Author Topic: తెలుగు లో బాబా హారతులు  (Read 3011 times)

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
తెలుగు లో బాబా హారతులు
« on: November 13, 2016, 07:13:07 PM »
తెలుగు లో బాబా హారతులు
-----------------------------
కొంత కాలం  బట్టీ నేను షిర్డీ హారతులు తెలుగు లో తర్జుమా చేసినవి వింటున్నాను. భావం చెడిపోకుండా (నాకు అర్ధం అయినంత మట్టుకూ) ఎంతో బావున్నాయి. అన్ని హారతులూ.
మనం ఇంకా మరాఠీ హారతులు ఎందుకు పాడుతున్నాం? ఎందుకంటున్నానంటే హారతిలో లీనమవ్వడం అనేది ఆ భావం మనం అందుకుంటేనే వస్తుంది. మరి మనకి అర్ధం కానీ భాషలో హారతి పాడితే అది ఎదో మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్నట్టుంటోంది అని నా అభిప్రాయం. వాటి కాపీ రైట్స్ గట్రా నాకు  తెలీవు కానీ తెలుగు లో అద్భుతంగా ఉన్నాయి.
మా ఇంటి దగ్గర బాబా గుడిలో చెపుదామని నా కోరిక. అయితే అదేదో నా ఒక్కడి కోరిక కాదు ఇంకా దాని మీద ఏమి వివాదం లేదు అంటే చెబుదామని.

మీ అభిప్రాయాలు చెప్పండి

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #1 on: November 14, 2016, 02:28:46 PM »
జై సాయి మాస్టర్!

మరాఠి ఆరతులు బాబా స్వయంగా ఆయనే వ్రాయించుకున్నవి.పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శ్రీ సాయి లీలామృతము - సాయి - సాంప్రదాయము (అధ్యాయం 13) ఒకసారి చదవండి. తరువాత చెప్పండి. ఎలా బావుంటుందో.
శిరిడీ ఆరతులు అనే చిన్న గ్రంధము అందులో మాస్టర్ గారు ఆరతుల అర్ధం చక్కగా వివరించారు. అది కూడా ఒకసారి చదివి బాగా ఆలోచించండి.  :)

జై సాయి మాస్టర్!

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #2 on: November 14, 2016, 10:29:01 PM »
జై సాయి మాస్టర్ !!!! మీరు చెప్పినట్టుగానే సాయి లీలామృతం 13 వ అధ్యాయం చదివాను. మాస్టారు అందులో భావమెరిగి పాడుకోవడం శ్రీయ స్కరo అన్నారు. మరి అలాంటప్పుడు అంత మంచి భావం దొరుకుతున్నప్పుడు మంచిదే కదా. భగవానుడు భావ ప్రియుడు కదా. అయితే భావాన్ని భాష అందులో మాతృ భాషలో కంటే ఎందులో వ్యక్తo చెయ్యగలo ? నేను శిరిడీ హారతులు చదవలేదు కారణం నా దగ్గర ఆ పుస్తకం లేదు. నా నోటి వెంట వచ్చే మాట, పాట, నాకు ఆయనతో సాన్నిహిత్యం పెంచాలి. దానికి నా భాషని మించింది లేదని నా నమ్మకం. మాస్టారి స్వదస్తూరి తో రాసినవి కూడా మన భాష రాని వారికోసం తర్జుమా చేస్తున్నాం ఎందుకంటే వారికి ఆ Connect వస్తుంది కాబట్టి.

G.Sudhakar

 • Guest
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #3 on: November 15, 2016, 07:23:54 AM »
ప్రవచనములులో ఒకచోట చెప్పారు: తెలుగు హారతుల ప్రాశస్థ్యము. నేను ఎక్కువకాలము తెలుగులోనే పాడేవాడిని. బావుంటాయి (సాయిదాసు గారు వ్రాసినవి మాష్టరుగారు నెల్లూరులో ఆవిష్కరించారు).

అయితే విజ్ఞాన వీచికలలో ఒకచోట వేరొక భాషలోని ప్రార్ధనలు మనకు తెలియకుండా లోతులలో భావాలను కలిగించగలవు అని ఉదాహరణలు కూడా ఇచ్చారు.

