే తినకుండా ఏ రకమైన సేవనూ గ్రహించక ' దెబ్బలు తిని రానక్కరలేదు " అన్నారు . తాత సర్వజ్ఞతను  తెలుసుకున్న రాజేశ్వరీ వెంటనే సతీష్ కు కబురు చేయగా అతను వెంటనే వచ్చి తాతను క్షమించమని వేడుకొని తాతను సేవించగా అప్పుడు తాతగారు వారి సేవననుగ్రహించారు . డి .సి .యం  బండిని నడిపించే సతీష్ వాళ్ళ బండిని తాతగారు అనేకమార్లు ఎక్కి కర్నూలంతా తిప్పమనేవారు . ఒకసారి భక్తులందరూ కలిసి తాతగారితో పాటుగా ఈ డి .సి యం  లోనే లద్దగిరి వెళ్లగా అక్కడ అందరినీ తాత విశేషంగా ఆశీర్వదించారు .

 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1292 on: September 02, 2017, 04:19:03 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
             యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                                         శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకరోజు నూతన సంవత్సరమునాడు సతీష్ తాతగారిని తమ ఇంటికి ఆహ్వానించి పక్కనే ఉన్న తన అక్కగారు జయమ్మ గారింటికి తీసుకుని వెళ్లి అక్కడ నుండి తన పని మీద తాను  వెళ్ళిపోయాడు . అప్పుడా సమయానికి జయమ్మ గారు భక్ష్యాలు చేస్తూండంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుని ఉంది . రాజేశ్వరి ఎంతగా బతిమాలుకున్నప్పటికీ తాత వారింటికి వెళ్ళలేదు . ఆ పొగలోనే కూర్చుని అక్కడ నుండే వెనుకకు మరలినారు కానీ పక్కనే ఉన్న సతీష్ ఇంట కాలుకూడా పెట్టలేదు . ఎంతోసేపు తాత ఎందుకిలా చేసుంటారా అని ఆలోచించిన వారికి సతీష్ తాతను వదిలి వెళ్ళిపోయినందుకే తాతగారు వారింటికి రాలేదని స్ఫురణకొచ్చి ఎంతో బాధపడిరి .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
              తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥

                                                  శ్రీరామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి వారింట సత్యనారాయణ వ్రతము నిర్వహించదలచి తాతగారి నైనిటాల్ ఫోటోను తాతగారి ఆశ్రమం నుంచి అడిగి తెచ్చి వ్రతం పూర్తిచేసుకున్నారు . కానీ ఆ తరువాత ఆ పటము ఇవ్వడానికి వారికి మనసొప్పక దానిని తమ మందిరములోనే ఉంచుకున్నారు . ఆ తరువాత కొంతకాలానికి ఆ ఫోటో మందిరములో పెద్దదిగా అనిపించి గోడకు పెడితే బాగుండునని ఆలోచించి పూజలో నుంచి తీసేయగా అనుకోకుండా అనేక కష్టాలు వచ్చాయి . తిరిగి పూజలో పెట్టడంతో సమస్యలు తీరాయి . ఇలా ఒకసారి కాక రెండుసార్లూ అదే జరగడంతో వారికి ఆ ఫోటోను మార్చుట వలెనే కష్టాలన్న సంగతి గ్రహించి ఆ ఫోటోను పూజామందిరములో ఉంచిరి .
 

  అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1294 on: September 04, 2017, 04:42:57 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
            సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥   

                                             శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి .శైలజ )

తాతగారు అనేకసార్లు ఎక్కిన డి .సి .యం  అంటే ఇంట్లో అందరికీ ప్రాణం . దీనిపై ఆదాయంతో రెండస్థుల భవనం నిర్మించుకోగలిగారు . బాగా డబ్బు  గడించి  ధనవంతుల జాబితాలో  చేరారు . 13-1- 1993 నాడు రాత్రి 10 గంటల ప్రాంతములో తాతగారు తన ఆశ్రమంలో చంద్రారెడ్డి ,మదిలేటిని  బయటకు తీసుకువెళ్ళమని బలవంతం చేసి సతీష్ వాళ్ళింటికి వచ్చిరి కానీ లోపలకు రాలేదు . వీళ్ళ డి .సి .యం  లో ఎక్కి కూర్చుని తన చిరకాల భక్తుడైన కుమ్మరి లక్ష్మయ్య వద్దకు వెళ్లి అతనికి దర్శనభాగ్యం కలిగించి రాత్రి రెండు గంటల ప్రాంతం  వరకు ఊరంతా తిరిగి తిరిగి అప్పుడు ఇంటికి చేరిరి . తాత రాకకై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రాజేశ్వరి ప్రేమతో పెట్టిన భోజనమును ఆ అర్ధరాత్రి తిని విశ్రమించిరి . అప్పుడు తాతగారికి అలంకరణ చేయుటలో శ్రద్ధ వహించే రాజేశ్వరి తాతగారి చేతులకు ,పాదములకూ గోళ్లరంగు వేయగా తాత ఎటువంటి అభ్యంతరమూ తెలుపక వేయించుకొనిరి . ఇది జరిగిన రెండు రోజులకే తాత సమాధి చెందడంతో ఆనాడు ఆమె వేసిన గోళ్లరంగు అలంకరణతో తాత సమాధిలో కూర్చుండిపోయిరి . హైదరాబాదు వాస్తవ్యులైన చంద్రశేఖర్ రెడ్డి ,మల్లేష్ తాత దర్శనానికి కల్లూరు వచ్చి తాతగారు సతీష్ వాళ్ళ ఇంటిలో ఉన్న సంగతిని తెలుసుకుని అక్కడకు వచ్చి తాతను  ఎన్నిసార్లు రమ్మని పిలిచినా తాతగారు రాకపోవడంతో అక్కడే నిద్రించిరి .   . తెల్లగాతెల్లవారిన తరువాత   కూడా సతీష్ నిద్రలేవకపోవడంతో "డ్రైవరు లేరా " అంటూ అతనిని లేపి   కల్లూరు బయలుదేరేగా మల్లేష్ తాతగారికి లడ్డూ ప్రసాదముగా సమర్పించగా తాతగారు దానిని సతీష్ కిచ్చి " ఇంట్లో అందరకూ పెట్టు " అని పంపించిరి . తాత వాళ్ళింటికి వచ్చిన రోజు వీరు తాతకు స్వీటు పెట్టాలనుకుని  తాతగారు ఆలస్యంగా రావడంతో పెట్టలేదు . తరువాత తాతగారే వారికీ స్వీటు పంపించిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1295 on: September 05, 2017, 07:34:18 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.  యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                            శ్రీ రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

సతీష్ అక్కగారైన జయమ్మ తాత దర్శనానికి వెళ్ళినపుడొకసారి తాతగారు తాను  కూడా వస్తానని బయలుదేరేసరికి గుర్రబ్బండిని మాట్లాడి తాతను అందులో కూర్చుండచేసి తాము నడుస్తామంటే అప్పుడు తాతగారు " తల్లి పిల్లలం -మనకేంటి " ని వారిని కూడా ఎక్కమన్నారు . ఆ రకముగా వారిపట్ల మాతృభావనను చూపియించిన తాత ఎప్పుడూ వారిని అదే విధముగా ప్రేమించేవారు .

