జై సాయి మాస్టర్ !
Swachamaina nammakam ante Bhakta Kannappa bhakti veru. andulo bhayam kanapadadu. kaani alanti bhaktulu ee rojullo bahu arudu kada. manam ippudunna paristitula drustya maatladukuntunnamu kada.
"మూఢనమ్మకము" గురించి కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను.
కొంతమంది ఉపవాసం చెయ్యలేరు కానీ భయంతో చేస్తారు.ఇప్పటికీ జరుగుతున్నవే. (బాబా,మాస్టర్ గారు వాటిని ప్రోత్సహించ లేదు).
మరొక విషయం నాకు అర్ధం కాదు. ఒక సారి మేము మెహబూబ్ నగర్ వెళ్ళాము అక్కడ ఎవరో ఇద్దరు ముస్లిం మహనీయుల సమాధులు ఉన్నాయి.
అక్కడ వాళ్ళు చెఫ్ఫారు ఈ పరిసరాలు వాళ్ళ అనుగ్రహముతో ఉన్నాయని. మేము నంస్కరించుకుని వద్దామని వెళ్ళాము.ఎవరో తెలియదు కదా,బాబాని స్మరించి నమస్కరించుకున్నాము. అప్పుడే ఎవరో ముస్లిం మహిళలు అక్కడకు వచ్చి మా వంక చాలా కోపంగా చూసి.వాళ్ళ పిల్లలను ఆ సమాధులు తాకవద్దని కసురుకున్నారు. వాళ్ళు బయటనుంచే నమస్కరించుకుని వెళ్ళిపోయారు.
నాకు విషయం అర్ధం కాక చాలా బాధగా అనిపించింది.తరువాత మా పాప చెప్పింది వాళ్ళలో ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకోడదుట. బయటనుంచే నమస్కరించుకోవాలట. పురుషులు మాత్రమే లోపలికి వెళ్ళవచ్చునట. ఆ సమయంలో నాకు బాబా,మాస్టర్ గారు అంత ఎత్తులో కనిపించారు,వారి గొప్పతనం నా మనస్సులో ఇంకా పెరిగింది.(మనకు ఏ నియమాలు పెట్టకపోయినా మనం ఇలా ఉన్నామే అనిపించింది

).
పాపం వాళ్ళకు ఇలా చాలా ఉన్నాయిట, ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులం. మాస్టర్ గారు మనకు ఎన్ని మార్పులు తెచ్చారో.
సర్వ జీవులను మీ కరుణతో కాపాడుతున్న మీకు మా నమస్కారములు తండ్రి.
జై సాయి మాస్టర్!