కనుక: దేని ప్రత్యేకత దానిదే.

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #4 on: November 15, 2016, 09:31:03 AM »
సుధాకర్ గారు..మీకు ఆ హారతులు తెలుగు లో తర్జుమా చేసిన ఆయన ఎవరో తెలుసా...సాయి దాసు గారు ఎవరు? నేను చెప్పేవి మీరు చెప్పేవి ఒకటేనా అని రూఢీ చేసుకుంటున్నాను..ఎందుకంటే.నేను చెప్పేవి CDs రెండు..

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #5 on: November 15, 2016, 12:11:22 PM »
జై సాయి మాస్టర్!

సరైన పద్దతిలో ఆరతులు,పారాయణ జరుగుతున్నప్పుడు దానిని మార్చే ప్రయత్నం మనం చెయ్యకోడదు.చాలా చోట్ల మరాఠీ ఆరతులే సమ్మతము.   

(నాకు బాబా గుడి తెలియదు,సాయి దాసుగారు తెలియదు నా అభిప్రాయం చెప్పాను అంతే  :)   )

జై సాయి మాస్టర్!


           

Dwarakanath

 • Administrator
 • Hero Member
 • *****
 • Posts: 2462
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #6 on: November 16, 2016, 01:54:07 AM »
Jai Sai Master!!

KittuLahrigaru,

1) Naaku maraathi paadutunnappudu kooda bhaavam kudurutunnadi.. Mastergaru raasina haaratulalo ardham iccharu kada. Maraathilo paadite bhaavam lekapovadam anedi naaku jarugaledu.

2) Inko vishayam yemitante, aaratulalo chaala bhaagam samskritamlo unnadi. Aa slokaalanu telugulo tarjuma cheste, vaatiloni bhaavam sarigga represent avvaledanipinchindi. Naaku avi samskritamlone marinta lotaina bhaavaanni kaligistunnayi.

3) Mastergaru deeniki icchina samaadhanam yemitante, adi vere bhaashalo undatam valana manassu marinta nilustundi ani. Aa vishayam chaalaa saarlu chepparu kooda. Kanuka nenu andarini alaane cheyyamni, ardham chaduvukoni, maraathi bhaashalone paadamani protsahistaanu.

4) Baba kori raayinchukunna aa aaratulu alaa paadukovatamlo oka maadhuryam unnadi.

5) Meeku adi ibbandi anipinchi telugulo baagunte, alaage paadukovacchu anipistundi.  Meeku yedi sreyaskaramo cheppadaaniki memu yevaramu? Mastergaarini manasulone aa prasna adigi, mee kaaryakramam meeru chesuku pondi.

Jai Sai Master!

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #7 on: November 16, 2016, 11:47:17 AM »
జై సాయి మాస్టర్ !!!!

ద్వారకానాధ్ గారు..

౧. నేను మాష్టారు గారు రాసిన హారతుల అర్ధం చదవలేదు. అవి చదివాకా ఆ భావం నిలుపుకుంటూ వింటాను. మరాఠీ లో భావం లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయితే ఎంత మంది హారతి భావాలు తెలిసి పాడుతున్నారు అనేదే ప్రశ్న. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆ భావాన్ని పొందాలని (అది క్షణ కాలమైనా) నా కోరిక. ఎందుకంటే నేను వెళ్లిన చాలా హారతుల్లో నాతో సహా చాలా మందికి ఏం పాడుతున్నామో తెలీదు.

౨. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నా ముందు వ్యాఖ్య లో రాసినట్టు మనం అందరం ఒకటే హారతి గురించి మాట్లాడుతున్నామా అని నా అనుమానం. నేను చెప్పేది "పార్ధసారధి, S . P . బాల సుబ్రహ్మణ్యం, సుశీల" గారు పాడినవి

త్రీ. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మాస్టారి భావాలని మీ కంటే చెప్పా గలవారు లేరు