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1296 on: September 06, 2017, 04:11:06 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥ 

                                                      రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తాత సమాధి అప్పుడు అంతిమయాత్రకు ,మండలారాధనకూ వీరి డి .సి .యం  నే ఉపయోగించిరి . ఆ తరువాత తాతగారి మొదటి ఆరాధనోత్సవమును ఘనంగా నిర్వహించవలెనన్న ఆలోచనలో ఉన్న చంద్రారెడ్డి ఈ  పాత బండిని వద్దనీ ,కొత్తబండి నొకటి బాడుకకు తెస్తాననీ చెప్పగా రాజేశ్వరి ఎంతగానో బాధపడింది . అయితే అదే రోజు రాత్రి చంద్రారెడ్డి కలలో తాత కనిపించి అతని మెడ పట్టుకుని ఎందుకు వేరే బండి అని తిట్టేసరికి భయపడిన అతను మర్నాడే సతీష్ వాళ్ళింటికి వెళ్లి జరిగిన సంగతి చెప్పి ఆ బండినే తీసుకురమ్మని చెప్పాడు . తాతగారి ఆరాధన రోజున సమాధిపై వేసిన కండువా రాజేశ్వరికి బాగా నచ్చగా దాని ని  ఎలాగైనా ప్రసాదంలా ఇవ్వమని అడిగితే బాగుండుననుకుంది కానీ జనసందోహము మధ్య ధైర్యము చేయలేకపోయింది . అయితే ఆ మరునాడే మదిలేటి తాత సంకల్పముతో అదే కండువాను వీరికి తాత ప్రసాదముగా ఇచ్చాడు . ఆ రకముగా సమాధిలో నుండి కూడా తాత భక్తుల కోరికలు మన్నించి తీరుస్తున్నారని స్పష్టమౌతుంది .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

                                                   రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

మహాప్రసాదం :

రాజారావు గారి సతీమణియైన సత్యవాణి గారికి తాతగారితో అనేకానేక మధురానుభూతులు కలవు .   వీరికి భారం ఉమామహేశ్వరరావుగారి ద్వారా   తాతగారి గురించి తెలిసి వీరందరూ కలిసి తాత దర్శనానికై వెళ్లేవారు . ఎప్పుడు వీరు తాతగారి దర్శనానికి బయలుదేరినా తాతగారు కల్లూరులో ఎదురువచ్చి లోపలకు తీసుకుని వెళ్లేవారు . ఆ రకముగా ఎవరైనా ఇష్టమైన బంధువులు వస్తే ఇంటివారు ఆనందముతో ఎదురేగి  ఆహ్వానించినట్లుగా అని వీరికి అనిపించేది . సత్యవాణి గారు మొదటిసారి తాత దర్శనానికి  వెళ్ళేటప్పుడు మనసులో తాతగారికి నమస్కరించి తాతకు ఏది ఇష్టమో ఆ పదార్ధమునే తాను  తాతకు ప్రసాదరూపముగా తీసుకువెళ్ళేటట్లు చేయమని తాతగారిని ప్రార్ధించుకోగా పండ్లరసము ( ఫ్రూటీ ) తీసుకుని వెళ్లాలనిపించింది . వీరు తాత దర్శనానికి కల్లూరు చేరేసరికి తాతగారు ఇంటిలో లేరు . కొంచెం సేపు తాతకై వేచి చూసి ఇక ఆగలేక  తాతను వెదుకుతూ బయలుదేరిరి . కొంతసేపటి తరువాత  తాతగారు ఒక పేదవాళ్ల ఇంటి వద్ద ఉండడము చూసి అందరూ పరుగున పోయి తాతను దర్శించుకొని  అందరూ తాము తెచ్చిన పదార్ధములన్నింటినీ తాతకు సమర్పించిరి . అయితే తాతగారు ఒక్కొక్క పదార్ధమునూ చేతిలోకి తీసుకోవడమూ ఆ తరువాత ఆ ఇంటి పేదవారికి ఒక్కొక్క పదార్ధముగానే ఇచ్చి వారిని వారి వంటింట్లో భద్రపరచుకోమని చెప్పిరి . ఇక సత్యవాణిగారు తీసుకుని వెళ్లిన శీతల పానీయమును మాత్రము పక్కన పెట్టుకుని మొత్తం తాగిరి . అంతేగాక ,తాతగారు ఈమె తెచ్చిన  పిప్పరుమెంటును చప్పరించి ప్రసాదముగా ఈమెకే తిరిగి ఇచ్చిరి . గురువుగారి ఉచ్ఛిష్ఠము జ్ఞానబోధ కలిగించునని తెలిసిన వాణిగారు ఆనందముతో ఆ ప్రసాదమును స్వీకరించిరి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1298 on: September 08, 2017, 03:57:23 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥5.    కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
           గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥


