Author Topic: తిరువత్తీర్ పిచ్చివాడు  (Read 624 times)

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
కేరళలో తిరువత్తీర్  అని ఒక జ్ఞాని  ఉండేవాడు.
ఆయన్ను "తిరువత్తీర్ పిచ్చివాడు" అని పిలిచేవారు.

ఆయన రోజూ ఒక పెద్ద బండ రాయిని ఎంతో కష్టపడి శ్రమకోర్చి ఒక పెద్ద కొండ పైకి మోసుకుంటూ తీసుకెళ్ళేవాడు.
తీరా అక్కడికి తీసుకెళ్ళిన తరువాత, ఆ బండ రాయిని అక్కడ నుంచి క్రిందకు తోసివేసేవాడు.   

ఆ ఊరి వారంతా ప్రశ్నించేరు
"ఓరి పిచ్చివాడా! ఎంతో శ్రమకోర్చి ఆ బండ రాయిని ఆ పెద్ద కొండ పైకి మోసుకుంటూ తీసుకువెళ్ళి, అక్కడనుంచి పడేస్తున్నావు" 
"నీ శ్రమంతా వృధా కావట్లేదు?"


దానికి తిరువత్తీర్   ఇలా సమాధానం ఇచ్చాడు

"ఈ భూమ్మీదే శాశ్వతంగా ఉండమని తెలిసినా కూడా,  అశాశ్వతమైన బంధాల మధ్య ఇరుక్కొని, నా భార్య, నా పిల్లలు అనుకొంటూ

రాగ ద్వేషాలతోటి, మాయా బుద్దులతో ,  కపటాలోచనలతో కూడి లెక్కకు మించి ధన సంపాదనకొరకు ఎన్నో దుష్ట కర్మలాచరిస్తున్నారు.

ఇంతా చేసి, భార్య  పిల్లలను, చివరకు ఈ  లోకాన్ని  విడిచిపోతున్నారు :)


మీరు చేసిన వృధా తో పోలిస్తే నా వృధా ఒక లెక్కా?  అని పక పక నవ్వాడు.

అక్కడ ఉన్నవారు అందరూ తలలు దించు కొన్నారు. 

 


TAKEN from "Ramanulu Cheppina kadhalu"

« Last Edit: August 04, 2008, 02:46:54 PM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana

WhoAmI

 • Hero Member
 • *****
 • Posts: 577
 • Have you seen yourself ???
  • View Profile
  • Self Enquiry (search yourself)
Re: నారయణత్తు భ్రాంతన్
« Reply #1 on: August 05, 2008, 02:19:24 PM »
ఒక సవరణ. ఇతని పేరు తిరువత్తీర్ కాధు....నారయణత్తు  భ్రాంతన్ (నారయణత్తు  పిచ్చివాడు అని అర్ధం)

ఈ జ్ఞాని గురించి రమణ భగవాన్ ఇంకా ఇలా చెప్పారు.....

భిక్షాటనలో దొరికిన బియ్యం, పప్పులు ఇతను స్వయముగా వండుకొని తినేవాడు. అగ్ని స్వయంగా రాజేసేవాడు కాదు.
ఎక్కడ అగ్ని దొరికితే అక్కడ వండుకొని తినేవాడు. 
ఒకసారి శ్మశానంలో చితాగ్ని పై అన్నం వండుకొని తిని, అక్కడే పడుకొన్నాడు. 

ఆ రాత్రి కాళికా అమ్మవారు నాట్యం చేయడానికి తన అనుచర గణంతో అక్కడికి వచ్చారు. ఇతను అడ్డముగా పడుకొని ఉండడం చూసి అతనిని లేపి బైటకు వెళ్ళమని హూంకరించారు.

తాను బైటికి పోనని, వారినే బైటకు పొమ్మని కసిరి, మళ్ళీ  పడుకొన్నాడు నారయణత్తు.

అపుడు  కాళికా అమ్మవారు "మమ్మల్ని చూస్తే భయం కలుగట లేదా?" అని ఆశ్చర్యంగా అడిగింది. 

దానికి నారయణత్తు "నేనే ఇన్ని రూపాలుగా మారి కనపడుతున్నాను. నన్ను చూస్తే నాకెందుకు భయము?"  అని ఎదురు ప్రశ్నించాడు.

ఆ జవాబుని దేవతలు ఎంతో మెచ్చుకొని "ఏదైనా వరం  కొరుకోమన్నారు" 

నారయణత్తు "నాకేమీ అక్కరలేదన్నాడు"

దేవతలు "ఒకసారి తాము కోరుకొమ్మని అడిగిన తరువాత అవతలివారు తప్పనిసరిగా కోరుకొనవలసిందే" అని అన్నారు

నారయణత్తు "అయితే సరే! నా కుడి కాలు బోదను ఎడమ కాలికి మార్చమని" కోరాడు. 


దానికా దేవతలు విస్తుపోయి "బోదకాలు ఎడమ కాలికి ఉంటే ఏంటి? కుడి కాలుకి ఉంటే ఏంటి? ఏదైనా ఒక్కటేగా. ఏ లాభమూ లేదు కదా? " అని అడిగారు.

నారయణత్తు చెప్పాడు. 

"అవును. మీరు నాకు వేరే ఏ వరము ఇచ్చినా కూడా ఇంతే! ఈ శరీరానికి ఏ లాభమూ లేదు. అసలు ఆత్మ లాభానికి మించింది ఇంకొకటి నిశ్చయంగా లేనే లేదు. అలాంటి ఆత్మను నేనై ఉన్నాను. నాకు ఇక ఏమీ అక్కరలేదు. అయినా మీరు ఏ  గొప్ప వరమిచ్చినా ఈ శరీరంతో పాటు  నాశనమైపోయేదేగా  ;D."    అని నవ్వాడు.

దేవతలు ఎంతో ఆనందంతో ఇతనిని ఆశీర్వదించి వెళ్ళారు .« Last Edit: August 05, 2008, 05:37:37 PM by WhoAmI »
Let attachment to the physical body end and unite with you, O Arunachala Ramana