౪. నాకు ఇది ఎక్కడ మొదలయిందంటే భగవాన్ శ్రీ రమణ మహర్హి ని  సంస్కృతం లో ఉన్న ఉపదేశ సారాన్ని ఆంధ్ర భాషలో రాయమని అడిగితే ఆయన ఆంద్ర భాషలో "ఉపదేశ సారం" రాశారు. నేను మొదటి సారి ఉపదేశ సారం విన్నప్పుడు (సంస్కృతం లో) కింద ఇంగ్లీష్ లో ఉండే భావాన్ని చదివాను ఎందుకంటే నాకేమి అర్ధం కాలేదు. తరువాత పుస్తకం ఇంకా అందులో ఇఛ్చిన వివరణ తో ఇప్పుడు భావాన్ని తెచ్చుకుంటున్నాను. అయితే ఎంత మంది సంస్కృతం లో కానీ ఇతర భాషలో ఉన్న వాటి భావాలని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు అనేది ప్రశ్న. అదే నా ప్రశ్నకి మూలం.

మీ కాలం వెచ్చించి వివరంగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు

అలాగే చాలా కాలం బట్టీ నా మనసులో ఉండే ఇంకొన్ని ప్రశ్నలు వేసాను "ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం" లో. దయ చేసి వాటికి కూడా సమాధానం చెప్పగలరు. మీరు ఇది వరలో చెప్పి ఉన్నా కూడా మళ్ళీ వివరించ వలసింది ఎందుకంటే నా ఆలోచన కి అందడం లేదు అది.

రవి కృష్ణ .పీ.

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #8 on: November 16, 2016, 12:50:49 PM »
జై సాయి మాస్టర్!

jai sai mastar KittuLahrigaru,
Quote
౨. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను నా ముందు వ్యాఖ్య లో రాసినట్టు మనం అందరం ఒకటే హారతి గురించి మాట్లాడుతున్నామా అని నా అనుమానం. నేను చెప్పేది "పార్ధసారధి, S. P . బాల సుబ్రహ్మణ్యం, సుశీల" గారు పాడినవి


మీకు భావం నిలవకపోయినా ఫరవాలేదు వాటికన్నా మీరు మరాఠీ ఆరతులే పాడుకోండి బాబా నిజంగా ఆనందిస్తారు.
ఆయన మీకు భావం నిలచేలా చేస్తారు. క్రమముగా అలవాటవుతుంది. మాస్టర్ గారి శిరిడీ ఆరతులు గ్రంధం చూసి పాడుకోండి.మీరు పైన చెప్పిన వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు కాదు. బాబాకి భక్తి ప్రధానం.

జై సాయి మాస్టర్ ! 

mca.teja

 • Jr. Member
 • **
 • Posts: 57
 • Akkala Kota swami vari padhukalu
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #9 on: November 16, 2016, 03:01:42 PM »
Jai Sai Master

neanu aaratulu padetappudu marati lo unna sentence ki kinda Master gaaru raasina Telugu  bhaavanni ( okkoka sentence or konni padalaku) pencil tho rasukoni padetappudu bhavanni ardam chesukontu konni rojulu nearchu kunnanu appudu ardamu and bhavamu nilustunnaye  meeku estam aitay  try cheyandi

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #10 on: November 16, 2016, 09:23:58 PM »
Jai Sai Master
Kittulahri ani unto aadavaalu anukunanu. Eakkuvaga cheppanemo sorry.
Jai Sai master

G.Sudhakar

 • Guest
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #11 on: November 17, 2016, 11:51:36 AM »
I will get the book, scan and upload. Will take some time.
(btw, I know saidas gaaru. He used to sing bhajans)

Jagadish

 • Newbie
 • *
 • Posts: 27
 • Jai Sai Master
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #12 on: December 28, 2016, 12:55:25 PM »
Sri Guru Charitra lo Nandi Sarma chesina Stotram lo Chando doshalu unnappatiki daanni pandithulu sari cheya bothey - Sri Gurudu oppukoka "Adhi alaane chadavali ani" chepparu kada.

Mari alaantappudu Sai Nathude kori rayinchu kunna Sai Arathulu kuda "Alaane chadavali" kada ....... Endukante avi Mantrala tho samanam!!

Vedam lo unna mantrala ni, Suktalani Telugu lo ki translate chesi chadavamu. Sanskrit nerchukuni aa basha lo ne chaduvuthamu. Translate cheyyadam andari valla ayye pani kaadu.