                              రామావధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఇంకొకసారి తాత దర్శనానికి వెళ్ళినపుడు ఫలహారములను తీసుకొని వెళ్లారు . మూడురోజుల నుంచి ఎవరెన్ని రకముల పదార్థములు ,భోజనము పెట్టినా తాత ఏమీ తినకుండా కూర్చునే ఉన్నారు . భక్తులు అందరూ ఎంతో ఆతృతగా తాతగారు కనీసం ఏ ఒక్క పదార్థమైనా తింటే బాగుండును అనుకుంటూనే అప్పటికే మూడురోజులు గడిచిపోవుటచే అందరూ ఆందోళనలో నుండిరి . అయితే సత్యవాణిగారు ,రాజారావుగారు  లోపలకు ప్రవేశించడంతోనే తాతగారు సత్యవాణిగారిని చూసి 'ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి ' అని ఎంతో ఆత్మీయతతో పలుకరించడమే కాకుండా వారు తెచ్చిన ఫలహారములు స్వీకరించిరి . ఆ సమయములో తాత  దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందముగా మూడురోజుల నుంచీ ఏమీ తినని తాత ఇప్పుడు వాళ్ళు తీసుకుని వచ్చిన  ఫలహారము చేసిరంటే అది వీరి అదృష్టమేనని పొగిడిరి . సాయి భక్తులైన వీరు ఎక్కడకు వెళ్లినా సాయికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తాతగారి వంటి దైవస్వరూపులను మామూలు లౌకికపరమైన కోరికలను కోరుకోకుండునట్లు ,తాత వద్ద నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మికపరమైన సమస్యల సరియైన సమాధానము పొందునట్లు చేయమని వేడుకునేవారు . ఆ విధముగనే వీరు తాతను  రకరకముల ప్రశ్నలు వేసి వాటికి తగిన సమాధానములు తాత నుండే పొందేవారు .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   

