Author Topic: శ్రీ సాయి సన్నిది - రేగేగారు  (Read 3332 times)

VijayaSri

  • Newbie
  • *
  • Posts: 26
    • View Profile
ఓం శరణం సద్గురు చరణం
జై సాయి రామ్
జై సాయి మాస్టర్

గురు కుటుంబానికి నమస్కారాలు
గురు బందువులందరికి  నమస్కారాలు"శ్రీ సాయి సన్నిధి"లో రేగేగారిని శ్రీ సాయి గడ్డం పట్టుకొని బ్రతిమాలి మరి అడుగుతారు, " నీకు ఏమి కావాలని ?", రేగేగారు " ఈ జన్మలో మరియు ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోను  మీరు నన్ను విడువగూడదు " , అని కోరుతారు.

నా సందేహం ఏమిటంటే


శ్రీ సాయి తన ఉచ్చిష్టాన్ని తానే స్వయంగా రేగేగారికి తినిపించారు. అంతటి భాగ్యశీలి శ్రీ రేగేగారు .

ఆయన అందరు కోరే శాశ్వతమైన పరమాత్మస్థానం (మోక్షం ) కావాలని కోరలేదు. వారి భావం ఏమై ఉండవచ్చు అని తెలుసుకోవాలని , అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను . పరమ లక్ష్యమైన మోక్షాన్ని కూడా అయన కోరదలచలేదా ? దానిని కూడా సాయి అంతటగానే ప్రసాదిస్తేనే పొందాలని వారి భావమా ? తానుగా కోరకూడదన వారి భావమా?.

మరి రేగేగారి అంతరార్థ్యం  ఏమిటి ? దయచేసి తెలియపరచగలరు.

జై సాయి మాస్టర్.
« Last Edit: February 01, 2016, 09:19:25 PM by VijayaSri »

VijayaSri

  • Newbie
  • *
  • Posts: 26
    • View Profile
ఓం శరణం సద్గురు చరణం
జై సాయిమాస్టర్,

శ్రీ స్వామి సన్నిధి " భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి " వారితో వారి సేవకుల అనుభవాలు - రచన  శ్రీ పెసలు సుబ్బరామయ్య గారు  పుస్తకం నుండి

భగవద్భక్తుడైన శ్రీ అన్నమాచార్యగారంటారు  :


ఓ దేవాదిదేవ ! నీ కొలువున నర్తకులమైన మేము ఆడి , పాడి, మీకు వినోదము కల్గించవలెనుకాని, మోక్షమిమ్మని మిమ్మడుగ తగునా? మాకు అర్హతగలదని మీకు తోచినప్పుడు అది మీరు మాకు అనుగ్రహించవలసినదేకదా!

అంటే ఆట పాటలుగా సాగుతున్న మన జీవిత విధానం ద్వారా ధర్మమాచరించి  భగవంతునకు ప్రీతి కల్గించి, మోక్షమునకు అర్హత సంపాదించాలని శ్రీ అన్నమాచార్యగారు పై చరణము ద్వారా మనకు బోధిస్తున్నారన్నమాట . ఆచార్య శ్రీ భరద్వాజ మాష్టరుగారు 01-11-95 ' సాయిబాబా ' అనే పత్రికలో వ్రాస్తారు:- ' నోటిమాటలతో ముక్తిని గూర్చి వాపోయి ప్రయోజనమేముంది. అర్హత సంపాదించుటకు , సాధన దీక్షతో చెయ్యాలి. అర్హత గల్గినప్పుడు మనము దానిని వద్దన్నా భగవంతుడు అనుగ్రహించి తీరుతాడు. గనుక సాధన ద్వారా అర్హత సంపాదించుటయే మన ధ్యేయం కావాలి '.

జై సాయిమాస్టర్.