Aa Rushi ey Chaitanya Kakshya lo undi rasaro - aa kakshya lo unna vaaru matrame cheyya galige pani adhi. (For Ex: Vyasa Maharshi Sanskrit lo rasina Bhagavatanni Sri Pothanaamathyulu Teluginchinattu)

Leka pothey Master EK garu cheppinattu "Pindi mara anuvadhaalu" chesina Medhavula ga migilipotham.

Pindi mara lo chudandi - oka pakka nunchi biyyam vesthunte, inko pakka nunchi biyyappindi vachesthundi. Alaa chala mandi medhavulu Sankrit, Hebrew, Arabic lo ni Mantralani pichi anuvadalu chesaru.

Manam Peddalu nadachina margam lo vellale gaani Pandithula margam lo vellakudadhu - Master EK
Jai Sai Master!!

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #13 on: December 29, 2016, 07:17:23 PM »
జై సాయి మాస్టర్! 

Quote
Aa Rushi ey Chaitanya Kakshya lo undi rasaro - aa kakshya lo unna vaaru matrame cheyya galige pani adhi

అందుకే శ్రీ గురుచరిత్రను తెలుగులో అనువదించే సామర్ధ్యము ఫూజ్య శ్రీ మాస్టర్ గారికి మాత్రమే కలిగినది.
ఎందుకో ఈ వాక్యం చదివినప్పుడు మాస్టర్ గారు గుర్తుకొచ్చారు.         
Quote

Manam Peddalu nadachina margam lo vellale gaani Pandithula margam lo vellakudadhu - Master EK
 
కొంచం దీనికి వివరణ చెప్పగలరా? నేను EK గారి గ్రంధాలు చదవ లేదు. Homeo కి వెడతాను.

జై సాయి మాస్టర్!

Jagadish

 • Newbie
 • *
 • Posts: 27
 • Jai Sai Master
  • View Profile
Re: తెలుగు లో బాబా హారతులు
« Reply #14 on: January 06, 2017, 03:59:55 PM »
Jai Sai Master!

Quote
కొంచం దీనికి వివరణ చెప్పగలరా? నేను EK గారి గ్రంధాలు చదవ లేదు. Homeo కి వెడతాను.

Master EK garu oka speech lo anna matalu ivi.

పండితులు (ఈ రోజుల్లో నాలుగు గ్రంధాలూ చదివిన వాళ్ళందరిని ఆ పేరు తో పిలుస్తున్నాం అనుకోండి ) చెప్పేవాటిల్లో ఎంతో అద్భుతమైన విషయాలూ, అత్యంత సంభ్రమాశ్చర్యాలు గొలిపే  విశేషాలు ఉండవచ్చు. కానీ పనికి వచ్చేది తక్కువ.
కానీ మహాత్ములు మాట్లాడే విషయాలలో/మాటలలో  గాని పెద్దగా ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నట్టు కనిపించకపోవచ్చు .  కానీ పనికి వస్తాయి.
ఉదా :  ఒకడికి చిన్నప్పటి నుంచి తీపి పెట్టకుండా పెంచారు అనుకోండి . చక్కెర అంటే ఏంటో కూడా తెలియని వాడిని, Sugar Production లో పట్టభద్రుడిని కూడా చేసారు అనుకోండి. వాడు నోరు విప్పితే Sugar గురించే మాట్లాడతాడు, కానీ దాని రుచి  ఎలా ఉంటుందో వాడికి తెలియదు . 
కానీ వాడి కొడుకు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి దీన్ని Sugar అంటారు అని కూడా తెలియదు, కానీ నోట్లో వేసింది వాళ్ళ అమ్మ,  కాబట్టి దాని రుచి తెలుసు.

 ఇప్పుడు Sugar రుచి గురించి మాట్లాడే వాడు ఒకడున్నూ  (so called పండితుడు), Sugar రుచి తెలిసిన వారు ఒకళ్ళున్నూ (మహాత్ముడు)  కదా .....
కాబట్టి మహాత్ములు చెప్పినది ఆచరిస్తే తరిస్తాము, దానికి మహాత్ములు హామీ . పండితులు చెప్పినది ఆచరిస్తే తరిస్తామా లేదా అనేందుకు పండితుడు హామీ ఇవ్వలేడు .....
« Last Edit: January 06, 2017, 04:01:44 PM by Jagadish »
Jai Sai Master!!