                        శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

ఒకసారి తాతగారిని రాజారావు ,సత్యవాణి గార్ల ఇంటికి ఆహ్వానించిరి . వీరింటికి వచ్చిన తరువాత తాతగారిని వారు తమ పూజామందిరంలోనికి ఆహ్వానించి ,యథావిధిగా భక్తిశ్రద్ధలతో పాదపూజ సలిపి  పూలహారము వేయబోగా తాతగారు " పెద్దాయనకు వేయి పో !" అని హాలువైపు చూపించిరి . వీరి ఇంట్లో సాయిబాబా పటమును కుర్చీలో కూర్చుండబెట్టుట అలవాటు . రాజారావుగారు ఎక్కడ ఎవరి ద్వారా తమకు ఆశీస్సులు లభించినా అదంతా బాబాకు తమపై గల దయ అనిభావించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకునేవారు . వారి మనసును గ్రహించినట్లుగా తాతకూడా పూలహారమును బాబాకే వేయించి సాయిపట్ల వారికున్న భక్తిభావమును సుస్థిరపరచిరి . సత్యవాణిగారి ఆధ్యాత్మిక ప్రశ్నలన్నింటికి  తాతగారు సాధ్యమైనంత మౌనముగానే సందేశము లందించేవారు కాబట్టి ఆవిడయు తాతగారిని మౌనముగా జ్ఞానబోధ చేయు దక్షిణామూర్తిలా భావించేవారు . అందుకే తాతగారు తమ ఇంటికి వచ్చినపుడు పాదపూజ చేసి దక్షిణామూర్తి అష్టోత్తర పూజ తాతకు గావించి తాత తనకు జ్ఞానబోధ చేసి తన జీవితమును ధన్యమొందించవలసినదిగా మనస్ఫూర్తిగా విన్నపమును చేసికొనిరి . ఇక రాజారావుగారు తాత అనుమతి కోరి తాత పాదుకలను స్వీకరించి భద్రపరచుకొనిరి . ఆ రకముగా ఆ దంపతులకు ఆనందమునూ సంతృప్తినీ కలిగించిన తాత తిరుగు ప్రయాణమైరి . అప్పుడు రాజారావుగారు తాతగారితో ఎన్నిజన్మల భాగ్యవశముననో తాత నేడు తమ ఇంటిని పావనం చేసారంటూ లౌకికపరమైన మర్యాదను పాటిస్తూ చెప్పడంతో తాత ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి " నీదగ్గర ఇలాంటి కళలు కూడా ఉన్నాయా " అంటూ తీవ్రముగా కసిరారు . అప్పటి వరకు ఎంతో శాంతమూర్తిలా ,తమవాడులా ఉన్న తాత రౌద్రరూపము తాత చూపులోని తీక్షణత గమనించిన రాజారావుగారికి ఒక్కసారిగా జంకు కలిగింది . తాతగారికి ఇటువంటి నోటిమాటలతో పనిలేదనీ ,భగవంతుడు చూసేది మనసునే కానీ మర్యాదలు కావనీ అర్ధమయ్యి తమ తప్పు తెలుసుకున్నారు .

             
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1300 on: September 10, 2017, 03:49:08 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                         శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

దీనివలన తాతగారు ఎంత ఆత్మీయముగా ,ప్రేమగా తమ కృపను కురిపించగలరో అంతకన్నా కఠినముగా చిన్న తప్పును కూడా ఒప్పరని తెలుస్తోంది . అప్పటివరకు ఎంతో శాంతముగా వారి సేవ అనుగ్రహించి నప్పటికీ ఎప్పుడైతే లౌకిక మర్యాదగా నోటిమాటలు మాట్లాడారో తక్షణమే ఆ తప్పును ఉపేక్షించకపోవడం చుస్తే తాతగారు ఎంతగా "సిస్టమ్ " ను పాటిస్తున్నారో అర్ధమవుతోంది కాబట్టి మనం ఎంత క్రమశిక్షణతో ఉండాలో తాత ఈ చర్య ద్వారా తెలియచేసిరి .
 

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1301 on: September 11, 2017, 05:44:34 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ॥ 

                                 శ్రీరామవధూత జీవిత చరిత్ర ( టి  శైలజ )

ఆర్ధ్రత :

దోహ - ఖతార్ లో నివాసముండే సత్యనారాయణ భక్తుడు . అవధూత సాంప్రదాయముపై అవగాహన కలిగినవాడు . అతని మిత్రుడు షిరిడీలోని మహల్సాపతి గారి ఇంటినుండి 'శ్రీరామవధూత జీవిత చరిత్ర ' పారాయణ గ్రంధమును పొంది పారాయణ చేసి  పారాయణ చేయమని ఇవ్వడం జరిగింది . అప్పటికి తాతగారి పేరు కూడావినని వీరు తాత పారాయణ చేయుటకు నిర్ణయించుకోగా సత్యనారాయణ భార్య పద్మ పారాయణ ప్రారంభించిన మొదటిరోజు నుండే తాతగారు మహాద్భుత లీలలు చూపిస్తూ సప్తాహ పారాయణ పూర్తయ్యేసరికి ఆమెను తాత తన బిడ్డగా స్వీకరించిన అనుభూతిని ఆమె కొసగిరి . అప్పటినుండి కుటుంబమంతా తాతపట్ల భక్తిభావము కలిగి తాతను తమ కుటుంబ పెద్దగా భావించి మానసికముగా దగ్గరైరి . కేవలం గ్రంథ పారాయణ ద్వారా తాతగారి తత్త్వమును ,రూపురేఖలను ,లీలా మహాత్మ్యమును గ్రహించిన సత్యనారాయణ తాతగారిపై అద్భుతమైన పాటలల్లి తాతగారికి సమర్పించుకున్నాడు . భారతదేశానికి రావడంతోనే మొదటగా కల్లూరు చేరి తాతను దర్శించి ,ఈ పాటలను గానము చేయగా తాతగారు ఆ పాటలను అనుగ్రహించిన ప్రత్యక్ష నిదర్శనం అతడు పొందడం . తాత సమాధి వద్ద కుటుంబమంతా నిద్రచేసిన తరువాతే వారి గ్రామానికి వెళ్లారంటే వారు తాతను ఎంతగా   ఆరాధిస్తున్నదీ తెలుస్తోంది . ఇతని భార్య పద్మకు అనేకసార్లు తాతగారు స్వప్న సందేశము ద్వారా అనేక సంకేతములిచ్చి తానున్నానను ధైర్యము ,తృప్తీ వీరికి కలిగేలా చేసి తాతగారిని వారు ప్రత్యక్షముగా దర్శించలేక పోయామన్న అసంతృప్తి వారికే మాత్రమూ కలుగనీయకుండా అనుక్షణం తన అనుగ్రహం వీరిపై అపారంగా కురిపిస్తున్నారు . ఏ ఇతర అవధూతల దర్శనానికి వెళ్లినా ముందుగా వారు తాతగారి అనుమతిని పొందడం వలన ఆ అవధూతలు వీరిపట్ల ప్రత్యేక ప్రేమాదరములు కురిపించిన సందర్భములు కూడా వీరి అనుభూతి నొందిరి .
   
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1302 on: September 12, 2017, 03:59:56 PM »
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥ 

                           శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

2009 అక్టోబరు నెలలో కర్నూలు పట్టణానికి సంభవించిన తుఫాను భీభత్సాన్నీ , ఆ రోజు రాత్రి కర్నూలు పట్టణము ముంపుకు గురై కొట్టుకొని పోవచ్చను ప్రభుత్వ హెచ్చరికను టి  . వి  . వార్తల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ హృదయము కదిలి తాతగారి గ్రంథంలోని యుథోపియా దేశంలో సంభవించిన కరువు రక్కసిని రూపుమాపి తన శక్తికి అవధులు లేవని నిరూపించిన అవధూత రామిరెడ్డి తాత లీల మదిలో మెదలగా కర్నూలుకు వాటిల్లిన ముప్పును తాతగారు సమాధినుండి తన పాదం అడ్డుగా పెట్టుట ద్వారా తుఫాను భీభత్సాన్ని ఆపి కర్నూలు ప్రజలను ప్రాణహాని నుండి తప్పించమని హృదయము ద్రవించగా రాత్రంతా తాతను ప్రార్ధిస్తూ గడపగా తెల్లవారేసరికి మూడు అడుగుల నీరు తగ్గడమే కాక ఆ తరువాత ఒక్క వర్షపు చినుకు కూడా కురియక పోవడం వలన వరద ఉద్ధృతి క్రమంగా తగ్గింది . ఆస్తినష్టం పూర్తిగా వాటిల్లినప్పటికీ ఇతని ప్రార్ధన ప్రకారం ప్రాణ నష్టం ఏ మాత్రమూ జరగకపోవడం కేవలం తాత కటాక్షమేనని ఇతని నమ్మకం . ఆ రకంగా తాతగారు ఆనాడు సశరీరులుగా ఉండి ఇక్కడ నుండి భక్తుని ప్రార్ధన మన్నించి ఎక్కడో యథోపియా కరువు రూపుమాపినట్లుగానే ఇప్పుడు ఎక్కడో దూరప్రాంతం నుండి తాతను  ప్రార్ధించగా ఇక్కడ ఉన్న వరద భీభత్సాన్ని ఆపగలిగిన తాత తన శక్తికే కాక భక్తుల విన్నపానికి కూడా అవధులు లేవని చాటి చెప్పారు . కర్నూలు పట్టణం ఇంత ముంపుకు గురైనప్పటికీ కేవలం మూడు కి . మీ
   దూరంలోనున్న కుగ్రామము కల్లూరు ఏ మాత్రమూ వరద తాకిడికి కాకపోవడం కేవలం తాతగారి మహాద్భుత లీలలలో ఒకటి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1303 on: September 13, 2017, 04:37:58 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 10.  గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
           గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మైశ్రీ  గురవేనమః ॥

                                 శ్రీ రామవధూత జీవిత చరిత్ర (టి . శైలజ )
తన విన్నపాన్ని మన్నించిన తాతకు కృతజ్ఞత తెలుపుకోవడం మాత్రమే కాదనీ శవం కోల్పోయిన కర్నూలు వాసులకు తనకు  తోచిన సహాయ మందించడం తన కనీస కర్తవ్యంగా భావించిన సత్యనారాయణ ఖతార్ లోని తన మిత్రులైన 'తెలుగు కళా సమితి ' వారిని సంప్రదించగా సమితి నిర్వాహకులైన ప్రకాశ్ రావు ,రామకృష్ణులు వెంటనే విశేషంగా స్పందించి ఇంతటి బృహత్కార్యకామములో తమవంతు కృషిగా సభ్యులందరినీ ప్రోత్సహించి అందరి సహాయ సహకారములతో తమ వంతు కృషిగా సభ్యులందరినీ ప్రోత్సహించి అందరి సహాయ సహకారములతో వారే ఊహించని ధనము సమకూరగా రామసన్నిధానము -హైదరాబాదు వారి ద్వారా కర్నూలులో పన్నెండు రోజుల పాటు అన్నదానము ,కనీసావసరాలు తీర్చు కొన్ని వస్తువులు ,ఒక కుగ్రామములో గుడిసెలు వేయించి వారికి వస్త్రములు ,ధాన్యములు ,స్కూలు పిల్లలకు సకల వస్తువులను సమకూర్చిరి .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2373
  • View Profile
Re: శ్రీ రామవధూత జీవిత చరిత్ర
« Reply #1304 on: September 14, 2017, 05:09:51 PM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥     

                                శ్రీ రామవధూత జీవిత చరిత్ర ( టి . శైలజ )

తెలుగు కళాసమితి వారికి తాతగారి గురించి ఏ మాత్రమూ తెలియనప్పటికీ సత్యనారాయణ  వారికంతటి మహద్భాగ్యమును తాతగారు కల్పించిరనగా తాతగారికి వారి పట్ల గల ప్రత్యేక ప్రేమ అర్ధమౌతుంది . ఈ బృహత్ కార్యక్రమములో ప్రత్యక్షంగా కానీ ,పరోక్షంగా కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరిపై తాతగారి కృపావృష్టి అపారంగా కురుస్తుందనడంలో సందేహం లేదు . సత్యనారాయణ కుటుంబము మాత్రమే కాక ఖతార్ లో తాత పారాయణ చేసిన ప్రతి ఒక్కరినీ తాతగారు తన లీలలతో నిదర్శనములతో అలరిస్తున్నారు .

ఆ రకంగా తమ జీవితంలోకి తనంత తానుగా ప్రవేశించి లౌకికంగానే కాక ,ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని ప్రసాదిస్తున్న తాతకు ఆజన్మాంతం కృతజ్ఞతాంజలి సమర్పించుకోవడం తప్ప ఏమీ  లేదని వినమ్రముగా తాతకు  అంకిత భక్తులైరి .

                                                   త్వమేవ సర్వం మమదేవదేవ
                                           పదునాలుగవ అధ్యయము సంపూర్ణము

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!